// // Vivo X Fold 6: వివో ఫోల్డబుల్ ఫోన్‌లో 200MP కెమెరా..! -->
E-Paper
Advertisement

వివో, షియోమీల నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే వావ్ అవ్వాల్సిందే!

వివో, షియోమీల నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే వావ్ అవ్వాల్సిందే!
Advertisement

Vivo X Fold 6: ఇప్పుడంతా ఎక్కడ చూసినా ఫోల్డబుల్ ఫోన్ల ముచ్చటే వినిపిస్తోంది. గతేడాదిలోనే కొత్త మోడళ్ల సందడి మొదలైపోయింది. ఇప్పటికే చైనా మార్కెట్లో హానర్, ఒప్పో కంపెనీలు తమ కొత్త ఫోన్లతో దుమ్ములేపుతుంటే.. ఇప్పుడు అందరి చూపు వివో, షియోమీల వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాబోతున్న Vivo X Fold 6, Xiaomi Mix Fold 5 ఫోన్లు ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాయో తెలుసుకుందాం రండి..

వివో ఎక్స్ ఫోల్డ్ 6:

వివో తమ కొత్త ఫోల్డబుల్ ఫోన్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఫొటోల పిచ్చి ఉన్నవారికి వివో X ఫోల్డ్ 6 బాగా నచ్చుతుంది. ఎందుకంటే.. దీనిలో ఏకంగా 200MP కెమెరాను సెట్ చేస్తున్నారట. ఫోల్డబుల్ ఫోన్లలో ఇలాంటి భారీ కెమెరా రావడం నిజంగా విశేషమే. ఇక నుంచి ఫోల్డబుల్ ఫోన్‌తో కూడా ప్రొఫెషనల్ రేంజ్ ఫొటోలు తీసుకోవచ్చన్నమాట.

Advertisement

Also Read: ఆండ్రాయిడ్ 16తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదేనా? Xiaomi 17T అదిరిపోయే ఫీచర్లు లీక్!

ఇక్కడే అసలు ట్విస్ట్:

చాలామందికి ఫోల్డబుల్ ఫోన్లంటే బ్యాటరీ త్వరగా అయిపోతుందనే భయం ఉంటుంది. కానీ వివో ఆ భయానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఉంది. ఈ ఫోన్‌లో ఏకంగా 7,000mAh బ్యాటరీని పెడుతున్నారట. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. అంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ మాత్రం చాలా సన్నగా, బరువు తక్కువగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ జూన్ నెలలో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది.

షియోమీ మిక్స్ ఫోల్డ్ 5:

Advertisement

మరోవైపు షియోమీ కూడా తమ Mix Fold 5తో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈసారి షియోమీ ఒక అడుగు ముందుకేసి తమ సొంత ప్రాసెసర్ Xring O3ని వాడుతోంది. బయట కంపెనీల మీద ఆధారపడకుండా సొంతంగా తయారు చేసుకోవడం వల్ల ఫోన్ పనితీరు చాలా స్మూత్‌గా ఉంటుందని కంపెనీ నమ్ముతోంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మధ్య సింక్ అదిరిపోతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

అందుబాటులోకి ఎప్పుడంటే?

షియోమీ కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. వివో కంటే కాస్త ఆలస్యమైనా, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి వస్తోంది. ఏదేమైనా ఈ రెండు కంపెనీల రాకతో ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌లో పోటీ మామూలుగా ఉండదు. ఈ ఫోన్ల విడుదల కోసం టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: యాపిల్ ఫ్యాన్స్‌కు పండగే.. iPhone 17పై ఊహించని డిస్కౌంట్, ఎక్కడో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×