E-Paper
Advertisement

WhatsApp Update: ఎట్టకేలకు వాట్సాప్ వెబ్ యూజర్ల కోరిక నెరవేరబోతోంది.. ఇక బ్రౌజర్ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

WhatsApp Update: ఎట్టకేలకు వాట్సాప్ వెబ్ యూజర్ల కోరిక నెరవేరబోతోంది.. ఇక బ్రౌజర్ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!
Advertisement

WhatsApp Update: ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నప్పుడు గానీ ల్యాప్‌టాప్‌లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాప్పుడు గానీ వాట్సాప్ కాల్ వస్తే వెంటనే ఫోన్ ఎత్తుకోవాల్సి వచ్చేది. వాట్సాప్ వెబ్ వాడుతున్నా సరే, కాల్స్ చేయాలంటే మాత్రం విండోస్ యాప్ ఉండాల్సిందే లేదా మొబైల్ వైపు చూడాల్సిందే. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. వాట్సాప్ తన వెబ్ వెర్షన్ కోసం ఒక అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇక నుంచి మీరు నేరుగా బ్రౌజర్ నుంచే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడవచ్చు.

విండోస్ యాప్‌తో పనిలేదిక..

ప్రస్తుతం మనం వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాల్ బటన్ నొక్కితే.. ‘విండోస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి’ అని మెసేజ్ వస్తుంది. కానీ రాబోయే కొత్త అప్‌డేట్‌తో ఈ తలనొప్పి ఉండదు. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ WABetaInfo ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. మీరు ల్యాప్‌టాప్ లేదా ఆఫీస్ కంప్యూటర్‌ ద్వారానే, ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయకుండా నేరుగా వెబ్ నుంచే గ్రూప్ కాల్స్‌లో జాయిన్ అయిపోవచ్చు.

Advertisement

Also Read: ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. 7100mAh బ్యాటరీ వన్‌ప్లస్ నార్డ్ CE5 5G ఇప్పుడు తక్కువ ధరకే!

ఆఫీస్ మీటింగ్స్ ఇక సులభం..

ముఖ్యంగా ఆఫీస్ టీమ్స్ లేదా స్టూడెంట్స్ గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే, ఈ కాల్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది? హెచ్‌డీ వీడియో సపోర్ట్ చేస్తుందా? అన్న విషయాలపై వాట్సాప్ ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

కవర్ ఫొటోలకు సెక్యూరిటీ..

Advertisement

కాలింగ్ ఫీచర్‌తో పాటు వాట్సాప్ మరో సెక్యూరిటీ అప్‌డేట్‌ను కూడా తెచ్చింది. ఇకపై మీ వాట్సాప్ కవర్ ఫొటోలను ఎవరు చూడాలి? ఎవరు చూడకూడదు? అనేది మీరే డిసైడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది ఐఓఎస్ (iOS) బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మొత్తానికి వాట్సాప్ చేస్తున్న ఈ మార్పులు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: రియల్‌మీ నుంచి వస్తున్న ఈ కొత్త ఫోన్ పవర్‌కు తిరుగులేదు.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలివే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×