E-Paper
Advertisement

Vivo X300 FE: 6500mAh బ్యాటరీతో లాంచ్ అయిన వివో X300 FE.. ధర, ఫుల్ ఫీచర్స్ ఇవే

Vivo X300 FE: 6500mAh బ్యాటరీతో లాంచ్ అయిన వివో X300 FE.. ధర, ఫుల్ ఫీచర్స్ ఇవే
Advertisement

Vivo X300 FE| వివో కంపెనీ కొత్త వివో X300 FE స్మార్ట్‌ఫోన్ రష్యాలో లాంచ్ చేసింది. ఇది ఫ్లాగ్‌షిప్ లెవల్ హార్డ్‌వేర్, ఫీచర్లు ఉన్న ఫోన్. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయిన Vivo S50 Pro Mini ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్. ఈ ఫోన్‌లో వివో పెర్ఫామెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

ధర, కలర్ ఆప్షన్లు

వివో X300 FE 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర 60,124 రూబుల్స్ (భారత కరెన్సీలో దాదాపు రూ.71,200).
12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 64,405 రూబుల్స్ ( అంటే దాదాపు రూ.76,200).
ఈ ఫోన్ మూడు కలర్లలో (మూన్‌లైట్ వైట్, కూల్ లిలాక్, గ్రాఫైట్ బ్లాక్) లభిస్తుంది .

డిస్‌ప్లే, డిజైన్

Advertisement

వివో X300 FEలో 6.31 ఇంచ్ LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్ (1216 × 2640 పిక్సెల్స్). 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా బ్రైట్‌నెస్ 5,000 నిట్స్ చేస్తుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. LTPO టెక్నాలజీ వల్ల పవర్ ఎఫిషియెంట్‌గా ఉంటుంది. రిఫ్రెష్ రేట్ ఆటోమాటిక్‌గా సర్దుబాటు అవుతుంది.

ప్రాసెసర్, పర్‌ఫామెన్స్

వివో X300 FEలో అడ్వాన్స్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ చిప్‌సెట్ ఉంది. అందుకే ఫోన్ హై-ఎండ్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా జరుగుతాయి. హెవీ యాప్‌లను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. OriginOS 6 సాఫ్ట్‌వేర్ రిఫైన్డ్ ఫీచర్లు ఇస్తుంది. Android 16తో సెక్యూరిటీ, టూల్స్ అప్‌డేటెడ్‌గా ఉంటాయి.

కెమెరా సెటప్

Advertisement

ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్ (f/1.57 అపర్చర్)తో మంచి లైట్ క్యాప్చర్ చేస్తుంది. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా. 50MP టెలిఫోటో కెమెరా. 50MP ఫ్రంట్ కెమెరాతో అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ ఇస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్

X300 FEలో 6,500mAh పెద్ద బ్యాటరీ ఉంది. 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ సేపు ఉపయోగించవచ్చు. ఫాస్ట్ చార్జింగ్ వల్ల వెయిటింగ్ టైమ్ తగ్గుతుంది. స్క్రీన్ ఆన్ టైమ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

కనెక్టివిటీ, సెన్సార్లు

4G, 5G నెట్‌వర్క్‌లు సపోర్ట్ చేస్తుంది. Wi-Fi, బ్లూటూత్, NFC ఉన్నాయి. GPS, BeiDou నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎక్సిలరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, జైరోస్కోప్ ఉన్నాయి. నావిగేషన్, మోషన్ ట్రాకింగ్ మెరుగవుతాయి.

Also Read:  మీ ఫోన్‌లో ఫోటోలు సెర్చ్ చేయడం కష్టంగా ఉందా? ఇలా చేస్తే సెకన్లలో పని పూర్తి

భారత్‌లో వివో V70 సిరీస్ లాంచ్

ఇటీవల వివో V70 ఎలైట్, V70 ఫోన్లు భారత్‌లో సేల్స్ ప్రారంభమయ్యాయి. V70 ఎలైట్‌లో 6.59 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, 5,000 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్, 6,500mAh బ్యాటరీ, 90W చార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×