E-Paper
Advertisement

లైట్ వెయిట్.. హై సేఫ్టీ.. క్రేజీ ఇగ్నైట్ కార్బన్ హెల్మెట్లు వచ్చేశాయ్!

లైట్ వెయిట్.. హై సేఫ్టీ.. క్రేజీ ఇగ్నైట్ కార్బన్ హెల్మెట్లు వచ్చేశాయ్!
Advertisement

IGNYTE Carbon Fiber Helmets Launched: బైక్ రైడర్లకు మంచి సేఫ్టీ ఇవ్వడంతో సూపర్ లుక్ తో ఇగ్నైట్ కొత్త కార్బన్ ఫైబర్ హెల్మెట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్‌లో మొత్తం మూడు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో IGN-10, IGN-14 హెల్మెట్ల ధర రూ.14,999గా నిర్ణయించగా, టాప్ ఎండ్ మోడల్ IGN-16 ధర రూ.19,999గా ఉంది. ఈ ధరలోనే స్టాండర్డ్ యాక్సెసరీలతో పాటు మూడేళ్ల వారంటీ కూడా కంపెనీ అందిస్తోంది. ఈ మూడు హెల్మెట్లు కూడా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ISI, DOT సర్టిఫికేషన్లు కలిగి ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగంతో పాటు లాంగ్ రైడ్స్‌ కు అనుకూలంగా ఉంటాయని కంపెనీ తెలిపింది.

ఇంతకీ ఈ హెల్మెట్ల ప్రత్యేకత ఏంటంటే?

ఈ హెల్మెట్లలో ప్రధాన ఆకర్షణ కార్బన్ ఫైబర్ కాంపోజిట్ ఔటర్ షెల్. దీని వల్ల హెల్మెట్ బరువు తక్కువగా ఉండటమే కాకుండా బలంగా ఉంటుంది. ఎక్కువ సేపు హెల్మెట్ ధరించినా మెడపై ఒత్తిడి తగ్గేలా దీన్ని రూపొందించారు. కార్బన్ ఫైబర్ షెల్ లోపల కెవ్లార్ రీ ఇన్‌ ఫోర్స్‌ మెంట్‌ తో పాటు ఎక్స్‌ పాండెడ్ పాలిప్రొఫైలిన్ లైనర్‌ ను ఉపయోగించారు. దీంతో హెల్మెట్ మన్నిక కూడా పెరుగుతుంది. సాధారణంగా చాలా హెల్మెట్లలో EPS మెటీరియల్‌ ను ఉపయోగిస్తారు. అయితే, ఇగ్నైట్ ఈ కొత్త సిరీస్‌లో EPP లైనర్‌ ను ఉపయోగించింది. సాధారణ వినియోగంలో ఏర్పడే చిన్నపాటి దెబ్బలు, ఒత్తిడిని ఇది మెరుగ్గా తట్టుకుంటుంది. దీని వల్ల హెల్మెట్ ఎక్కువకాలం మంచి పనితీరును కొనసాగించే అవకాశం ఉంటుంది.

ఆకట్టుకునే డిజైన్ తో..

Advertisement

డిజైన్ పరంగా కూడా ఈ హెల్మెట్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎక్స్‌ పోజ్డ్ కార్బన్ ఫైబర్ టెక్చర్‌ తో పాటు పలు రంగులు, ఫినిషింగ్ ఆప్షన్లలో వీటిని కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రైడర్లు తమ అభిరుచికి తగ్గ మోడల్‌ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

ఫీచర్ల గురించి..

ఫీచర్ల విషయానికి వస్తే, IGN-14, IGN-16 మోడళ్లతో స్మోక్ వైజర్ ను అందిస్తున్నారు. ఇక ఫ్లాగ్‌షిప్ IGN-16 హెల్మెట్‌లో కస్టమైజ్డ్ ఫిట్ కోసం ప్రత్యేక హెడ్ ఫోమ్‌ ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో హెల్మెట్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. తక్కువ బరువు, ఎక్కువ భద్రత, ప్రీమియం డిజైన్ కోరుకునే రైడర్లకు ఇగ్నైట్ కొత్త కార్బన్ ఫైబర్ హెల్మెట్లు మంచి ఆప్షన్ కానున్నాయి.

Advertisement

Read Also: వానాకాలంలో కారులో ఈ 8 వస్తువులు ఉంటే లక్షల నష్టం తప్పదు.. వెంటనే తీసేయండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×