E-Paper
Advertisement

వానకాలంలో కూలర్ మొరాయిస్తోందా? ఈ 5 చిట్కాలతో.. సూపర్ కూలింగ్ పక్కా!

వానకాలంలో కూలర్ మొరాయిస్తోందా? ఈ 5 చిట్కాలతో.. సూపర్ కూలింగ్ పక్కా!
Advertisement

Air Cooler Tips: కూలర్లు ఎండకాలంలో అద్భుతంగా పనిచేసినా.. వర్షాకాలంలో మాత్రం ఒక్కసారిగా మెురాయిస్తుంటాయి. చల్లటి గాలికి బదులు వెచ్చటి గాలిని ఇస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. అయితే కూలర్ వర్షాకాలంలో సరిగా పనిచేయకపోవడానికి 5 ప్రధాన కారణాలు ఉండొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నరు. కొన్ని చిట్కాలతో వాటి చెక్ పెట్టి.. తిరిగి చల్లటి గాలి వచ్చేలా చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అవి ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

‘వెంటిలేషన్’ పెంచండి

వేసవిలో తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి చాలా మంది కూలర్ ను వినియోగిస్తుంటారు. ఆ ఫార్మాలా వర్షాకాలంలో అస్సలు పనిచేయదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాతావరణంలో అప్పటికే తేమ ఎక్కువగా ఉండటం వల్ల.. గదిని పూర్తిగా మూసేస్తే కూలర్ నుంచి వచ్చే నీటి ఆవిరి గదిలోనే నిలిచిపోయి ఉక్కపోత పెరుగుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి కూలర్ ఆన్ చేసినప్పుడు గది కిటికీలు, తలుపులను కొద్దిగా తెరిచి ఉంచాలని హితవు పలుకుతున్నారు.

వాటర్ పంప్‌ను ఆపేయండి

Advertisement

వర్షాకాలంలో గాలిలోని తేమ శాతం సహజంగానే 80 శాతం నుండి 90 శాతం వరకు ఉంటుంది. ఇలాంటి సమయంలో కూలర్ లోని వాటర్ పంప్ ఆన్ చేస్తే.. గాలి మరింత జిగటగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి సమయంలో వాటర్ పంప్ బటన్ ఆఫ్ చేస్తే బెటరని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ‘ఫ్యాన్ మోడ్‌’ను మాత్రమే రన్ చేయాలని సూచిస్తున్నారు.

ఐస్ క్యూబ్స్ లేదా కూలింగ్ వాటర్

వర్షాలు పడుతున్నప్పుడు సాధారణ నీటితో కూలర్ అంతగా చల్లదనాన్ని ఇవ్వలేదని నిపుణులు అంటున్నారు. అందుకే కూలర్ ట్యాంక్‌లో నార్మల్ వాటర్ కి బదులు ఐస్ ముక్కలను లేదా బాగా చల్లగా ఉన్న నీటిని నింపాలని సూచిస్తున్నారు. దీని వల్ల కూలర్ గాలి త్వరగా చల్లబడి గదిలోకి మంచి కూలింగ్ ను నింపేస్తుందని చెబుతున్నారు.

కూలింగ్ ప్యాడ్ల మార్పు

Advertisement

వేసవి కాలంలో విపరీతంగా వాడటం వల్ల కూడా ఒక్కోసారి వర్షాకాలంలో కూలర్లు మెురాయించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హనీకోంబ్ ప్యాడ్లలో దుమ్ము, దూళి పేరుకుపోయి.. వానాల్లో సరిగ్గా పనిచేయకపోవచ్చు. కాబట్టి వారానికి ఒకసారి కూలింగ్ ప్యాడ్లను తీసి శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అవి బాగా పాడైపోయి ఉంటే కొత్ వాటిని ఫిక్స్ చేయాలని హితవు పలుకుతున్నారు.

Also Read: రూ.50 వేల బడ్జెట్.. చేతినిండా ఆదాయం.. 2026లో టాప్ బిజినెస్ ఐడియాస్ ఇవే!

కూలర్ పొజిషన్ చేంజ్

చాలా మంది కూలర్‌ను గదిలో ఒక మూలన పెట్టేస్తుంటారు. వేసవిలో ఇది పనిచేసినా.. వర్షాకాలంలో మాత్రం అస్సలు వర్కౌట్ కాదని నిపుణులు అంటున్నారు. తలుపులు, కిటికీలకు వీలైనంత దగ్గరగా కూలర్ ను ఉంచాలని సూచిస్తున్నారు. అలా చేస్తే బయటి నుంచి పొడి గాలిని లోపలికి లాక్కొని గదిని త్వరగా చల్లబరుస్తుందని సూచిస్తున్నారు.

Also Read: కిటికీలకు అల్యూమినియం ఫాయిల్.. నిజంగానే ఇల్లు చల్లబడుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×