// // RCB-Anushka Sharma: RCBని కొనుగోలు చేయ‌నున్న అనుష్క‌ ? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

RCB-Anushka Sharma: RCB జ‌ట్టును కొనుగోలు చేయ‌నున్న అనుష్క‌..ఎన్ని కోట్లంటే ?

RCB-Anushka Sharma: RCB జ‌ట్టును కొనుగోలు చేయ‌నున్న అనుష్క‌..ఎన్ని కోట్లంటే ?
Advertisement

RCB-Anushka Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగళూరు జట్టులో ( RCB Team) మూడు శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఆమె సిద్ధమయ్యారట. ఈ మేరకు ఆర్సిబి యాజమాన్యాన్ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విరాట్ కోహ్లీ వద్దని చెప్పినా కూడా అనుష్క శర్మ ( Anushka Sharma ) మాత్రం.. తాను సంపాదించిన డబ్బులతో వాటాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

బెంగళూరు జట్టుపై కన్నేసిన అనుష్క శర్మ ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త యాజమాని రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న యాజమాన్యం డియాజియో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం అయ్యేసరికి బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ కచ్చితంగా వస్తాడు. ఈ జట్టును కొనుగోలు చేసేందుకు దాదాపు 1800 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. అంటే ఆర్సిబి జట్టు వ్యాల్యూ 1800 కోట్లు అన్నమాట.

ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడు శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నిర్ణయం తీసుకున్నారట. ఈ మూడు శాతం వాటాల కోసం దాదాపు 100 కోట్ల ఖర్చు అవుతుందని సమాచారం. ఈ మేరకు డబ్బులు కూడా ఆమె సిద్ధం చేసుకున్నారట. ఆమె హీరోయిన్ దశ నుంచి ఇప్పటివరకు సంపాదించుకున్న డబ్బులు అన్ని బెంగళూరు జట్టు ( Royal Challengers Bengalur ) కోసం పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే అతి త్వరలోనే బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ కూడా ఓనర్ కాబోతున్నాడు అన్నమాట.

అనుష్క ఒక్కటే కాదు… ఆ బాలీవుడ్ హీరో కూడా

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ( Royal Challengers Bengalur ) కొనుగోలు చేసేందుకు అనుష్క శర్మ నిర్ణయం తీసుకోగా…. అంతకుముందే బాలీవుడ్ హీరో రన్ బీర్ కపూర్ కూడా కన్నేశారు. ఆయన దాదాపు 8 శాతం బెంగళూరు వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారట. దీనికోసం దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు కాబోతున్నట్లు సమాచారం. ఇక జట్టు మెజారిటీ వాటాలను ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ మార్చి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read: BCCI Central Contract: ‘A+’ కేటగిరీ ఎత్తివేత‌..ప్లేయ‌ర్ల జీతాల్లో భారీ కోత..ఆ స్లాబ్ లోకి రోహిత్‌, కోహ్లీ !

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×