E-Paper
Advertisement

ఎయిర్ కండీషనర్ కెపాసిటీని టన్నుల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?

ఎయిర్ కండీషనర్ కెపాసిటీని టన్నుల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?
Advertisement

Air Conditioner: బయట ఎండలో తిరిగి వచ్చినప్పుడో లేదంటే.. వాతావరణ మార్పుల వలన వేడిగాలి నుంచి ఉపశమనం పొందడానికో.. ఇంట్లో ఏసీ ఆన్ చేస్తే వచ్చే హాయే వేరు. అయితే ఏసీ కొనడానికి వెళ్లినప్పుడు చాలామందిని ఒక విషయం అయోమయంలో పడేస్తుంది. అదే.. ఏసీ కెపాసిటీని టన్నుల్లో చెప్పడం. ఇక్కడ టన్ను అంటే ఏసీ బరువు కాదు.. అది ఇచ్చే చల్లదనం. ఈ టన్నుల లెక్క వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచు గడ్డల కాలం నాటి ముచ్చట:

నిజానికి ఏసీలు, ఫ్రిడ్జ్‌లు అందుబాటులోకి రాకముందు.. అంటే 1800ల చివర్లో.. 1900ల మొదట్లో పెద్ద పెద్ద ఇళ్లను, ఆఫీసులను చల్లబరచడానికి భారీ మంచు గడ్డలను వాడేవారు. ఒక టన్ను (సుమారు 2000 పౌండ్లు) బరువున్న మంచు గడ్డ 24 గంటల్లో కరిగిపోతూ ఎంత చల్లదనాన్ని ఇస్తుందో.. దాన్నే ఒక టన్ను కూలింగ్ కెపాసిటీగా పిలవడం మొదలుపెట్టారు. కాలం మారినా ఆ పాత పద్ధతి అలాగే ఉండిపోయింది.

Advertisement

Also Read: పాస్‌వర్డ్‌లు, ఓటీపీల కాలం చెల్లిపోనుందా? సరికొత్త Passkeys టెక్నాలజీ అంటే ఏమిటీ?

టన్నులకి, బీటీయూలకి ఉన్న లింక్:

సాధారణంగా ఏసీ సామర్థ్యాన్ని కొలవడానికి BTU (బ్రిటిష్ థర్మల్ యూనిట్) అనే కొలతను కూడా వాడతారు. ఒక గంటలో ఏసీ ఎంత వేడిని బయటకు పంపగలదో ఇది చెప్తుంది. ఒక టన్ను ఏసీ అంటే 12,000 BTUల సామర్థ్యంతో సమానం. ఇల్లు పెద్దదైనప్పుడు 60,000 బీటీయూల ఏసీ అని పిలవడం కంటే.. సింపుల్‌గా 5 టన్నుల ఏసీ అని పిలవడం సులువుగా ఉంటుంది కాబట్టే.. పెద్ద ఏసీలకు టన్నుల లెక్క వాడుతుంటారు.

సరైన ఏసీని ఎంచుకోకపోతే నష్టమే:

Advertisement

మన ఇంటి గది సైజును బట్టి సరైన ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. గది పెద్దదై ఉండి, తక్కువ టన్నుల ఏసీ పెడితే ఇల్లు చల్లబడదు. పైగా ఏసీ కంటిన్యూగా తిరగడం వల్ల కరెంట్ బిల్లు పెరగడంతో పాటు మిషన్ కూడా త్వరగా పాడైపోతుంది. అలాగని చిన్న గదిలో పెద్ద ఏసీ పెడితే గదిలో జిగటగా (హ్యుమిడిటీ) ఉండి.. ఏసీ పదే పదే ఆన్ ఆఫ్ అవుతూ త్వరగా పాడవుతుంది.

కొనే ముందు ఏం చేయాలి?

మీరు ఏసీ పెట్టాలనుకుంటున్న గది వైశాల్యం, అక్కడ ఎండ తీవ్రత, రూమ్ ఇన్సులేషన్ వంటి వాటిని బట్టి ఏ సైజ్ ఏసీ కావాలో లెక్కించుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్ కాలిక్యులేటర్లు కూడా ఉన్నాయి. ఏసీ కొనేటప్పుడు మన సొంత నిర్ణయాల కంటే ఒక మంచి ఏసీ టెక్నీషియన్‌ను అడిగి సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. దీనివల్ల డబ్బులు వృధా కాకుండా మనకు సరిపోయే ఏసీని తెచ్చుకోవచ్చు.

Also Read: మొబైల్‌లో సిమ్ కార్డ్ లేకపోయినా.. ఎమర్జెన్సీ కాల్ ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×