// //
Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని ఏసీలపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. తక్కువ ధరకే బ్రాండెడ్ ఎయిర్ కండీషనర్లను కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలోనే 2021 మోడల్ కు చెందిన క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ (Carrier 1.5 Ton 3 Star Inverter Split AC)పై భారీ రాయితీ ప్రకటించింది. MRP ధరపై 32% తక్కువకే ఏసీని తీసుకెళ్లమని బంపరాఫర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ క్యారియర్ ఏసీ ప్రధాన ఫీచర్లు? ఆఫర్ వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ క్యారియర్ ఏసీలో అధునాతన ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంది. ఇది గదిలోని వేడికి అనుగుణంగా కూలింగ్ ను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల విద్యుత్ ఆదా అవడమే కాకుండా కంప్రెసర్ ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు వీలు కలుగుతుంది.
క్యారియర్ ఏసీలలో ఫ్లెక్సీ కూల్ టెక్నాలజీ (Flexicool Technology) ఒక ప్రత్యేకమైన ఫీచర్ గా చెప్పవచ్చు. దీని ద్వారా ఏసీ కూలింగ్ కెపాసిటీని (50%, 75%, 100%) మీ అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. బయట వాతావరణం మరీ వేడిగా లేని సందర్భాల్లో తక్కువ కెసాసిటీతో ఏసీని రన్ చేయడం ద్వారా విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకునే వీలు ఉంటుంది.
ఈ ఏసీ.. బయటి విపరీతంగా ఎండ ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 52 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా గదిని వేగంగా చల్లబరుస్తుందని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా దీనిలోని ‘టర్బో కూల్’ ఆప్షన్.. కేవలం కొద్ది నిమిషాల్లోనే గది అంతటిని కూల్ గా మార్చేస్తుంది.
ఈ క్యారియర్ ఏసీ.. డ్యూయల్ ఫిల్టర్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది గాలిలోని ధూళి కణాలను, మైక్రో పొల్యూటెంట్లను సమర్థవంతంగా తొలగిస్తుంది. గదిలో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన గాలి ఉండేలా చేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం చాలా వరకూ తగ్గిపోతాయి.
ఈ ఏసీలో 100% కాపర్ కాయిల్స్ ను అమర్చారు. దీని వల్ల గది త్వరగా చల్లబడటంతో పాటు నిర్వహణ (Maintenance) కూడా సులభతరంగా మారిపోతుంది. కాపర్ కాయిల్స్ కు వేసిన ప్రత్యేక కోటింగ్ వల్ల అవి తుప్పుపట్టకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని కంపెనీ వర్గాలు భరోసా ఇస్తున్నాయి.
క్యారియర్ ఏసీలో ఈ ఫీచర్.. మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. వోల్టేజీలో వచ్చే స్వల్ప మార్పులను తట్టుకునేలా దీనిని రూపొందించారు. కాబట్టి వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఏసీ పాడవకుండా ఉంటుంది. అయితే మీ ప్రాంతంలో వోల్టేజ్ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటే విడిగా స్టెబిలైజర్ వాడుకోవడం బెస్ట్.
Also Read: రోజుకు 14-15 గంటలు కూలర్ వాడితే.. పవర్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
Carrier 1.5 Ton 3 Star ఏసీ అసలు ధర రూ.54,990. కానీ ఫ్లిప్ కార్ట్ దీనిపై 32 శాతం రాయితీ ఇస్తూ రూ.37,500కే అందిస్తోంది. Axis, SBI క్రెడిట్ కార్డ్ పై కొనుగోలు చేస్తే మరో రూ.1875 డిస్కోంట్ లభించనుంది. ఫలితంగా రూ.35,625కే దీనిని సొంతం చేసుకోవచ్చు. సరిపడనంత డబ్బు లేని వారికోసం EMI సౌకర్యాన్ని సైతం ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. 36 నెలలకు ఈఎంఐ తీసుకుంటే ప్రతీ నెల కేవలం రూ.1,248 మాత్రమే కడితే సరిపోతుంది.
Also Read: 5 Star vs Inverter AC: మీకూ ఇదే డౌటా.. రెండిట్లో ఏది బెటరో.. పిచ్చక్లారిటీతో తెలుసుకోండి మచ్చా!