E-Paper
Advertisement

ఇంధనం పొదుపు బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఏపీ దారిలో ఉత్తరాఖండ్, ఆ మూడు నిర్ణయాలు

ఇంధనం పొదుపు బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఏపీ దారిలో ఉత్తరాఖండ్, ఆ మూడు నిర్ణయాలు
Advertisement

Uttarakhand:  ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు పొదుపు మంత్రంలో నిమగ్నమయ్యాయి వివిధ రాష్ట్రాలు. తాజాగా ఏపీ బాటలో ఉత్తరాఖండ్ నడుస్తోంది.  ఇంధనం పొదుపు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారంలో ఒకరోజు వాహన రహిత దినం పాటించాలని డిసైడ్ అయ్యారు.

ఇంధనం పొదుపు బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు

Advertisement

హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇంధనం పొదుపుపై దృష్టి సారించాయి. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, యూపీ, చివరకు ఉత్తరాఖండ్ కూడా చేరిపోయింది. ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి కేబినెట్ బుధవారం భేటీ అయ్యింది.

మంత్రి వర్గం భేటీలో ప్రధానంగా ఇంధనం పొదుపు దృష్టి సారించింది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను ప్రకటించారు. అందులో వారానికి ఒకసారి వాహన రహిత దినం పాటించాలన్నది ఒకటి. వర్క్ ఫ్రమ్ హోం విధానాలను ప్రోత్సహించడం, సీఎం కాన్వాయ్‌లో వాహనాలను 50 శాతం తగ్గించడం వంటివి ఉన్నాయి.

Advertisement

ఏపీ దారిలో ఉత్తరాఖండ్.. ఆ మూడు నిర్ణయాలు

కరోనా, రష్యా-ఉక్రెయిన్ వార్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చమురు సరఫరా తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఇంధనం, ఆహార పదార్థాలు, ఎరువులపై ఒత్తిడి తెచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలన్నారు.

ముఖ్యమంత్రితోపాటు మంత్రుల వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించుకోనున్నారు. ప్రతి వారం ఒక రోజును వాహన రహిత దినంగా పాటించనుంది. ప్రభుత్వ శాఖలన్నింటిలో వీడియో కాన్ఫరెన్సింగ్ సమావేశాలను ప్రోత్సహిస్తామని తెలిపింది.

ALSO READ: మద్యం నిబంధనలు కఠినతరం.. విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐడీ కార్డు చూపిస్తేనే, ఆపై 21 ఏళ్లు

అటు ప్రైవేట్ రంగంలో వర్క్-ఫ్రమ్-హోమ్ విధానాలను అవలంబించేలా ప్రోత్సహిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు ప్రభుత్వ- ప్రైవేట్ భవనాల్లో ఏసీల వాడకాన్ని పరిమితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×