E-Paper
Advertisement

మీ ఫోన్ హ్యాక్ అయిందా? ఈ 5 సంకేతాలు ఉంటే.. ప్రమాదంలో పడ్డట్లే!

మీ ఫోన్ హ్యాక్ అయిందా? ఈ 5 సంకేతాలు ఉంటే.. ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement

Phone Hacked: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైంది. దీంతో వ్యక్తిగత విషయాలు, బ్యాంకింగ్ వివరాలు, చాటింగ్ సీక్రెట్స్ అన్నీ ఫోన్లలోనే ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతున్న సైబర్ దాడుల నేపథ్యంలో.. మన ఫోన్ ను సైతం ఎవరైనా హ్యాక్ చేశారా? అన్న అనుమానం సహజంగానే కలుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని స్మార్ట్ టిప్స్ పాటించడం ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యిందా? లేదా? అనేది నిర్ధారించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఫోన్ లోని కొన్ని సంకేతాలతో వాటిని గుర్తించవచ్చని స్పష్టం చేస్తున్నారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

వేడెక్కడం.. బ్యాటరీ డ్రై

ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించకపోయినా, గేమ్‌లు ఆడకపోయినా హఠాత్తుగా ఫోన్ వేడెక్కుతుందా? అలాగే సాధారణం కంటే చాలా వేగంగా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందా? అయితే మీరు అలర్ట్ అవ్వాల్సిందేనని నిపుణులు అంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోన్ నుంచి డేటాను వేరే సర్వర్‌కు పంపడానికి స్పైవేర్ యాప్‌లు నిరంతరం రన్ అవుతుంటాయని పేర్కొంటున్నారు. దీనివల్ల ప్రొసెసర్‌పై భారం పడి ఫోన్ వేడెక్కడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం జరుగుతుందని సూచిస్తున్నారు.

మొబైల్ డేటా ఖర్చు

Advertisement

ఇంటర్నెట్ వాడకంలో ఎలాంటి మార్పు లేకపోయినా రోజుకు వచ్చే డేటా లిమిట్ త్వరగా అయిపోతుంటే అది ప్రమాదకర సంకేతమని నిపుణులు అంటున్నారు. ఫోన్‌లోని ఫోటోలు, మెసేజ్‌లు, కాల్ రికార్డింగ్‌లను హ్యాకర్లకు చేరవేయడానికి ఈ నిఘా యాప్‌లు మొబైల్ డేటాను విపరీతంగా వాడుకుంటాయని పేర్కొంటున్నారు. కాబట్టి ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఏ యాప్ ఎంత డేటా వాడుతుందో ఒకసారి సరిచూసుకోవడం మంచిదని హితవు పలుకుతున్నారు.

వింత శబ్దాలు.. విచిత్ర మెసేజ్‌లు

కాల్స్ మాట్లాడుతున్నప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా వింత శబ్దాలు రావడం, క్లిక్ మనే శబ్దాలు వినపడటం వంటివి జరుగుతుంటే కాల్స్ రికార్డ్ అవుతున్నట్లు అర్థమని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మీ ప్రమేయం లేకుండానే కాంటాక్ట్స్‌కు వింత లింకులతో కూడిన మెసేజ్‌లు వెళ్లడం, కోడ్‌లతో కూడిన వింత మెసేజ్‌లు రావడం కూడా స్పైవేర్ ఉనికిని సూచిస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఫోన్ పనితీరు మందగించడం

Advertisement

ఫోన్ అకస్మాత్తుగా చాలా స్లో అయిపోయినా, యాప్‌లు ఓపెన్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నా లోపల ఏదో జరుగుతోందని అర్థం. అలాగే స్క్రీన్ ఆఫ్ చేసినా కూడా డిస్‌ప్లే వెలగడం లేదా ఫోన్ దానంతట అదే రీస్టార్ట్ కావడం వంటివి జరిగితే ఎవరో మీ ఫోన్‌ను రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తున్నారని అనుమానించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

ఫోన్‌లో తెలియని యాప్స్

ఇన్‌స్టాల్ చేయని కొన్ని కొత్త యాప్‌లు ఫోన్ స్క్రీన్ మీద లేదా యాప్ లిస్ట్‌లో కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా హ్యాకర్లు మాల్వేర్ లింకులను వేరే యాప్‌ల ముసుగులో ఫోన్లలోకి జొప్పిస్తారని తెలియజేస్తున్నారు.

Also Read: షావోమి మరో అద్భుతం.. దుమ్మురేపే స్మార్ట్ కుక్కర్ లాంచ్.. ఇక బుల్లెట్ స్పీడ్‌తో వంట!

వెంటనే ఇలా చేయండి..

పైన పేర్కొన్న సంకేతాలు మీ ఫోన్ లో కనిపిస్తే.. హ్యాక్ అయినట్లుగా భావించాలని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిని నుంచి బయటపడేందుకు వెంటనే కొన్ని పనులు చేయాలని సూచిస్తున్నారు. ముందుగా యాప్ లోని అనుమానస్పద యాప్స్ అన్నింటిని డిలీట్ చేయండి. అనంతరం ఫోన్ లాక్ స్క్రీన్ నెంబర్ తో పాటు.. ఈమెయిల్ ఐడీ, బ్యాంకింగ్ యాప్‌ల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ఫోన్ సాఫ్ట్ వేర్, సెక్యురిటీ అప్డేట్స్ ను క్రమం తప్పకుండా ఇన్ స్టాల్ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ చేసిన ఫలితం లేదని భావిస్తే.. కీలక డేటాను బ్యాకప్ చేసుకొని.. ఫోన్ ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని వివరిస్తున్నారు.

Also Read: ఏంటీ, ‘Bluetooth On’లో ఉంటే.. ఇన్ని ఘోరాలు జరుగుతాయా? సర్వం కోల్పోవాల్సిందేనా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×