E-Paper
Advertisement

డెజర్ట్, పర్సనల్, టవర్, విండో కూలర్లలో.. మీ ఇంటికి ఏది బెస్ట్?

డెజర్ట్, పర్సనల్, టవర్, విండో కూలర్లలో.. మీ ఇంటికి ఏది బెస్ట్?
Advertisement

Best air cooler for room: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతుంటారు. అయితే అందరికీ ఏసీ కొనే బడ్జెట్ ఉండకపోవచ్చు. లేదా ఏసీ వల్ల వచ్చే భారీ కరెంట్ బిల్లు భరించడం కష్టం కావచ్చు. ఇలాంటి సమయంలో బెస్ట్ ఆప్షన్ ‘ఎయిర్ కూలర్’. అయితే మార్కెట్లోకి వెళ్తే డెజర్ట్, పర్సనల్, టవర్, విండో అని రకరకాల కూలర్లు దర్శనమిస్తాయి. వీటిలో మీ రూమ్ సైజుకు , మీ అవసరానికి ఏ కూలర్ వంద శాతం సెట్ అవుతుందో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం.

ఎయిర్ కూలర్ కొనేటప్పుడు కేవలం ధర చూసి కొంటే సరిపోదు. మీ గరూం సైజ్ , వెంటిలేషన్ , స్పేస్‌ను బట్టి సరైన రకాన్ని ఎంచుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ చల్లదనంతో పాటు కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. ఇప్పుడు ఆ నాలుగు రకాల కూలర్ల గురించి వివరాలు..

Advertisement

1. డెజర్ట్ కూలర్ -పెద్ద గదుల కోసం:
మీరు ఉండేది పెద్ద హాల్ లేదా పెద్ద మాస్టర్ బెడ్‌రూమ్ అయితే మీకు ‘డెజర్ట్ కూలర్’ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇవి సైజులో కాస్త పెద్దవిగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ వాటర్ ట్యాంక్ కెపాసిటీ (సాధారణంగా 50 నుంచి 100 లీటర్లు) కలిగి ఉంటాయి. ఇవి చాలా శక్తివంతమైన గాలిని ఇస్తాయి.పెద్ద ఏరియాను సైతం నిమిషాల్లో చల్లబరుస్తాయి. బయట ఓపెన్ స్పేస్ లేదా బాల్కనీలో పెడితే అద్భుతంగా పని చేస్తాయి. జాయింట్ ఫ్యామిలీస్,పెద్ద ఇళ్లు ,డ్రై క్లైమేట్ (పొడి వాతావరణం) ఉన్న ప్రాంతాలకు ఇది బెస్ట్.

2. పర్సనల్ కూలర్–చిన్న రూమ్‌ల కోసం:
పేరుకు తగ్గట్టుగానే ఇది ఒకరు లేదా ఇద్దరు ఉన్న చిన్న గదులకు మాత్రమే సెట్ అవుతుంది. ఇవి కాంపాక్ట్ సైజులో ఉండి, తక్కువ శబ్దంతో పనిచేస్తాయి. వీటిని గదిలో ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు. కరెంట్ ఖర్చు చాలా తక్కువ. హనీకోంబ్ ప్యాడ్స్ వల్ల మెయింటెనెన్స్ కూడా తక్కువే. బ్యాచిలర్స్, స్టడీ రూమ్స్, చిన్న బెడ్‌రూమ్‌లకు ఇది చాలా అనుకూలం.

Advertisement

3. టవర్ కూలర్– మోడరన్ లుక్ & తక్కువ స్పేస్:
మీ ఇంట్లో స్థలం తక్కువగా ఉండి, కిచెన్ లేదా లివింగ్ రూమ్‌కు మోడరన్ లుక్ రావాలనుకుంటే ‘టవర్ కూలర్’ బెస్ట్ ఆప్షన్. ఇవి నిలువుగా స్లిమ్‌గా ఉంటాయి. ఇవి గదిలో చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. గాలిని పై ఎత్తు వరకు నేరుగా విసురుతాయి. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మోడల్స్‌లో రిమోట్ కంట్రోల్ , టైమర్ ఫీచర్స్ కూడా ఉంటున్నాయి. తక్కువ స్పేస్ ఉన్న మోడరన్ ఫ్లాట్స్, ఆఫీస్ క్యాబిన్స్ , బెడ్‌రూమ్స్ కోసం.

4. విండో కూలర్ – రూమ్ లోపల స్థలం లేకపోతే:
విండో ఏసీ లాగానే వీటిని కూడా గది కిటికీకి ఫిక్స్ చేస్తారు. దీని వల్ల కూలర్ బాడీ మొత్తం బయట ఉంటుంది, కేవలం చల్లటి గాలి మాత్రమే లోపలికి వస్తుంది. గది లోపల అస్సలు స్థలం వేస్ట్ అవ్వదు. బయటి నుంచి తాజా గాలిని  తీసుకుని రూమ్‌ను చల్లబరుస్తుంది కాబట్టి హ్యూమిడిటీ  సమస్య చాలా తక్కువగా ఉంటుంది.

గదిలో స్పేస్ లేని వారికి.. కిటికీ సౌకర్యం ఉన్న రూమ్‌లకు ఇది పర్ఫెక్ట్. ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేయాలంటే రూమ్‌లో క్రాస్ వెంటిలేషన్ (గాలి బయటకు వెళ్లే మార్గం) ఉండటం చాలా ముఖ్యం. కిటికీలు పూర్తిగా మూసేస్తే కూలర్ వల్ల ఉడుకు పెరుగుతుంది.

మీ అవసరాన్ని బట్టి ఎంపిక మారాలి. పెద్ద హాల్ అయితే డెజర్ట్, చిన్న రూమ్ అయితే పర్సనల్, స్టైలిష్ లుక్ కోసం టవర్, స్పేస్ సేవింగ్ కోసం విండో కూలర్‌ను ఎంచుకోండి. కొనే ముందు బ్రాండ్ వారంటీ , ఇన్వర్టర్ కనెక్టివిటీ ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×