E-Paper
Advertisement

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!
Advertisement

KBR Python: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) నేషనల్ పార్క్‌లో శనివారం సుమారు 20 అడుగుల పొడవైన భారీ కొండచిలువ కనిపించడం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయం వాకింగ్‌కు వచ్చిన సందర్శకుల కళ్లముందే ఆ భారీ కొండచిలువ పార్క్‌లోని నడక మార్గాన్ని నెమ్మదిగా దాటుతూ కనిపించింది. దాని భారీ పరిమాణం కారణంగా మార్గాన్ని పూర్తిగా దాటేందుకు కొంత సమయం పట్టింది.

ఫోన్లలో చిత్రీకరణ..

ఈ దృశ్యాన్ని చూసిన పలువురు సందర్శకులు మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించగా, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనతో కొద్దిసేపు పార్క్‌లో సందర్శకులు అప్రమత్తంగా ఉండగా, అనంతరం కొండచిలువ సహజంగా అడవి ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అక్కడి అధికారులు తెలిపారు.

Advertisement

Also read: Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

నగం నడిబోడ్డున..

KBR నేషనల్ పార్క్ హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నప్పటికీ, అనేక రకాల పక్షులు, జంతువులు, సరీసృపాలకు నిలయంగా పేరుగాంచింది. ఈ సంఘటన పట్టణ అటవీ ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఎంత సమృద్ధిగా ఉందో మరోసారి గుర్తు చేసింది. వన్యప్రాణులు కనిపించినప్పుడు వాటికి దూరంగా ఉండాలని, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని నిపుణులు తెలిపారు.

Advertisement

Allso read: Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×