E-Paper
Advertisement

వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతికినా మురికిగా ఉన్నాయా? ఈ 5 తప్పులే కారణం!

వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతికినా మురికిగా ఉన్నాయా? ఈ 5 తప్పులే కారణం!
Advertisement

Washing Machine: బట్టలు ఉతికిన తర్వాత కూడా మురికిగానే ఉంటున్నాయా? డిటర్జెంట్ వాడినా మంచి సువాసన రావడం లేదా? అయితే సమస్య బట్టల్లో కాదు.. మీ వాషింగ్ మిషన్ లోనే ఉంది. కొంతమంది వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తారు కానీ.. అది సరిగ్గా పనిచేస్తోందో లేదో అస్సలు పట్టించుకోరు. దీనివల్ల బట్టలు శుభ్రం కాకపోవడమే కాకుండా.. సువాసనకు బదులు దుర్వాసన వస్తుంటుంది. ఈ నేపథ్యంలో వాషింగ్ మిషన్ బట్టలు సరిగ్గా ఉతక్కపోవడానికి గల 5 ప్రధాన కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎక్కువ బట్టలు వేయడం

చాలామంది సమయం, కరెంట్ ఆదా అవుతుందని ఒకేసారి వాషింగ్ మిషన్ నిండా బట్టలు కుక్కేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. మిషన్‌లో బట్టలు తిరగడానికి, నీరు, డిటర్జెంట్ అన్ని బట్టలకు సమానంగా అందడానికి తగినంత ఖాళీ స్థలం తప్పనిసరి. ఎక్కువ బట్టలు వేయడం వల్ల మురికి సరిగ్గా వదలకపోవడమే కాకుండా మిషన్ మోటార్‌పై కూడా భారం పడి అది త్వరగా పాడైపోతుంది.

డిటర్జెంట్ మోతాదులో తేడాలు

Advertisement

డిటర్జెంట్ ఎక్కువ వేస్తే బట్టలు బాగా శుభ్రపడతాయని చాలా భావిస్తుంటారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఎక్కువ సర్ఫ్ లేదా లిక్విడ్ వాడటం వల్ల నురగ ఎక్కువగా వచ్చి అది బట్టలకే పేరుకుపోతుంది. దీనివల్ల బట్టలు జిగటగా మారతాయి. అలాగని చాలా తక్కువ డిటర్జెంట్ వాడితే మురికి వదలదు. కాబట్టి మిషన్ రకం (టాప్ లోడ్ లేదా ఫ్రంట్ లోడ్), బట్టల పరిమాణాన్ని బట్టి సరైన మోతాదులో మాత్రమే డిటర్జెంట్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

మురికిగా మారిన డ్రమ్

బట్టలను శుభ్రం చేసే వాషింగ్ మిషన్ ను సైతం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. రోజులు గడిచేకొద్దీ మిషన్ డ్రమ్ లోపల డిటర్జెంట్ అవశేషాలు, బట్టల నుంచి వచ్చిన మురికి, మట్టి పేరుకుపోతాయి. దీనివల్ల బట్టలు ఉతికినప్పటికీ వాటి నుంచి ఒక రకమైన దుర్వాసన వస్తుంది. కాబట్టి నెలకు ఒకసారైనా ‘టబ్ క్లీన్’ (Tub Clean) ఫీచర్‌ను ఉపయోగించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. లేదంటే వెనిగర్, బేకింగ్ సోడా వేసి మిషన్ ను ఖాళీగా రన్ చేయడం ద్వారా టబ్ క్లీన్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

డిటర్జెంట్ డ్రాయర్ క్లీనింగ్

Advertisement

డిటర్జెంట్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ వేసే డ్రాయర్ (Dispenser Drawer)లో కాలక్రమేణా జిగటగా ఉండే సబ్బు మురికి పేరుకుపోతుంది. దీనివల్ల మనం వేసే డిటర్జెంట్ పూర్తిగా నీటితో కలిసి డ్రమ్‌లోకి వెళ్లదు. కాబట్టి ఈ డ్రాయర్‌ను వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి బయటకు తీసి, బ్రష్‌తో శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ATMలో కార్డ్ ఇరుక్కుపోయిందా? కంగారు వద్దు మామ.. వెంటనే ఇలా చేయండి!

డ్రైనేజీ ఫిల్టర్ బ్లాక్

ఫ్రంట్ లోడ్, కొన్ని టాప్ లోడ్ మిషన్లలో కింద భాగంలో డ్రైనేజీ ఫిల్టర్ ఉంటుంది. బట్టల నుంచి వచ్చే దారాలు, పిన్నులు, మురికి అంతా ఇక్కడే ఆగిపోతాయి. ఈ ఫిల్టర్ పూర్తిగా బ్లాక్ అయితే.. వాష్ చేసిన నీరు బయటకు సరిగ్గా పోదు. అదే మురికి నీరు మళ్లీ బట్టలకు అంటుకుంటుంది. కాబట్టి నెలకోసారి ఈ ఫిల్టర్ తీసి క్లీన్ చేయాలని నిపుణులు హితవు పలుకుతున్నారు.

Also Read: వాషింగ్ మిషన్‌లో బకెట్ వేడి నీళ్లు.. తర్వాత జరిగే అద్భుతం ఇదే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×