// // Vivo X300 Ultra and X300 FE: వివో నుంచి రెండు క్రేజీ ఫోన్లు త్వరలో లాంచ్! -->
E-Paper
Advertisement

భారత్‌లో Vivo X300 సిరీస్ లాంచ్ ఖరారు.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో అరాచకం!

భారత్‌లో Vivo X300 సిరీస్ లాంచ్ ఖరారు.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో అరాచకం!
Advertisement

Vivo X300 Ultra and X300 FE: టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వివో X300 సిరీస్ ఎట్టకేలకు భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. రకరకాల లీకులు, గాసిప్స్ తర్వాత స్వయంగా ఈ మొబైల్ సంస్థే ఈ విషయాన్ని అఫీషియల్‍గా చెప్పేసింది. అంతా అనుకున్నట్టు జరిగితే.. మే 7వ తేదీన ఈ ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటిదాకా చైనా వాళ్లకు మాత్రమే పరిమితమైన Ultra మోడల్‌ను తొలిసారి మన దేశానికి తీసుకురావడం వివో వినియోగదారుల్లో మంచి జోష్ నింపుతోంది.

కెమెరా అంటేనే వివో..

ఫొటోలు తీయడం అంటే బాగా ఇష్టమున్న వాళ్లకి ఈ ఫోన్ పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. వివో X300 అల్ట్రాలో మెయిన్ కెమెరాతో పాటు పెరిస్కోప్ లెన్స్ కూడా 200 మెగాపిక్సెల్ ఇచ్చారు. దీంతో ఎంత దూరం ఉన్న వస్తువునైనా ఇట్టే క్లియర్‍గా ఫొటో తీయొచ్చు అన్నమాట. అలాగే దీనిలో ఉన్న టెలికన్వర్టర్ ఫీచర్ వల్ల జూమ్ చేసినా క్లారిటీ తగ్గదు. కేవలం కెమెరానే కాదు.. స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీతో పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. అయితే ఫీచర్లు ఇంత రేంజ్‌లో ఉన్నాయి కాబట్టి.. దీని ధర లక్ష రూపాయలు దాటే అవకాశం ఉంది.

Advertisement

Also Read: రూ.30 వేల బడ్జెట్‌లో అదిరిపోయే గేమింగ్ ఫోన్.. Vivo T5 Pro 5G పూర్తి వివరాలు మీ కోసం!

జైస్ కెమెరా సెటప్..

కొందరికి పెద్ద పెద్ద ఫోన్లు పట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే వివో X300 FEని తీసుకొస్తోంది. ఇది చేతిలో ఇమిడిపోయేలా చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. సైజు చిన్నదే అయినా పనితీరులో మాత్రం మెరుగైన సేవలు అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ లోనూ పవర్‌ఫుల్ ప్రాసెసర్, జైస్ కెమెరా సెటప్ ఇచ్చారు. పైగా ఇంత చిన్న ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ యూజర్స్ కోసం స్పెషల్‌గా గ్రీన్ కలర్ వేరియంట్‌ను కూడా తీసుకొస్తుండటం విశేషం.

ధర విషయానికి వస్తే..

Advertisement

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్, ఒప్పో వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేలా వివో ఈ X300 సిరీస్‌ను సిద్ధం చేసింది. ముఖ్యంగా అల్ట్రా మోడల్‌తో ప్రీమియం ఫోన్ల మార్కెట్లో ఒక ఊపు ఊపాలని చూస్తోంది. మరి ఈ ఫోన్ల అసలు ధరలు ఏంటి? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే మే 7 వరకు ఆగాల్సిందే. ఒకవేళ మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటే మాత్రం.. ఒక్కసారి ఇవి లాంచ్ అయ్యాక రివ్యూలు చూసి డెసిషన్ తీసుకోవడం మంచిది.

Also Read: మినీ ఏసీలు.. ఇవి నిజంగానే కూలింగ్ ఇస్తాయా? అంతా ఉత్తిదేనా? ఫుల్ రివ్యూ

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×