E-Paper
Advertisement

5 స్టార్ ఏసీ బెనిఫిట్స్, ఎక్కువ ధర పెట్టినా.. ఆ తర్వాత అంతా లాభమే!

5 స్టార్ ఏసీ బెనిఫిట్స్, ఎక్కువ ధర పెట్టినా.. ఆ తర్వాత అంతా లాభమే!
Advertisement

5 Star AC Benefits: ఎండలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ఏసీ కొనడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు 3-స్టార్ ఏసీ కంటే.. 5-స్టార్ ఏసీ ధర సుమారు రూ. 5,000 నుంచి రూ. 7,000 వరకు ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలా మంది డబ్బులు ఆదా అవుతాయనే భ్రమతో 3-స్టార్ ఏసీని ఎంచుకుంటారు. కానీ నిజానికి.. 5-స్టార్ ఏసీ కొనడమే మీ వాలెట్‌కు నిజమైన స్మార్ట్ ఛాయిస్. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

5-స్టార్ ఏసీ వల్ల మీ డబ్బు ఎలా ఆదా అవుతుంది?

Advertisement

1. తక్కువ కరెంట్ ఖర్చు : 
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) ఇచ్చే స్టార్ రేటింగ్స్ ఏసీ కరెంట్ పొదుపు సామర్థ్యాన్ని సూచిస్తాయి. స్టార్స్ పెరిగే కొద్దీ కరెంట్ ఖర్చు తగ్గుతుంది. ఒక 3-స్టార్ ఏసీతో.. పోలిస్తే.. 5-స్టార్ ఏసీకి సుమారు 20% నుంచి 25% వరకు కరెంట్ ఖర్చవుతుంది. అంటే మీరు ఏసీని ఎంత ఎక్కువ వాడితే.. మీకు అంత ఎక్కువ కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.

2. ఇన్వర్టర్ టెక్నాలజీ మ్యాజిక్ :
ప్రస్తుతం వచ్చే దాదాపు అన్ని 5-స్టార్ ఏసీలు ‘ఇన్వర్టర్ టెక్నాలజీ’తో వస్తున్నాయి. సాధారణ ఏసీలలో కంప్రెషర్ తరచూ ఆన్, ఆఫ్ అవుతూ ఎక్కువ కరెంట్‌ను ఖర్చుతుంది.కానీ ఇన్వర్టర్ ఏసీలలోని కంప్రెషర్ గది ఉష్ణోగ్రతను బట్టి తన స్పీడ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని వల్ల గది త్వరగా చల్లబడటమే.. కాకుండా కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది.

Advertisement

3. ఏడాదికి ఎంత ఆదా చేయవచ్చు?:
మనం ప్రాక్టికల్‌గా లెక్కలు వేసి చూద్దాం. మీరు వేసవి కాలంలో రోజుకు సగటున 8 గంటలు ఏసీ వాడుతున్నారనుకుందాం.  ఒక 3-స్టార్ ఏసీ ఏడాదికి సుమారు 1000 యూనిట్ల కరెంట్ తీసుకుంటే.. అదే కెపాసిటీ ఉన్న 5-స్టార్ ఏసీ కేవలం 750 యూనిట్లు మాత్రమే తీసుకుంటుంది. అంటే ఏడాదికి దాదాపు 250 యూనిట్ల తేడా వస్తుంది. యూనిట్ ధర సగటున రూ. 8 అనుకున్నా, మీరు ఏడాదికి సుమారు రూ. 2,000 నుంచి రూ.2,500 వరకు కేవలం బిల్లు రూపంలోనే ఆదా చేయవచ్చు. అంటే మీరు ఏసీ కొనేటప్పుడు పెట్టిన అదనపు పెట్టుబడి కేవలం రెండు లేదా మూడు సీజన్లలోనే మీకు తిరిగి వచ్చేస్తుంది.

Also Read: కారు,హోమ్ క్లీనింగ్ కోసం.. బెస్ట్ పోర్టబుల్ వైర్‌లెస్ వాక్యూమ్ క్లీనర్స్

4. తక్కువ మెయింటెనెన్స్:
5-స్టార్ ఏసీలలో వాడే కంప్రెషర్లు , కాయిల్స్ (కాపర్ కాయిల్స్) అత్యంత నాణ్యమైన టెక్నాలజీతో తయారవుతాయి. కంప్రెషర్‌పై లోడ్ తక్కువగా ఉండటం వల్ల ఇవి త్వరగా పాడవవు. దీని వల్ల పదే పదే రిపేర్ల ఖర్చు ఉండదు. అంతేకాకుండా.. మోడ్రన్ 5-స్టార్ ఏసీలు పర్యావరణానికి హాని చేయని గ్రీన్‌ గ్యాస్‌లను వాడుతాయి.

ఏసీ అనేది ఒకటి లేదా రెండు రోజులు వాడి పారేసే వస్తువు కాదు. కనీసం 7 నుంచి 10 సంవత్సరాల పాటు మనం దానిని ఉపయోగిస్తాం. కాబట్టి కొనేటప్పుడు కొన్ని వేల రూపాయలు తక్కువ వస్తున్నాయని.. 3-స్టార్ ఏసీ వైపు మొగ్గు చూపడం లాంగ్ రన్‌లో నష్టాన్ని తెస్తుంది. తెలివిగా ఆలోచించి 5-స్టార్ రేటెడ్ ఏసీలో ఇన్వెస్ట్ చేయండి. మీ ఇంటిని చల్లగా ఉంచుకుంటూనే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను కూడా సేఫ్ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×