E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే.. వాషింగ్ మెషీన్ ఏది?

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే.. వాషింగ్ మెషీన్ ఏది?
Advertisement

Whirlpool vs Haier washing machine India: కొత్తగా వాషింగ్ మెషీన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్లో వంద ఆప్షన్లు ఉన్నా,మన కన్ను ఎప్పుడూ .. Whirlpool, Haier బ్రాండ్లపైనే పడుతుంది. ఒకటి దశాబ్దాల నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ అయితే.. ఇంకొకటి లేటెస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో దూసుకుపోతున్న మోడ్రన్ బ్రాండ్.  చాలా ప్రాంతాల్లో ఉండే కరెంట్ కోతలు, ఉప్పు నీటి సమస్యలు, పిల్లల బట్టలపై ఉండే మొండి మరకలను క్లీన్ చేయడంలో ఏది తోపు? ఇండియన్ హోమ్స్‌కి ఏది పర్ఫెక్ట్ సూట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బట్టలు ఉతకడం ఒక ఆర్ట్. ఇక్కడ కేవలం డిటర్జెంట్ వేస్తే సరిపోదు.. కాలర్‌పై మురికి, బురద మరకలు పోవాలి. బట్టల రంగు మారకూడదు, పైగా కరెంట్, వాటర్ బిల్లులు తక్కువ రావాలి. ఈ విషయంలో.. వరల్‌పూల్, హయ్యర్ కంపెనీలు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నాయి. వీటిలో ఏది మీ ఇంటికి బెస్టో డిసైడ్ చేసుకోండి.

1. వరల్‌పూల్ వాషింగ్ మెషీన్ (Whirlpool Washing Machine):

Advertisement

ఇండియన్ మార్కెట్లో వరల్‌పూల్‌కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. మన అమ్మల కాలం నుంచి ఈ బ్రాండ్‌ను చూస్తూనే ఉన్నాం. దీనిలోని ‘Stainwash Ultra’ టెక్నాలజీ.. అద్భుతంగా పని చేస్తుంది. ఇది నీటిని వేడి చేసి (In-built heater) దాదాపు 25 రకాల మొండి మరకలను ఈజీగా వదిలిస్తుంది. ఇక ఇండియాలో చాలా ప్రాంతాల్లో బోర్ వాటర్ లేదా ఉప్పు నీరు పెద్ద సమస్య. వరల్‌పూల్ లోని ‘Hard Water Wash’ మోడ్.. ఉప్పు నీటిలోనూ డిటర్జెంట్‌ బాగా కరిగేలా చేసి, బట్టలు పాడవకుండా.. క్లీన్ చేస్తుంది. దీంతో పాటు వచ్చే ‘6th Sense Technology’ బట్టల బరువును బట్టి ఎంత నీరు, ఎంత డిటర్జెంట్ కావాలో దానంతట అదే స్మార్ట్‌గా డిసైడ్ చేస్తుంది.

2. హయ్యర్ వాషింగ్ మెషీన్ (Haier Washing Machine):

యూజర్లు తక్కువ ధరలో.. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఇచ్చే హయ్యర్ వైపు బాగా మొగ్గు చూపుతున్నారు.ముఖ్యంగా హయ్యర్ ఫ్రంట్-లోడ్ మెషీన్లలో వచ్చే ‘Direct Motion Motor’ (డైరెక్ట్ మోషన్ మోటార్) బెల్ట్ లేకుండా.. నేరుగా డ్రమ్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. దీని వల్ల మెషీన్ అస్సలు శబ్దం చేయదు.రాత్రి పూట బట్టలు వేసినా హాయిగా పడుకోవచ్చు. అంతేకాకుండా.. బట్టలు ఉతికే గ్యాస్కెట్ , డ్రమ్ దగ్గర బ్యాక్టీరియా, బూజు పట్టకుండా ఉండటానికి దీనిలోని ‘Anti-Bacterial Technology (AMT)’99% ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే.. తక్కువ స్పేస్‌లోనే ఎక్కువ బట్టలు ఫ్రీగా తిరగడానికి, బాగా నానడానికి దీనిలోని ‘525mm Super Drum’ హెల్ప్ అవుతుంది. దీని వల్ల బట్టలు అస్సలు నలిగిపోవు.

Advertisement

Also Read: సూపర్ ఫాస్ట్ కూలింగ్‌తో.. దుమ్మురేపుతున్న 5 బెస్ట్ స్ప్లిట్ ఏసీలు!

ఇంటికి ఏది బెస్ట్?

మీరు వరల్‌పూల్ ఎంచుకోవాలి.. ఒకవేళ, మీ ఇంట్లో బోర్ వాటర్ వస్తుంటే.. పిల్లలు ఉండి బట్టలకు రోజు మొండి మరకలు అవుతుంటే.. లాంగ్-లాస్టింగ్ నమ్మకమైన బ్రాండ్ కావాలనుకుంటే.. కళ్ళు మూసుకుని వరల్‌పూల్ తీసుకోండి. ముఖ్యంగా వీరి టాప్-లోడ్ మెషీన్లు ఇండియన్ హోమ్స్‌కి సూపర్ సక్సెస్. మీరు హయ్యర్ ఎంచుకోవాలి.. ఒకవేళ.. మీకు తక్కువ బడ్జెట్‌లోనే లగ్జరీ ఫ్రంట్-లోడ్ మెషీన్ కావాలి ? అస్సలు సౌండ్ రాకూడదు. వైఫై/స్మార్ట్ ఫీచర్స్ ఉండాలి అనుకుంటే హయ్యర్ బెస్ట్ ఛాయిస్. ప్రస్తుత స్మార్ట్ జనరేషన్‌కి ఈ రెండు బ్రాండ్లు కూడా ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అందిస్తున్నాయి. మీ బడ్జెట్, వాటర్ సప్లైని బట్టి సరైన మోడల్‌ను సెలెక్ట్ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×