E-Paper
Advertisement

ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!

ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!
Advertisement

AC Cooling Tips: ఎండలు ముదిరిపోతున్నాయి.. బయట అడుగు పెట్టాలంటే జనాలు భయపడుతున్నారు. ఇక ఇంట్లో ఉన్నా సరే AC లేనిదే క్షణం గడవని పరిస్థితి. అయితే, ఏసీ వేసుకుంటే చల్లగా ఉంటుందన్న సంతోషం కంటే, వచ్చే నెల కరెంటు బిల్లు ఎంత వస్తుందో అన్న టెన్షనే ఎక్కువగా ఉంటోంది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అదిరిపోయే సలహా ఇచ్చింది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దిద్దుకుంటే ఏసీ వాడుతూనే బిల్లు తగ్గించుకోవచ్చని చెబుతోంది. అదేంటంటే..

ఏసీ ఎన్ని డిగ్రీల్లో పెట్టాలి?

చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. బయట నుంచి రాగానే గది గడ్డకట్టేలా చల్లబడాలని ఏసీని 16 లేదా 18 డిగ్రీల్లో పెట్టేస్తుంటారు. కానీ నిజానికి అలా చేయడం వల్ల గది త్వరగా చల్లబడదు. పైగా ఏసీ కంప్రెషర్‌పై విపరీతమైన భారం పడి కరెంటు యూనిట్లు అమాంతం పెరిగిపోతాయి. ఏసీని ఎప్పుడూ 24 నుండి 27 డిగ్రీల మధ్యలో ఉంచడమే కరెక్ట్ పద్ధతి. దీనివల్ల గది త్వరగా చల్లబడటమే కాకుండా.. కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుంది.

ఏసీతో పాటు ఫ్యాన్ వేయొచ్చా?

Advertisement

ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ ఎందుకు? అని ఇంట్లో పెద్దవాళ్లు అంటుంటారు. కానీ, ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టడం వల్ల ఏసీ ఇచ్చే చల్లటి గాలి గదిలోని ప్రతి మూలకు చేరుతుంది. ఫ్యాన్ గాలి వల్ల మన శరీరానికి చల్లదనం ఇంకా బాగా తగులుతుంది. దీనివల్ల ఏసీ టెంపరేచర్‌ని 26 డిగ్రీల్లో పెట్టినా సరే.. గది చాలా చల్లగా అనిపిస్తుంది. ఈ ఒక్క ట్రిక్‌తో కరెంటు బిల్లులో దాదాపు 20 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.25వేల లోపు 4K QLED టీవీలు.. శాంసంగ్, షావోమీల మోడల్స్‌పై కళ్లుచెదిరే ఆఫర్స్!

ఆరోగ్యం కూడా ముఖ్యం కదా:

Advertisement

రోజంతా ఏసీలో అతి తక్కువ ఉష్ణోగ్రతలో ఉండటం వల్ల చర్మం పొడిబారడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావడం లాంటివి జరుగుతాయి. అందుకే గాలి సహజంగా ఉండేలా చూసుకోవాలి. ఏసీని మీడియం టెంపరేచర్‌లో ఉంచి ఫ్యాన్ వాడటం వల్ల గాలి ప్రసరణ బాగుంటుంది. దీనివల్ల ఏసీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గి, వాతావరణం కూడా మన శరీరానికి సెట్ అయ్యేలా సాఫ్ట్‌గా ఉంటుంది.

నిద్రపోయే ముందు ఇలా చేయండి:

రాత్రిపూట నిద్రలో మన శరీర ఉష్ణోగ్రత మారుతుంటుంది. అందుకే రాత్రి ఏసీని 24 లేదా 25 డిగ్రీల వద్ద ఉంచడం ఉత్తమం. ఇప్పుడు వస్తున్న ఏసీల్లో Sleep Mode అనే ఆప్షన్ ఉంటోంది. దాన్ని వాడితే అది ఆటోమేటిక్‌గా చల్లదనాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల అర్ధరాత్రి చలి వేయదు. అలాగే కరెంటు కూడా చాలా తక్కువ ఖర్చవుతుంది. రాత్రిపూట కూడా ఫ్యాన్‌ను లైట్‌గా వేయడం వల్ల గాలి సర్క్యులేషన్ బాగుంటుంది.

కరెంట్ బిల్లుకు చెక్ పెట్టండిలా:

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఏసీలో ఒక్క డిగ్రీ పెంచినా కూడా సుమారు 6 శాతం కరెంటు ఆదా అవుతుందట. అంటే.. 18 డిగ్రీల దగ్గర వాడే ఏసీని 24 డిగ్రీలకు మారిస్తే ఎంత బిల్లు తగ్గుతుందో మీరే ఊహించుకోండి. కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే ఏసీ చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూనే.. కరెంటు బిల్లును కూడా కంట్రోల్ చేయొచ్చు.

Also Read: AC వేసినా రూమ్ చల్లబడట్లేదా? బహుశా మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదేనేమో, ఓసారి చెక్ చేసుకోండిలా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×