E-Paper
Advertisement

హైవేల పక్కన 14 మంది మహిళల శవాలు… వెన్నులో వణుకు పుట్టించే రియల్ మిస్టరీ థ్రిల్లర్

హైవేల పక్కన 14 మంది మహిళల శవాలు… వెన్నులో వణుకు పుట్టించే రియల్ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

True Crime Documentary: పోలీసులే చేతులెత్తేసిన కేసును స్టూడెంట్స్ సాల్వ్ చేస్తే, డిపార్ట్మెంట్ ను ముప్పుతిప్పలు పెట్టి తప్పించుకున్న కిల్లర్ ను చదువుకునే పిల్లలు పట్టేస్తే… వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. మరి ఈ రియల్ లైఫ్ స్టోరీ కథేంటి ? ఎలా జరిగింది? ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే ‘మర్డర్ 101’ (Murder 101) అనే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీపై ఒక లుక్కేయాల్సిందే. మరి హైస్కూల్ విద్యార్థులు ఛేదించిన 40 ఏళ్ల ఈ పాత సీరియల్ కిల్లర్ మిస్టరీ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్న వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

కథ అమెరికాలో ఒకే చోట కాకుండా టేనస్సీ, కెంటుకీ వంటి వివిధ రాష్ట్రాలలో సాగుతుంది. 1980ల కాలంలో హైవేల పక్కన ఎర్రటి జుట్టు ఉన్న కొందరు మహిళల మృతదేహాలు వరుసగా దొరికాయి. ఈ కేసులను అమెరికా క్రైమ్ చరిత్రలో “రెడ్‌హెడ్ మర్డర్స్” అని పిలుచుకుంటారు. ఆ కాలంలో ఈ హత్యలు వేర్వేరు ప్రాంతాలలో జరగడం వల్ల, పోలీసులు వీటిని విడివిడి హత్యలుగా భావించారు కానీ, ఒకే సీరియల్ కిల్లర్ చేస్తున్న దారుణాలుగా గుర్తించలేకపోయారు. అలా దాదాపు 40 ఏళ్లపాటు ఈ కేసు ఒక మిస్టరీగా ఉండిపోయింది.

Advertisement

టేనస్సీలోని ‘ఎలిజబెత్‌టన్ హైస్కూల్’ సోషియాలజీ టీచర్ అలెక్స్ క్యాంప్‌బెల్ తన క్లాస్ విద్యార్థులకు సమాజంపై అవగాహన కల్పించేందుకు ఈ 40 ఏళ్ల పాత కేసును ఒక ప్రాజెక్ట్‌గా ఇస్తారు. విద్యార్థులు పాత పోలీస్ ఫైళ్లను సేకరించి, బాధితుల వివరాలను ఒకదానితో ఒకటి లింక్ చేసి చూస్తారు. జుట్టు రంగు, వయసు, మృతదేహాలు దొరికిన ప్రదేశాలను బట్టి ఇవన్నీ వేర్వేరు హత్యలు కావు, ఒకే సీరియల్ కిల్లర్ చేసిన ఘాతుకాలు అని వాళ్ళు కనిపెట్టేస్తారు. అంతేనా దానికి సంబంధించి ఒక ‘క్రిమినల్ ప్రొఫైల్’ తయారు చేస్తారు.

దాని ఆధారంగా విద్యార్థులు మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ హత్యలన్నీ హైవేల పక్కనే జరగడం వల్ల, హంతకుడు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఒక ట్రక్ డ్రైవర్ అయి ఉంటాడని అనుమానిస్తారు. అప్పటికే సేకరించిన ఆధారాల ప్రకారం ఆరుగురు మహిళల హత్యల వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడని తెలుసుకుంటారు. ఆ అనుమానితుడు ‘జెర్రీ జాన్స్’ అనే వ్యక్తి అని, అతను గతంలో ఒక మహిళపై హత్యాయత్నం చేసి జైలు శిక్ష అనుభవిస్తూ 2015లో మరణించాడని తెలుసుకుంటారు. విద్యార్థులు తాము సేకరించిన సాక్ష్యాలతో అధికారిక దర్యాప్తు సంస్థలను ఆశ్రయించడానికి సిద్ధపడతారు. మరి ఆ పిల్లల ఆలోచనలు నిజమైన ఆధారాలా? లేదంటే అంచనాలా ? ఈ కేసు వల్ల ఆ విద్యార్థులకు ఒరిగింది ఏంటి ? హోమ్‌వర్క్ చూసి ఆశ్చర్యపోయిన టేనస్సీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ తరువాత ఏం చేసింది ? అన్నది చూసి తెలుసుకోవలసిన స్టోరీ.

తెలుగులో ఉందా ?

Advertisement

‘మర్డర్ 101’ క్రైమ్ డాక్యుసిరీస్ ఒక ఎమోషనల్ జర్నీ లాంటిది. ఈ సిరీస్ చూస్తుంటే ఒక చిన్న తప్పు కూడా ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తుందో, మరోవైపు ఒక చిన్న ప్రయత్నం ఎంత పెద్ద మార్పును తెస్తుందో మనసుకు హత్తుకునేలా చూపించారు. ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ సమాజం మర్చిపోయిన బాధితులకు న్యాయం చేయడానికి కొందరు హైస్కూల్ విద్యార్థులు చేసిన సంచలన ప్రయత్నం. అయితే ఈ సిరీస్ తెలుగులో అందబాటులో లేదు. ఇంగ్షీషులో స్ట్రీమ్ అవుతోంది.

Read Also: వ్యామోహంలో చేసిన తప్పు రివేంజ్ గా మారితే… మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×