E-Paper
Advertisement

CCTV కంటే డేంజర్‌గా మారనున్న Wi-Fi.. ఇంట్లో మనుషుల కదలికలను కూడా పసిగట్టొచ్చంటున్న నిపుణులు!

CCTV కంటే డేంజర్‌గా మారనున్న Wi-Fi.. ఇంట్లో మనుషుల కదలికలను కూడా పసిగట్టొచ్చంటున్న నిపుణులు!
Advertisement

Wi-Fi Signals Tracking: మనం ఇంట్లో ఇంటర్నెట్ వాడుకోవడానికి వైఫై రూటర్‌ను ఒక సాధనంగా మాత్రమే చూస్తాం. కానీ, భవిష్యత్తులో ఈ వైఫై సిగ్నల్స్ మనల్ని నిరంతరం గమనించే నిఘా నేత్రాలుగా మారే ప్రమాదం ఉందని జర్మనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనం చేతిలో ఫోన్ గానీ, ఎలాంటి స్మార్ట్ డివైజ్ గానీ పట్టుకోకపోయినా, ఇంట్లో మనం ఎక్కడున్నామో కనిపెట్టే సరికొత్త సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

బీఎఫ్ఐడీ టెక్నాలజీ అంటే?

జర్మనీలోని కార్ల్స్‌రూహే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు BFId (బీమ్‌ఫార్మింగ్ ఫీడ్‌బ్యాక్ ఇన్ఫర్మేషన్) అనే సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇది సాధారణ వైఫై సిగ్నల్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా మెషిన్ లెర్నింగ్‌ను జోడించి పనిచేస్తుంది. మన ఇంట్లో తిరిగే వ్యక్తులను, వారి కదలికలను బట్టి వారు ఎవరనేది ఇది ఖచ్చితంగా గుర్తించగలదు.

వైఫై మనుషుల్ని ఎలా గుర్తిస్తుంది?

Advertisement

మనం రూమ్‌లో నడుస్తున్నప్పుడు మన శరీరం వల్ల వైఫై రేడియో తరంగాలలో కొన్ని మార్పులు వస్తాయి. ప్రతి మనిషి శారీరక ఆకృతి, ఎత్తు, నడిచే శైలి వేర్వేరుగా ఉంటాయి. ఈ మార్పులను BFId టెక్నాలజీ ఒక సిగ్నేచర్‌లా రికార్డ్ చేసుకుంటుంది. దీని ఆధారంగా ఇంట్లో ఉన్నది ఎవరో పక్కాగా ఈ సిస్టమ్ చెప్పగలదని పరిశోధకులు నిరూపించారు.

Also Read: ఫోల్డబుల్ ఫోన్ల రికార్డ్ బ్రేక్.. ఏకంగా 7000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వస్తోన్న Vivo X Fold 6!

సీసీటీవీ కంటే ప్రమాదకరమా?

Advertisement

సాధారణంగా సీసీటీవీ కెమెరాలు ఉంటే అవి ఉన్న దిశలోనే రికార్డ్ చేయగలవు. పైగా వాటిని మనం చూసి గుర్తుపట్టవచ్చు. కానీ వైఫై తరంగాలు గోడలను దాటుకుని కూడా ప్రసరిస్తాయి. దీనివల్ల కెమెరాలు లేని బెడ్‌రూమ్స్, బాత్‌రూమ్స్ వంటి అత్యంత వ్యక్తిగత ప్రదేశాలలో కూడా మన కదలికలను ఇతరులు పసిగట్టే ప్రమాదం ఉంది. హాకర్ల చేతికి ఈ టెక్నాలజీ చిక్కితే మన ప్రైవసీ పూర్తిగా ప్రమాదంలో పడుతుంది.

ఆందోళన పడాల్సిన అవసరం ఉందా?

ప్రస్తుతానికి మనమంతా వాడుతున్న వైఫై రూటర్‌ల వలన ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే.. ఇది ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. అయితే, రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఇప్పుడే కఠినమైన నిబంధనలు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతికత పెరగడం మంచిదే కానీ, అది మన వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉండకూడదు కదా.

Also Read: కనీ వినీ ఎరుగని ఆఫర్.. 70 రోజుల పాటు రోజూ 3GB డేటా.. BSNL కొత్త ప్లాన్ చూశారా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×