E-Paper
Advertisement

Fridge Smart Use In Winter: చలికాలంలో ఫ్రిడ్జ్‌ను ఇలా ఉపయోగిస్తే తక్కువ కరెంటు బిల్లు.. కూరగాయలు, ఆహారం కూడా ఫ్రెష్‌గా..

Fridge Smart Use In Winter: చలికాలంలో ఫ్రిడ్జ్‌ను ఇలా ఉపయోగిస్తే తక్కువ కరెంటు బిల్లు.. కూరగాయలు, ఆహారం కూడా ఫ్రెష్‌గా..
Advertisement

Fridge Smart Use In Winter Save Power bill | చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గిపోయి వాతావరణం చల్లగా ఉంటుంది. అందువల్ల, మీ ఫ్రిడ్జ్‌కు ఎక్కువ కూలింగ్ పవర్ అవసరం ఉండదు. కాబట్టి, ఈ సీజన్‌కు అనుగుణంగా ఫ్రిడ్జ్‌ లో సెట్టింగ్స్ మార్చాలి. ఇది చేయడం చాలా సులభం. దీని వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. కరెంట్ బిల్లు ఆదా అవుతుంది, అలాగా ఫ్రిడ్జ్‌ లో పెట్టే ఆహారం కూడా ఎక్కువ సమయం ఫ్రెఫ్ గా ఉంటుంది.

ఉష్ణోగ్రత సెట్టింగ్స్ ఇలా మార్చండి

స్పష్టంగా చెప్పాలంటే.. ఫ్రిడ్జ్‌ లో సెట్టింగ్స్ చలికాలంలో వేరుగా, వేసవిలో వేరుగా ఉంచాలి. చలికాలంలో ఉష్టోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆహారాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచితే, మీ భోజనం గడ్డకట్టుతుంది. అలా జరగకూడదంటే ఫ్రిడ్జ్‌లోని చిన్న డయల్‌ను తగ్గించండి, తద్వారా ఫ్రిడ్జ్‌ లోపలి ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. పాత మోడల్ ఉంటే, డయల్‌ను 2 లేదా 3 సెట్టింగ్‌లకు మార్చండి. కొత్త ఫ్రిడ్జ్‌లో డిజిటల్ డిస్‌ప్లే ఉంటే, 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య సెట్ చేయండి.

విద్యుత్ బిల్లు ఆదా చేయండి

Advertisement

ఈ చిన్న మార్పు కంప్రెసర్ లోడ్‌ను తగ్గిస్తుంది. ఫ్రిడ్జ్ ఎక్కువ విద్యుత్ వినియోగానికి ప్రధాన కారణం దాని కంప్రెసర్. రోజుకు తక్కువ సమయం మాత్రమే నడుస్తుంది. ఫలితంగా, తక్కువ విద్యుత్ ఉపయోగిస్తుం. దాని వల్ల నెల బిల్లు తగ్గుతుంది.

ఆహారం గడ్డకట్టకుండా నిరోధించండి

సరైన ఉష్ణోగ్రత సెట్టింగ్ ఆహారం తాజాగా ఉంచుతుంది. దాని నాణ్యతను కాపాడుతుంది. తాజా కూరగాయలు గడ్డకట్టకూడదు, పాలు, ఇతర ద్రవాలు కూడా గడ్డకట్టకూడదు. ఫ్రిడ్జ్ నుంచి నేరుగా తీసుకుని ఉపయోగించవచ్చు. గడ్డకడితే అవి తిరిగి ధ్రవం లాగా మారేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సమయం కూడా ఆదా అవుతుంది.

ఫ్రిడ్జ్‌ లోపల చెడు వాసనలు, ఆహారం చెడిపోవడం నివారించండి

Advertisement

ఫ్రిడ్జ్‌ను ఆఫ్ చేసి అన్‌ప్లగ్ చేయకూడదు. అలా చేస్తే లోపల చెడు వాసనలు పేరుకుపోతాయి. ఫ్రీజర్ ఆన్ లో లేకపోతే ఆహారం చెడిపోతుంది. బ్యాక్టీరియా నెమ్మదిగా ఫ్రిడ్జ్‌ లోపల పెరుగుతాయి. కాబట్టి, ఫ్రిడ్జ్‌ లోపల ఉష్ణోగ్రత సెట్టింగ్స్ చేయడం చాలా అవసరం.

సరైన సెట్టింగ్ పద్ధతి

ఉష్ణోగ్రత నియంత్రణ డయల్‌ను కనుగొనండి. సాధారణంగా ఫ్రిడ్జ్ లోపల ఉంటుంది. మీడియం సెట్టింగ్‌కు తిప్పండి. కొన్ని గంటల తర్వాత ఆహారాన్ని చెక్ చేయండి. అవసరమైతే చిన్న సర్దుబాట్లు చేయండి. మీ కిరాణా సామాను చల్లగా అనిపించాలి, గడ్డకట్టకూడదు.

డ్యూయల్ ప్రయోజనాలు

ఆహారం చెడిపోకుండా ఈ సెట్టింగ్స్ మార్పులో కాపాడగలరు. యుటిలిటీ, కరెంటు బిల్లులపై డబ్బు ఆదా చేస్తారు. ఇది చాలా ఈజీ, ప్రభావవంతమైన అలవాటు. మీ ఫ్రిడ్జ్‌ ను మరింత సామర్థ్యవంతం చేస్తుంది. మీ ఫ్రిడ్జ్‌ సెట్టింగ్స్ ను ఈ రోజే మార్చండి.

Also Read:  ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×