E-Paper
Advertisement

డీజిల్ కంటే బెస్ట్ మైలేజ్ ఇచ్చే 5 హైబ్రిడ్ కార్లు ఇవే!

డీజిల్ కంటే బెస్ట్ మైలేజ్ ఇచ్చే 5 హైబ్రిడ్ కార్లు ఇవే!
Advertisement

Top 5 Hybrid Cars for Maximum Mileage: డీజిల్ కార్ల మైలేజ్ బాగుంటుందని చాలామంది భావిస్తారు. కానీ, ఇప్పుడు మార్కెట్‌లో పెట్రోల్ హైబ్రిడ్ కార్లు అదే స్థాయిలో, కొన్నిసార్లు మరింత ఎక్కువ మైలేజ్ అందిస్తున్నాయి. ముఖ్యంగా హైవే డ్రైవింగ్‌లో మంచి మైలేజ్‌తో పాటు సైలెంట్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తాయి. అలాంటి ఐదు మంచి హైబ్రిడ్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి విక్టోరిస్

ప్రస్తుతం దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్లలో ఒకటి. సుమారు 28.6 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలిపి పని చేస్తాయి. దీని వల్ల పవర్ తగ్గకుండా, ఇంధన వినియోగం తగ్గుతుంది. డ్రైవ్ మోడ్‌లలో ఎకో, నార్మల్, పవర్ ఉండటంతో మీ అవసరానికి అనుగుణంగా సెట్టింగ్ మార్చుకోవచ్చు. అంతేకాకుండా పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, సన్‌రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

⦿ హోండా సిటీ హైబ్రిడ్

Advertisement

హోండా సిటీ హైబ్రిడ్ సెడాన్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. ఇది 1.5 లీటర్ ఇంజన్‌తో పాటు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సిస్టమ్ ఉంటుంది. మంచి పవర్‌ తో పాటు సుమారు 26.5 kmpl మైలేజ్ ఇస్తుంది. సిటీ హైబ్రిడ్ డ్రైవింగ్ చాలా సాఫీగా ఉంటుంది. తక్కువ వేగంలో కూడా మంచి రిస్పాన్స్ ఇస్తుంది. ఫీచర్లలో LED లైట్స్, సన్‌ రూఫ్, క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ కనెక్టివిటీ ఉన్నాయి.

⦿ టయోటా ఇన్నోవా హైక్రాస్

ఇది పెద్ద కుటుంబాలకు సరిపోయే 7, 8 సీటర్ ఎంపీవీ. అయినప్పటికీ, దీని హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల సుమారు 23.24 kmpl మైలేజ్ వస్తుంది. 2.0 లీటర్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉండటం వల్ల పూర్తి లోడ్ ఉన్నా పనితీరు తగ్గదు. హైవే ట్రిప్స్‌ కు  చాలా అనుకూలంగా ఉంటుంది. లోపల పెద్ద స్థలం, సౌకర్యవంతమైన సీట్లు, సన్‌ రూఫ్, మంచి సౌండ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ టయోటా క్యామ్రీ

Advertisement

ఇది ఓ ప్రీమియం సెడాన్. 2.5 లీటర్ హైబ్రిడ్ ఇంజన్‌ తో వస్తుంది. సుమారు 25.49 kmpl మైలేజ్ ఇస్తూ, పవర్, కంఫర్ట్ రెండింటినీ సమతుల్యం చేస్తుంది. ఈ కారులో డ్రైవింగ్ చాలా సైలెంట్‌ గా, స్మూత్‌గా ఉంటుంది. లోపల పెద్ద డిస్‌ ప్లేలు, క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ సీట్లు, హెడప్ డిస్‌ ప్లే లాంటి లగ్జరీ ఫీచర్లు ఉంటాయి.

⦿ వోల్వో XC90

వోల్వో XC90  మైల్డ్ హైబ్రిడ్ SUV. మిగతా కార్లతో పోలిస్తే మైలేజ్ కొంచెం తక్కువ అయినప్పటికీ, లగ్జరీ, పవర్, భద్రతలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2.0 లీటర్ ఇంజన్‌ తో పాటు 48V హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. దీని వల్ల ఇంధన వినియోగం కొంత వరకు తగ్గుతుంది. ఇది మూడు వరుసల సీటింగ్‌తో పెద్ద కుటుంబాలకు సరిపోతుంది. లోపల ప్రీమియం లెదర్ సీట్లు, పెద్ద స్క్రీన్‌లు, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Read Also: టియాగో EV To VF3.. త్వరలో విడుదల కాబోతున్న 7 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×