E-Paper
Advertisement

Drum Air Cooler: వార్నీ భలే ఉందే.. డ్రమ్ముతో కూలర్ తయారీ.. ఇక మీ డబ్బంతా ఆదా!

Drum Air Cooler: వార్నీ భలే ఉందే.. డ్రమ్ముతో కూలర్ తయారీ.. ఇక మీ డబ్బంతా ఆదా!
Advertisement

Drum Air Cooler: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అడుగు తీసి బయటపెట్టలేని పరిస్థితి ఉంటోదని ప్రజలు వాపోతున్నారు. ఏసీలు, కూలర్లు లేకుండా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పాడుతోందని పేర్కొంటున్నారు. అయితే సాధారణంగా ఏసీ లేదా కూలర్ కొనాలంటే వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. అంత ఖర్చు పెట్టి వాటిని కొనే స్థోమత చాలా మందికి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఓ కుర్రాడు సాధారణ డ్రమ్మును కూలర్ గా మార్చిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

డ్రమ్ముతో ఎయిర్ కూలర్

ఓ యువకుడు ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతో కూలర్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన తెలివితేటలతో డ్రమ్మును కూలర్ గా తీర్చిదిద్ది శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ డ్రమ్ము కూలర్ లో ఎలాంటి ఖరీదైన పరికరాలు, వస్తువులను ఆ యువకుడు ఉపయోగించలేదు. అయినప్పటికీ కంపెనీ కూలర్లను తలదన్నేలా ఇది చల్లదనాన్ని ఇస్తుండటం విశేషం.

ఎలా తయారు చేశాడంటే?

Advertisement

ముందుగా ఒక పాత డ్రమ్మును తీసుకొని ముందు వైపు ఫ్యాన్ ఫిక్స్ చేసేందుకు వీలుగా రంధ్రం చేశాడు. తర్వాత డ్రమ్ము వెనుక వైపు నుంచి గాలి బయటకు వచ్చేలా మరో రెండు పెద్ద రంధ్రం చేశాడు. అనంతరం డ్రమ్ము వెనుకవైపు రంధ్రాల్లో హనీకోంబ్ ప్యాడ్స్ ను జతచేశాడు. అంతేకాకుండా డ్రమ్ము కింది భాగాన్ని వాటర్ ట్యాంక్ లా ఉపయోగిస్తూ.. అక్కడి నుంచి నీరు హనీకోంబ్ ప్యాడ్స్ మీదకు వచ్చేలా చిన్న వాటర్ పైపును లింకప్ చేశాడు. నీటిని పంప్ చేయడంతో ఫ్యాన్ వేగంగా తిరిగేందుకు వీలుగా ఒక మోటార్ ను డ్రమ్ లోపల ఫిక్స్ చేశాడు. అనంతరం డ్రమ్ ముందు భాగంలో ఆన్ – ఆఫ్ స్విచ్, ఫ్యాన్ స్పీడ్ ను పెంచి/తగ్గించే బటన్లు సైతం ఏర్పాటు చేశాడు. వీటికి బయటివైపు నుంచి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి.. అచ్చం కంపెనీ కూలర్ పని చేసేవిధంగా తీర్చిదిద్దాడు.

Also Read: ఎండలతో అల్లాడుతున్నారా? మార్కెట్లోని జబర్దస్త్ కూలర్లు.. చలితో వణకడం పక్కా!

నెట్టింట ప్రశంసల జల్లు

Advertisement

డ్రమ్మును కూలర్ లా తీర్చిదిద్దిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి తక్కువ వనరులను ఉపయోగించి గొప్ప ఆవిష్కరణ చేశావంటూ యువకుడ్ని ప్రశంసిస్తున్నారు. మధ్యతరగతి, పేద ప్రజలకు ఇలాంటి తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలు ఎంతో మేలు చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. మరో డ్రమ్మును స్వయంగా తయారు చేసి.. ఆ వీడియోను పంచుకుంటే ఔత్సాహికులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మెుత్తం మీద ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో.. డ్రమ్ముతో కూలర్ తయారీ అనేది వినూత్న ప్రయత్నంగా చెప్పవచ్చు.

Also Read: నరరూప రాక్షసుడు.. రెండ్రోజుల్లో 2 అత్యాచారాలు, ఒక హత్య.. బాధితుల్లో IRS అధికారి కుమార్తె!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×