E-Paper
Advertisement

ఏసీ వాడకపోయినా కరెంటు బిల్లు అమాంతం పెరుగుతోందా? అసలు కారణం ఈ 6 వస్తువులే!

ఏసీ వాడకపోయినా కరెంటు బిల్లు అమాంతం పెరుగుతోందా? అసలు కారణం ఈ 6 వస్తువులే!
Advertisement

Summer Tips: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. బయట ఎండల సెగ కంటే.. నెల చివరలో వచ్చే కరెంట్ బిల్లు సెగ ఎక్కువగా ఉంటోంది. మనమంతా బిల్లు పెరగడానికి కేవలం ఏసీనే కారణం అని తిట్టుకుంటాం. కానీ, మనకు తెలియకుండానే ఇంట్లోని కొన్ని వస్తువులు సైలెంట్‌గా రీడింగ్‌ను పెంచేస్తుంటాయి. ఎండలు ముదురుతున్న కొద్దీ ఇవి సాధారణం కంటే ఎక్కువ కరెంట్‌ను లాగుతాయి. ఈ నేపథ్యంలో సమ్మర్‌లో ఏసీ వాడకపోయినా కరెంటు బిల్లును పెంచే ఆ వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకుని, జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

ఇంట్లో ఫ్రిజ్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది కదా. అయితే ఎండకాలంలో ఇది కరెంటును రెండింతలు వాడుకుంటుంది. ప్రిజ్‌లో పెట్టి పదార్థాల కోసం మనం పదే పదే తలుపులు తీస్తూ ఉంటాం. దీనివల్ల లోపలి చల్లదనం బయటకు పోయి, కంప్రెసర్ నిరంతరం పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా బిల్లు పెరుగుతుంది. అలాగే మైక్రోవేవ్ ఓవెన్లు, గ్రిల్స్ వాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి. ఇవి ఎక్కువ పవర్ తీసుకోవడమే కాకుండా వంటింటిని వేడి చేస్తాయి. ఆ వేడి వల్ల పక్కనే ఉన్న ఫ్రిజ్ చల్లబడటానికి ఇంకా ఎక్కువ కరెంట్‌ను వాడుకుంటుంది. అందుకే వంట గదిలో వేడి తగ్గించుకుంటే బిల్లు కూడా తగ్గుతుంది.

Advertisement

Also Read: ఇక ఫోన్ అస్సలు వేడెక్కదు.. లోపలే ఫ్యాన్ అమర్చిన రెడ్‌మీ, ఫీచర్లు అదుర్స్ అంతే!

చాలామంది చలికాలం అయిపోయాక కూడా గీజర్ స్విచ్ ఆపేయడం మర్చిపోతుంటారు. అది ఆటో మోడ్‌లో ఉన్నప్పుడు.. ట్యాంక్‌లోని నీరు చల్లబడిన ప్రతిసారీ దానంతట అదే వేడెక్కుతూ ఉంటుంది. వేసవిలో మనకు వేడి నీళ్లతో పని లేకపోయినా, ఇలా గీజర్ ఆన్ చేసి ఉంచడం వల్ల అనవసరంగా యూనిట్లు కాలిపోతాయి. ఇక నీటి మోటార్ల కథ ఇంకోలా ఉంటుంది. ఎండల్లో నీటి వాడకం ఎక్కువ కాబట్టి.. మోటార్ తరచూ వేయాల్సి వస్తుంది. పాత మోటార్లు లేదంటే పైపుల్లో తుప్పు ఉంటే.. ట్యాంక్ నిండటానికి గంటల సమయం పడుతుంది. దీనివల్ల కరెంట్ మీటర్ గిరగిరా తిరుగుతుంది.

Advertisement

ఏసీ లేని ఇళ్లలో కూలర్లు, ఫ్యాన్లే ఆధారం. అయితే పాతకాలపు ఇనుప రెక్కల ఫ్యాన్లు వాడటం వల్ల బిల్లు తడిసి మోపెడవుతుంది. వీటికి బదులు కొత్తగా వస్తున్న BLDC ఫ్యాన్లు వాడితే కరెంట్ బిల్లులో దాదాపు 60 శాతం ఆదా చేసుకోవచ్చు. ఇక కూలర్ల విషయానికి వస్తే.. వాటి లోపల ఉండే ప్యాడ్లు దుమ్ముతో నిండిపోయినా లేదంటే మోటార్ సరిగ్గా లేకపోయినా అవి చల్లదనాన్ని ఇవ్వవు సరే కదా, కరెంట్‌ను మాత్రం భారీగా లాగేస్తాయి. అందుకే సీజన్ మొదట్లోనే వాటిని శుభ్రం చేసుకుంటే హాయిగా ఉండటమే కాదు.. ఖర్చులు కూడా తగ్గుతాయి.

Also Read: మిడ్‌రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లు.. గేమర్స్ కోసం OnePlus Nord CE 6 వచ్చేస్తోంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×