E-Paper
Advertisement

Vodafone 5G Awards: జియో, ఎయిర్‌టెల్‌ని వెనక్కునెట్టిన వొడాఫోన్.. 5G రేసులో విన్నర్ విఐ

Vodafone 5G Awards: జియో, ఎయిర్‌టెల్‌ని వెనక్కునెట్టిన వొడాఫోన్.. 5G రేసులో విన్నర్ విఐ
Advertisement

Vodafone 5G Awards| దేశీయ టెలికాం కంపెనీల్లో టాప్ 2 అయిన జియో, ఎయిర్‌టెల్‌ని వెనక్కనెట్టి వోడాఫోన్ ఐడియా (Vi) విజయం సాధించింది. 5G సర్వీసుల్లో మొదటిసారి పెద్ద విజయం సాధించింది. మిగతా రెండు కపెనీల కంటే వొడాఫోన్ 5G సర్వీస్ క్వాలిటీ బాగుంది. ఇది 5G నెట్‌వర్క్ లాంచ్ తర్వాత వచ్చిన విజయం.

నెట్‌వర్క్ అనాలిసిస్ కంపెనీ Opensignal రిపోర్ట్ ప్రకారం వొడాఫోన్ టాప్ పొజిషన్‌లో ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న పెర్ఫామెన్స్ ఆధారంగా ఈ రిపోర్ట్ తయారైంది. వీడియో, గేమింగ్, వాయిస్ అప్లికేషన్లలో Vi మంచి స్కోరు సాధించింది. ఇంతకు ముందు జియో, ఎయిర్‌టెల్ ఈ ర్యాంకింగ్‌లలో ఎప్పుడూ ముందుండేవి. ఈసారి Vi అందరినీ ఆశ్చర్యపరిచింది.

5G వీడియో ఎక్స్‌పీరియన్స్‌లో Vi టాప్

Advertisement

5G వీడియో ఎక్స్‌పీరియన్స్‌లో వొడాఫోన్ ఐడియా అత్యధిక స్కోరు సాధించింది. 100 పాయింట్ల స్కేల్‌లో Viకి 73.9 పాయింట్లు వచ్చాయి. ఎయిర్‌టెల్ 73.2, జియో 71.8 పాయింట్లు సాధించాయి. Vi నెట్‌వర్క్‌లో వీడియో స్ట్రీమింగ్ చాలా స్మూత్‌గా, అంతరాయం లేకుండా జరిగింది. మంచి క్వాలిటీ, తక్కువ బఫరింగ్ ఉంది. ఇప్పటికే టాప్ కంపీటీటర్లతో సమానంగా నిలిచింది.

5G గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో అగ్రస్థానం

5G గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా Vi మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో Viకి 81.8 పాయింట్లు వచ్చాయి. జియో 80.2, ఎయిర్‌టెల్ 77.4 పాయింట్లు సాధించాయి. తక్కువ లేటెన్సీ, స్థిరమైన కనెక్షన్ వల్ల ఆన్‌లైన్ గేమ్స్ స్మూత్‌గా ఆడవచ్చు. గేమర్లకు మంచి అనుభవం ఇచ్చింది.

5G వాయిస్ అప్లికేషన్ ఎక్స్‌పీరియన్స్‌లో టాప్

Advertisement

వాయిస్ అప్లికేషన్ కేటగిరీలో కూడా Vi ముందుంది. ఇందులో Viకి 83 పాయింట్లు వచ్చాయి. జియో 82.8, ఎయిర్‌టెల్ 81.9 పాయింట్లు సాధించాయి. కాల్స్ స్పష్టంగా, కాల్ డ్రాప్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వాయిస్ క్వాలిటీ చాలా నమ్మకంగా ఉంది.

మూడు అవార్డులు గెలిచిన వొడాఫోన్ ఐడియా

Opensignal 5 ఎక్స్‌పీరియన్స్ కేటగిరీల్లో అవార్డులు ఇస్తుంది. ఈసారి Vi మూడు అవార్డులు గెలిచింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఒక్క అవార్డు కూడా రాలేదు. ఇది Viకి పెద్ద మార్పు. ఓపెన్ సిగ్నల్.. ప్రిన్సిపల్ అనలిస్ట్ Vi పెర్ఫామెన్స్ బాగుందని చెప్పారు.

Also Read: ఐఫోన్ ట్రిక్.. లైవ్ ఫొటోలను ఒకే వీడియోగా మార్చేయండి.. క్షణాల్లోనే

స్పీడ్, కవరేజ్‌లో జియో, ఎయిర్‌టెల్ ముందు

5G స్పీడ్‌లో జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికీ ముందున్నాయి. డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో 198.9 Mbpsతో టాప్‌లో ఉంది. ఎయిర్‌టెల్ 185.9 Mbps, Vi 134.8 Mbps సాధించాయి. అప్‌లోడ్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్ 19.3 Mbpsతో ముందు. Vi 17 Mbps, జియో 13 Mbps ఉన్నాయి. 5G కవరేజ్‌లో Vi ఇంకా వెనకే ఉంది. జియో, ఎయిర్‌టెల్ చాలా ఏళ్లుగా నెట్‌వర్క్ విస్తరించాయి. Vi ఆలస్యంగా స్టార్ట్ చేసింది. కాబట్టి ఎంపిక చేసిన సిటీల్లో మాత్రమే ఉంది. కానీ నెట్‌వర్క్ ఉన్న ప్రతిచోట మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది.

ముఖ్యమైన ఎక్స్‌పీరియన్స్ అవార్డులు సాధించడంతో Vodafone Idea తన 5G క్వాలిటీని బాగుందని నిరూపించుకుంది. అయితే స్పీడ్, కవరేజ్‌లో జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికీ ముందున్నాయి. ఇండియా 5G మార్కెట్‌లో పోటీ పెరిగింది. యూజర్లకు మంచి ఛాయిస్‌లు వచ్చాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×