// // Smartphone Comparison| వివో Y500 ప్రో vs ఓప్పో F31 vs రియల్‌మీ P4 ప్రో -->
E-Paper
Advertisement

Smartphone Comparison: వివో Y500 ప్రో vs ఓప్పో F31 vs రియల్‌మీ P4 ప్రో.. మిడ్ రేంజ్‌లో కొత్త ఫోన్లు.. ఏది కొనాలి?

Smartphone Comparison: వివో Y500 ప్రో vs ఓప్పో F31 vs రియల్‌మీ P4 ప్రో.. మిడ్ రేంజ్‌లో కొత్త ఫోన్లు.. ఏది కొనాలి?
Advertisement

Vivo Y500 Pro vs Oppo F31 5G vs Realme P4 Pro 5G comparison| మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో లేటెస్ట్‌గా వివో Y500 ప్రో లాంచ్ అయింది. మధ్య తరగతి బడ్జెట్ లో ఈ ఫోన్ మంచి ఫీచర్లు అందిస్తోంది. అయితే ఫీచర్ల పరంగా ఈ ఫోన్ కు రియల్‌మీ P4 ప్రో, ఓప్పో F31 5Gతో గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే మూడు ఫోన్లలో ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకునేందుకు వీటి ఫీచర్లను పోల్చి చూద్దాం.

ధర, స్టోరేజ్ ఆప్షన్స్

వివో Y500 ప్రో ధర 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ ప్రారంభ దాదాపు రూ22,400. 256GB వేరియంట్ ధర సుమారు రూ24,900. ఓప్పో F31 5G బేస్ మోడల్ (8GB/128GB) ధర రూ23,999. 256GB వేరియంట్ ధర రూ.25,999. రియల్‌మీ P4 ప్రో 5G బేస్ మోడల్ ధర రూ23,999 . 8GB+256GB వేరియంట్ ధర రూ. 24,999. మూడు ఫోన్లు ధరల పరంగా స్వల్ప తేడా తో ఉన్నాయి. వివో కాస్త తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే, విజువల్ క్వాలిటీ

Advertisement

వివో Y500 ప్రోలో 6.67 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఓప్పో F31 5Gలో 6.57 అంగుళాల FHD+ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. రియల్‌మీ P4 ప్రో 5Gలో 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అగ్రస్థానంలో నిలుస్తుంది.

ప్రాసెసర్, పెర్ఫామెన్స్

వివో Y500 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ఉంది. ఇది మిడ్-రేంజ్‌లో బలమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓప్పో F31 5Gలో డైమెన్సిటీ 6300 చిప్ ఉంది – ఇది సామర్థ్యం ఉన్నా, కొంచెం తక్కువ శక్తివంతం. రియల్‌మీ P4 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. ఇది అద్భుతమైన స్పీడ్, ఎఫిషియెన్సీని అందిస్తుంది.

సాఫ్ట్‌వేర్, యూజర్ ఇంటర్‌ఫేస్

Advertisement

మూడు ఫోన్లు ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతాయి. వివో Y500 ప్రోలో ఫన్‌టచ్ OS 15, ఓప్పో F31 5Gలో కలర్ OS 15, రియల్‌మీ P4 ప్రోలో రియల్‌మీ UI 6.0 ఉన్నాయి. మీ సాఫ్ట్‌వేర్ ప్రాధాన్యంపై ఎంపిక ఆధారపడి ఉంటుంది.

కెమెరా సామర్థ్యం

వివో Y500 ప్రోలో 200MP ప్రైమరీ రియర్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఓప్పో F31 5Gలో 50MP మెయిన్ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ లెన్స్, 16MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. రియల్‌మీ P4 ప్రోలో 50MP మెయిన్ + 8MP అల్ట్రా-వైడ్ డ్యూయల్ రియర్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ, ఛార్జింగ్

మూడు ఫోన్లలోనూ 7000mAh బ్యాటరీ ఉంది. వివో Y500 ప్రో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అత్యంత వేగవంతం. ఓప్పో F31 5G, రియల్‌మీ P4 ప్రో 80W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అన్ని ఫోన్లలో బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.

కనెక్టివిటీ ఫీచర్స్

మూడు స్మార్ట్‌ఫోన్లు 5G సపోర్ట్, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. వివో, రియల్‌మీ మోడల్స్‌లో Wi-Fi 6 ఉంది. ఓప్పో F31 5Gలో Wi-Fi 5 మాత్రమే ఉంది.

ఏది కొనాలి?

వివో Y500 ప్రో: అద్భుతమైన 200MP మెయిన్ కెమెరా, వేగవంతమైన 90W ఛార్జింగ్ కోసం.
రియల్‌మీ P4 ప్రో: అద్భుతమైన 144Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50MP సెల్ఫీ కెమెరా కోసం.
ఓప్పో F31 5G: అన్నీ ఫీచర్స్ బ్యాలెన్స్ గా ఉన్నాయి.

మీ ప్రాధాన్యం (కెమెరా, డిస్‌ప్లే, పెర్ఫామెన్స్) ఆధారంగా ఎంచుకోండి.

Also Read: ఇంటి పనులు చకచకా చేసే రోబో వచ్చేసింది.. ధర కూడా అందుబాటులోనే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×