// // Vintage Watches: మహిళల కోసం.. ఎలిగెంట్ వింటేజ్ వాచ్‌లు.. -->
E-Paper
Advertisement

Vintage Watches: మహిళల కోసం ఎలిగెంట్ వింటేజ్ వాచ్‌లు.. మీ ఫ్యాషన్‌కు సరికొత్త హుందాతనం

Vintage Watches: మహిళల కోసం ఎలిగెంట్ వింటేజ్ వాచ్‌లు.. మీ ఫ్యాషన్‌కు సరికొత్త హుందాతనం
Advertisement

Vintage Watches : నేటి ఆధునిక కాలంలో స్మార్ట్‌వాచ్‌లు, డిజిటల్ గ్యాడ్జెట్లు రాజ్యమేలుతున్నప్పటికీ.. వింటేజ్ వాచీలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇండియాలో పాతకాలపు గడియారాలను సేకరించడం అనేది ఇప్పుడు ఒక విలక్షణమైన అభిరుచిగా మారింది. పురుషులకైనా.. మహిళలకైనా వింటేజ్ వాచ్ అనేది కేవలం సమయాన్ని చూపే పరికరం మాత్రమే కాదు.. అది ఒక చరిత్ర , ఒక క్లాసిక్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్. ఇండియాలో లభించే వింటేజ్ వాచీల విశేషాలు, వాటిని కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పురుషుల కోసం వింటేజ్ వాచీలు :

పురుషుల వింటేజ్ వాచీలు సాధారణంగా వాటి మెకానికల్ మూవ్‌మెంట్ , ధృడమైన డిజైన్‌కు పేరుగాంచాయి.

Advertisement

HMT : భారతదేశపు స్వంత బ్రాండ్ HMT కి వింటేజ్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. HMTHMT జనతా, పైలట్, కోహినూర్ మోడల్స్ పురుషులలో అత్యంత ప్రజాదరణ పొందినవి. ఇవి బడ్జెట్ ధరలో లభించే అద్భుతమైన మెకానికల్ వాచీలు.

Seiko & Citizen: 70s, 80s సమయంలో.. సీకో ‘ఆటోమేటిక్’ వాచీలు , సిటిజన్ ‘బుల్‌హెడ్’ క్రోనోగ్రాఫ్‌లు నేటికీ ట్రెండ్‌లో ఉన్నాయి.

Omega & Rolex: మీరు లగ్జరీ వాచ్‌లు చూడాలనుకుంటే.. ఓమెగా సీమాస్టర్ లేదా పాత రోలెక్స్ డేట్ జస్ట్ మోడల్స్ బాగుంటాయి.

మహిళల కోసం వింటేజ్ వాచీలు:

మహిళల వింటేజ్ వాచీలు చాలా సున్నితంగా, చిన్న డయల్స్‌తో , ఆభరణాల లాగా మెరిసిపోతూ ఉంటాయి.

Titan Edge & Quartz: టైటాన్ ప్రారంభ రోజుల్లో విడుదల చేసిన స్లిమ్ వాచీలు, క్లాసిక్ గోల్డ్ ప్లేటెడ్ వాచీలు మహిళలకు చక్కటి వింటేజ్ లుక్ ఇస్తాయి.

Cocktail Watches: 1950ల నాటి చిన్న డయల్ కలిగిన ‘కాక్టెయిల్ వాచీలు’ పార్టీలు , ప్రత్యేక సందర్భాలకు అద్భుతంగా సరిపోతాయి.

Cartier & Longines: మహిళల వింటేజ్ విభాగంలో కార్టియర్ ట్యాంక్ వంటి మోడల్స్ అత్యంత క్లాసిక్, ఎలిగెంట్ ఛాయిస్.

వింటేజ్ వాచ్ కొనేటప్పుడు గమనించాల్సిన విషయాలు:

ఇండియాలో వింటేజ్ వాచీలు కొనేటప్పుడు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.

అథెంటిసిటీ : వాచ్ ఒరిజినల్ అవునా కాదా అని పరిశీలించాలి. ముఖ్యంగా డయల్, కేస్ , మూవ్‌మెంట్ మీద ఉన్న నంబర్లను చెక్ చేయండి.

రీ-పెయింటెడ్ డయల్స్: చాలా పాత వాచీలకు కొత్త రంగు వేస్తుంటారు. వీటికి ఒరిజినల్ వాచీల అంత విలువ ఉండదు.

సర్వీసింగ్: వింటేజ్ వాచీలు మెకానికల్ కాబట్టి.. వాటికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ అవసరం. విడిభాగాలు దొరుకుతాయో లేదో చూసుకోవాలి.

నమ్మకమైన బ్రాండ్: ఆన్‌లైన్ వెబ్‌సైట్ల కంటే.. పేరున్న వాచ్ రిపేర్ షాపుల్లో కొనడం ఉత్తమం.

ఎక్కడ దొరుకుతాయి:

హైదరాబాద్‌లోని లాడ్ బజార్, ముంబైలోని చోర్ బజార్ లేదా ఢిల్లీలోని పాత మార్కెట్లలో అరుదైన వింటేజ్ గడియారాలు లభిస్తాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×