E-Paper
Advertisement

చేతితో పని లేకుండా ఇల్లు క్లీన్.. 2026లో ట్రెండింగ్‌లో ఉన్న రోబోట్ క్లీనర్స్!

చేతితో పని లేకుండా ఇల్లు క్లీన్.. 2026లో ట్రెండింగ్‌లో ఉన్న రోబోట్ క్లీనర్స్!
Advertisement

Best Robot Vacuum 2026: టెక్నాలజీ పెరిగేకొద్దీ మన పనులు మరింత సులువవుతున్నాయి. ఒకప్పుడు ఇల్లు ఊడ్చి, తుడవడానికి గంటల కొద్దీ సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఒక్క క్లిక్‌తో ఇల్లంతా క్లీన్ చేసే స్మార్ట్ రోబోట్ వాక్యూమ్  క్లీనర్స్ (Robot Vacuum Cleaners) అందుబాటులోకి వచ్చాయి. 2026లో హయ్యర్, డ్రీమ్ వంటి బ్రాండ్లు సరికొత్త ఏఐ ఫీచర్లు, పవర్‌ఫుల్ సక్షన్ కెపాసిటీతో సరికొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తెచ్చాయి. మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చే ఆ టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ – ఫీచర్లు,వివరాలు:

Advertisement

1. డ్రీమ్ ఎల్20 అల్ట్రా (Dreame L20 Ultra):
2026లో ప్రీమియం విభాగంలో డ్రీమ్ (Dreame) బ్రాండ్ దూసుకుపోతోంది. ఈ మోడల్ కేవలం వాక్యూమ్ మాత్రమే కాదు.. మోపింగ్ (తుడవడం) కూడా అద్భుతంగా చేస్తుంది.

ప్రత్యేకత: ఇది ఇంటి మూలలను గుర్తించి ఎక్స్‌టెండ్ అయ్యే మోప్ ప్యాడ్స్‌తో వస్తుంది. క్లీనింగ్ అయిపోయాక బేస్ స్టేషన్‌లో ఆటోమేటిక్‌గా మోప్‌లను క్లీన్ చేసుకుని, ఆరబెట్టుకుంటుంది.

Advertisement

ధర: రూ. 85,000-రూ. 90,000.

2. హయ్యర్ స్మార్ట్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ (Haier Smart Robot RV-X20):
నమ్మకమైన బ్రాండ్ హయ్యర్ నుంచి వచ్చిన ఈ మోడల్ క్లాస్ కుటుంబాలకు పర్ఫెక్ట్ ఛాయిస్.

ప్రత్యేకత: ఇందులో బలమైన 4000Pa సక్షన్ పవర్ ఉంది, ఇది కార్పెట్స్ , టైల్స్ పై ఉండే చిన్నపాటి ధూళిని కూడా లాగేస్తుంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కంట్రోల్ చేయవచ్చు.

ధర: రూ. 24,990.

3. యూఫీ రోబోవాక్ ఎల్35 హైబ్రిడ్ (Eufy RoboVac L35 Hybrid+):
యాంకర్ సంస్థకు చెందిన యూఫీ బ్రాండ్ రోబోట్లు ఇండియాలో చాలా పాపులర్.

ప్రత్యేకత: ఇది ఆటో స్టేషన్‌తో వస్తుంది. అంటే రోబోట్‌లో నిండిన డస్ట్‌ను అది స్వయంగా బేస్ స్టేషన్‌లోని బ్యాగ్‌లోకి మార్చుకుంటుంది. మీరు 60 రోజుల వరకు డస్ట్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. LiDAR నావిగేషన్ వల్ల చీకట్లోనూ బాగా పనిచేస్తుంది.

ధర:రూ. 34,990.

4. షియోమీ రోబోట్ వాక్యూమ్-మోప్ 2 అల్ట్రా (Xiaomi Robot Vacuum-Mop 2 Ultra):
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ షియోమీ. ఈ మోడల్ 3D అబ్స్టాకిల్ అవాయిడెన్స్ టెక్నాలజీతో వస్తుంది.

ప్రత్యేకత: నేలపై పడి ఉన్న వైర్లు, చెప్పులు, పిల్లల బొమ్మలను ముందే గుర్తించి వాటి చుట్టూ తిరుగుతూ క్లీన్ చేస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ, ఒకే ఛార్జ్‌తో పెద్ద ఇల్లంతా క్లీన్ చేయవచ్చు.

ధర: రూ. 29,999.

5. ఎకోవాక్స్ డీబాట్ టి20 ఓమ్ని (Ecovacs Deebot T20 Omni):
రోబోటిక్ క్లీనర్ రంగంలో గ్లోబల్ లీడర్ అయిన ఎకోవాక్స్ నుంచి వచ్చిన ఆల్-ఇన్-వన్ రోబోట్ ఇది.

Also Read: వాటర్ ప్యూరిఫయర్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ మోడల్స్, ధరల వివరాలు ఇవే!

ప్రత్యేకత: ఇది 55°C వేడి నీటితో మోప్ ప్యాడ్స్‌ను క్లీన్ చేసుకుంటుంది. దీని వల్ల నేలపై ఉండే జిడ్డు,బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తాయి.కార్పెట్లను గుర్తించగానే మోప్స్ పైకి లేచి, కేవలం వాక్యూమ్ మాత్రమే చేస్తుంది.

ధర: రూ. 65,000.

రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. మంచాలు, సోఫాల కింద ఉండే దూళిని కూడా సులభంగా శుభ్రం చేస్తాయి. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే Haier లేదా Xiaomi మోడల్స్, లేదు మాకు చేతితో అస్సలు పని లేకుండా వాష్, డ్రై అన్నీ అదే చేసుకోవాలి అనుకుంటే.. Dreame లేదా Ecovacs మోడల్స్‌ను ఎంచుకోవచ్చు. మీ అవసరానికి తగ్గట్టుగా స్మార్ట్ డెసిషన్ తీసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×