E-Paper
Advertisement

ఆంపియర్‌ కు బంపర్ డిమాండ్.. 3 లక్షల మార్క్ దాటిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు!

ఆంపియర్‌ కు బంపర్ డిమాండ్.. 3 లక్షల మార్క్ దాటిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు!
Advertisement

Ampere Achieves 300,000 EV Sales: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మరో ఘనత సాధించాయి. గ్రీవ్స్ కాటన్‌ కు చెందిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM) సంస్థ మొత్తం 3 లక్షలకుపైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్ చేసినట్లు ప్రకటించింది. వాహన్ పోర్టల్‌ లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, 2019 మే నుంచి 2026 జూన్ 17 వరకు కంపెనీ మొత్తం 3,00,293 యూనిట్లను అమ్మింది.

2019లో కోయంబత్తూరుకు చెందిన ఆంపియర్ వెహికల్స్‌ ను గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ  టేకోవర్ చేసింది. అప్పటి నుంచి సంస్థ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వస్తోంది. 2025 అక్టోబర్ నాటికి 2.5 లక్షల యూనిట్ల విక్రయాలను దాటిన కంపెనీ, ఆ తర్వాత కేవలం ఎనిమిది నెలల్లోనే మరో 50 వేల స్కూటర్లను విక్రయించి 3 లక్షల మార్కును చేరుకుంది.

2022లో అమ్మకాల జోష్

Advertisement

ఆంపియర్ అమ్మకాల ప్రయాణాన్ని పరిశీలిస్తే, 2022 సంవత్సరం సంస్థకు బెస్ట్ ఇయర్ గా చెప్పొచ్చు. ఆ ఏడాది 80 వేలకుపైగా స్కూటర్లు అమ్మింది. ఆ తర్వాత రెండేళ్లలో మార్కెట్ పరిస్థితుల కారణంగా అమ్మకాలు కొంత తగ్గాయి. 2023లో విక్రయాలు తగ్గగా, 2024లో మరింత మందగించాయి. కానీ, 2025లో మళ్లీ డిమాండ్ పెరగడంతో కంపెనీ మంచి దూకుడు కనబరిచింది. 2026లో ఆంపియర్ మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది తొలి ఐదున్నర నెలల్లోనే 38,430 స్కూటర్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 58 శాతం ఎక్కువ. దేశంలో ఈ కాలంలో సేల్ అయిన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్లలో సుమారు 4 శాతం మార్కెట్ వాటాను ఆంపియర్ దక్కించుకుంది. ప్రస్తుతం TVS, బజాజ్, ఏథర్, హీరో విడా, ఓలా ఎలక్ట్రిక్ తర్వాత ఆంపియర్ ఆరో స్థానంలో ఉంది.

ఈ ఏడాది మార్చి నుంచి కంపెనీ అమ్మకాలు మరింత బలంగా పెరుగుతున్నాయి. మార్చిలో దాదాపు 8 వేల యూనిట్లు, ఏప్రిల్‌లో 7 వేలకుపైగా, మేలో 7,700కు పైగా విక్రయాలు నమోదయ్యాయి. జూన్ నెలలో కూడా ఇదే దూకుడు కొనసాగుతోంది. నెల మధ్య నాటికే వేల సంఖ్యలో విక్రయాలు నమోదు కావడంతో, జూన్ ముగిసే సమయానికి 10 వేల యూనిట్ల మార్కును చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మూడు ప్రధాన మోడల్స్ అమ్మకాలు

Advertisement

ఆంపియర్ ప్రస్తుతం నెక్సస్, మాగ్నస్, రియో అనే ప్రధాన స్కూటర్ శ్రేణులను విక్రయిస్తోంది. ఇటీవల రియో VYB అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.1 లక్షలోపు ధరలో అందుబాటులో ఉండే ఈ మోడల్ పట్టణ ప్రయాణికులకు అనుగుణంగా రూపొందించింది.

అటు అమ్మకాలతో పాటు కంపెనీ తన సేవలను కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో 500కు పైగా డీలర్ల ద్వారా ఆంపియర్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 400కు పైగా సర్వీస్ టచ్‌పాయింట్ల ద్వారా అమ్మకాల అనంతర సేవలను అందిస్తోంది.

Read Also: జస్ట్ రూ.15 వేలకే ఇథనాల్ కన్వర్షన్ కిట్.. సింపుల్ గా E20 నుంచి E100 మారిపోవచ్చు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×