// // Andhra King Taluka OTT : రామ్ మూవీ పాన్ ఇండియా ఎంట్రీ -->
E-Paper
Advertisement

Andhra King Taluka OTT : రామ్ రొమాంటిక్ మూవీ పాన్ ఇండియా ఎంట్రీ… డిజిటల్ స్ట్రీమింగ్ లో ఊహించని ట్విస్ట్

Andhra King Taluka OTT : రామ్ రొమాంటిక్ మూవీ పాన్ ఇండియా ఎంట్రీ… డిజిటల్ స్ట్రీమింగ్ లో ఊహించని ట్విస్ట్
Advertisement

Andhra King Taluka OTT : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka) ఓటీటీలో అడుగు పెట్టింది. కానీ ఈ మూవీ డిజిటల్ ఎంట్రీతో పాటు అంతకు మించిన గుడ్ న్యూస్ మరొకటి ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి.

రామ్ మూవీ పాన్ ఇండియా ఎంట్రీ

రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇటీవలే థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తే, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కన్పించారు. ఈ చిత్రానికి మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. రాజీవ్ కనకాల, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు సపోర్టింగ్ రోల్స్ పోషించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్-మెర్విన్ అందించారు.

Advertisement

నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే థియేటర్లలో ఈ మూవీ ప్రేక్షక ఆదరణను మాత్రం అంతంత మాత్రంగానే అందుకుంది. బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లు సాధించడంలో ఫెయిల్ అయ్యింది. బిగ్ స్క్రీన్ పై నిరాశ పరిచిన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో డిజిటల్ అరంగేట్రం చేసింది. అయితే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఇచ్చిన ట్విస్ట్ చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో కంటే ఓటీటీలోనే అదరగొట్టేలా కన్పిస్తోంది. ఎందుకంటే ఒరిజినల్ తెలుగు వెర్షన్‌తో పాటు, ఈ చిత్రం హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా అందుబాటులో ఉంది. కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చినట్టే.

Read Also : షార్ట్ కట్ లో కోటీశ్వరుడు కావాలనుకునే సిన్సియర్ పోలీస్ కొడుకు… క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

కథలోకి వెళ్తే…

Advertisement

స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర)ను ఫ్యాన్స్ ఆంధ్ర కింగ్ అని ఆరాధిస్తారు. కానీ అతన్ని ఒకానొక దశలో వరుస పరాజయాలు వెంటాడతాయి. ఈ ఎఫెక్ట్ కారణంగా హీరో గారి 100 వ మూవీ షూటింగ్ దశలోనే అర్ధాంతరంగా అటకెక్కుతుంది. ఆ సినిమా షూటింగ్ మళ్లీ షురూ కావలంటే 3 కోట్లు కావాలి. సూర్య ఎంతమందిని సహాయం అడిగినా ఫలితం లేకపోవడంతో, చివరికి తన ఇల్లు, కార్లు అమ్మే దారుణమైన పరిస్థితికి దిగజరుతాడు. ఈ నేపథ్యంలోనే సడన్ గా వీరాభిమాని సాగర్ పేరుతో సూర్య అకౌంట్‌ లో 3 కోట్లు పడతాయి. తనకు ముఖ పరిచయం కూడా లేని అభిమాని ఎందుకు ఇంత డబ్బు పంపాడో తెలుసుకోవడానికి హీరో సాగర్ ను వెతుక్కుంటూ బయల్దేరుతాడు. మరి ఈ సాగర్ ఎవరు ? మహాలక్ష్మితో అతని ప్రేమాయణం ఏమైంది? వీళ్ళు ఇద్దరి కోసం హీరో సూర్య ఏం చేశాడు? అన్నది స్టోరీ.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×