E-Paper
Advertisement

రూ.11 వేలకే..పెద్ద కుటుంబాలకు సరిపోయే వాషింగ్ మెషీన్

రూ.11 వేలకే..పెద్ద కుటుంబాలకు సరిపోయే వాషింగ్ మెషీన్
Advertisement

Voltas Beko 8.5 kg washing machine: చాలా మందికి ‘టాటా'(Tata) బ్రాండ్ అంటేనే ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే.. వోల్టాస్ బెకో మార్కెట్లోకి తెచ్చిన మోడలే.. “Voltas Beko 8.5 Kg 5 Star Semi-Automatic Washing Machine”. ఇంట్లో ఐదు లేదా ఆరుగురు అంతకంటే.. ఎక్కువ మంది సభ్యులు ఉన్న పెద్ద కుటుంబాలకు ఈ వాషింగ్ మెషీన్ బెస్ట్ అనే చెప్పాలి. భారీ కెపాసిటీ, కరెంట్ ఆదా చేసే.. 5-స్టార్ రేటింగ్, రఫ్ అండ్ టఫ్ బాడీతో వచ్చే ఈ సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషీన్ పూర్తి వివరాలు..

వోల్టాస్ బెకో 8.5 కేజీ వాషింగ్ మెషీన్ -స్పెషల్ రివ్యూ:

మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నా, సెమీ-ఆటోమేటిక్ కేటగిరీలో.. ఈ వోల్టాస్ బెకో మోడల్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. దీనికి గల ముఖ్యమైన కారణాలు , ఫీచర్స్ ఇవే..

1. జంబో కెపాసిటీ (8.5 Kg):

Advertisement

ఇంట్లో బట్టలు ఎక్కువగా ఉన్నా, వారానికి ఒకసారి మాత్రమే బట్టలు ఉతికే అలవాటు ఉన్నా ఈ 8.5 కేజీ కెపాసిటీ పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. పెద్ద పెద్ద బెడ్‌షీట్లు, బరువైన బ్లాంకెట్లు (దుప్పట్లు), జీన్స్ ప్యాంట్లను కూడా ఇందులో చాలా ఈజీగా, ఫ్రీగా ఉతికేయవచ్చు.

2. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ :

చాలా మంది వాషింగ్ మెషీన్ కొనడానికి భయపడేది కరెంట్ బిల్లు కోసమే. కానీ ఇందులో.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉండటం వల్ల తక్కువ కరెంట్, తక్కువ నీటిని వాడుకుంటుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దీనికి 5-స్టార్ రేటింగ్ ఇచ్చింది. కాబట్టి కరెంట్ బిల్లు భయం అస్సలు అక్కర్లేదు.

3. పవర్‌ఫుల్ పల్సేటర్ & యూనిక్ వాష్ ప్రోగ్రామ్స్:

Advertisement

ఇందులో ఇచ్చే పవర్‌ఫుల్ మోటార్, ప్రత్యేకమైన పల్సేటర్ డిజైన్ వల్ల నీటిలో మంచి అలలు క్రియేట్ అవుతాయి. ఇది కాలర్లపై ఉండే మురికిని, మొండి మరకలను కూడా బట్టలు పాడవకుండా క్లీన్ చేస్తుంది. బట్టల రకాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ వాష్ మోడ్స్ కూడా ఉన్నాయి.

4. ఫాస్ట్ డ్రైయింగ్:

సెమీ-ఆటోమేటిక్ మెషీన్లలో బట్టలు ఎంత త్వరగా ఆరిపోతే అంత మంచిది. ఈ వోల్టాస్ బెకో మెషీన్ లోని స్పిన్ టబ్ చాలా ఎక్కువ RPM స్పీడ్‌తో తిరుగుతుంది. దీని వల్ల బట్టల్లోని నీరంతా పిండేసి, ఎండ తక్కువగా ఉన్నా సరే బట్టలు చాలా ఫాస్ట్‌గా ఆరిపోయేలా చేస్తుంది.

Also Read: జీన్స్ అయినా, శారీ అయినా ఆల్-రౌండర్ లుక్.. మహిళల కోసం టాప్ 5 టైటాన్ వాచెస్!

5. డ్యూరబుల్ బాడీ అండ్ లుక్:

ఇది హై-క్వాలిటీ ప్లాస్టిక్ తో వస్తుంది. కాబట్టి బాత్రూమ్ లో లేదా తడి తగిలే చోట పెట్టినా తుప్పు పట్టే ఛాన్స్ లేదు. దీని డిజైన్ , కలర్ కాంబినేషన్ చాలా మోడ్రన్‌గా ఉండి, వంటగది లేదా బాల్కనీకి మంచి లుక్ ఇస్తుంది.

ధర వివరాలు:

వోల్టాస్ బెకో 8.5 కేజీ 5-స్టార్ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధర మార్కెట్లో.. ఆన్‌లైన్ స్టోర్స్ లో ఆఫర్లను బట్టి సుమారు రూ.11,490 నుంచి రూ.13,000 మధ్య అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్లు ఉన్నప్పుడు ఇది ఇంకా తక్కువకే దొరికే అవకాశం ఉంది.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బట్టలు ఉతికే, కరెంట్ బిల్లు షాక్ ఇవ్వని ఒక బెస్ట్ హెవీ-డ్యూటీ వాషింగ్ మెషీన్ కావాలంటే.. Voltas Beko 8.5 Kg కి తిరుగులేదు. టాటా బ్రాండ్ భరోసా, మంచి వారెంటీ సర్వీస్ ఉండటం దీనికి అదనపు బలం. మీ పెద్ద ఫ్యామిలీకి బట్టలు ఉతికే కష్టాల నుంచి రిలీఫ్ ఇవ్వడానికి ఈ హోమ్ అప్లయన్స్ ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×