E-Paper
Advertisement

కూలర్ + ఎగ్జాస్ట్ ఫ్యాన్.. క్రేజీ కాంబినేషన్ భయ్యా.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

కూలర్ + ఎగ్జాస్ట్ ఫ్యాన్.. క్రేజీ కాంబినేషన్ భయ్యా.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!
Advertisement

Air Cooler Tips: జూన్ నెల మూడోవారంలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు.. వేసవిని తలపిస్తున్నాయి. దీంతో చాలా ఇళ్లల్లో ఎయిర్ కూలర్లు ఇప్పటికీ నాన్ స్టాప్ గా పనిచేస్తున్నాయి. అయితే చాలా మంది కూలర్ ఆన్ చేసినప్పటికీ గదిలో ఉక్కపోతగా ఉందనో లేదా కాసేపటికే జిగటగా మారిపోతుందనో అంటుంటారు. దీనికి ప్రధాన కారణం గదిలో పెరిగిపోయే తేమ శాతం. ఈ సమస్యకు ‘ఎగ్జాస్ట్ ఫ్యాన్’ (Exhaust Fan)తో చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

హ్యుమిడిటీకి చెక్.. కూలింగ్ డబుల్!

సాధారణంగా కూలర్లు నీటిని ఆవిరి చేయడం ద్వారా చల్లటి గాలిని ఇస్తాయి. అయితే గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసేస్తే.. ఆ నీటి ఆవిరి గదిలోనే పేరుకుపోయి తేమ (Humidity) విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల చల్లదనం తగ్గడమే కాకుండా ఒళ్లంతా చెమటలు పట్టి ఉక్కపోతగా అనిపిస్తుంది. ఇక్కడే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. గదిలో పేరుకుపోయిన ఈ వేడి, తేమతో కూడిన గాలిని ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయటకు నెట్టేస్తుంది. ఫలితంగా కూలర్ ఇచ్చే తాజా చల్లటి గాలి గది అంతా వేగంగా విస్తరించి ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతుంది.

అద్భుతమైన క్రాస్ వెంటిలేషన్

Advertisement

కూలర్ సమర్థవంతంగా పనిచేయాలంటే గదిలో ‘క్రాస్ వెంటిలేషన్’ తప్పనిసరి. ఒకవైపు నుంచి వచ్చే గాలి మరోవైపు నుంచి బయటకు వెళ్లడం కూలర్ కు చాలా అవసరం. కాబట్టి కూలర్‌కు ఎదురుగా ఉండే గోడకు లేదా కిటికీకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమర్చడం వల్ల గదిలో గాలి ప్రసరణ నిరంతరాయంగా జరుగుతుంది. ఇది గదిలోని వేడి గాలిని త్వరగా బయటకు పంపి.. కూలర్ పనిభారాన్ని అమాంతం తగ్గిస్తుంది. అంతేకాకుండా ఏసీ లాంటి చల్లదనాన్ని ఇస్తూ గదిని ఐస్ లా మార్చేస్తుంది.

Also Read: భూ కబ్జా ఆరోపణలు.. కోర్టులో పవన్‌కు బిగ్ రిలీఫ్.. సంచలన ఉత్తర్వులు జారీ

విద్యుత్ ఆదా.. మెరుగైన ఆరోగ్యం

Advertisement

గది త్వరగా చల్లబడటం వల్ల కూలర్‌ను ఎక్కువ సమయం హై-స్పీడ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా గదిలో తేమ ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా, బూజు పెరిగే అవకాశం ఉంటుందని.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం వల్ల గది పొడిగా మారి శ్వాసకోస సమస్యలు ఉన్నవారికి ఎంతో ఉపశమనం లభిస్తుందని వివరిస్తున్నారు. కాబట్టి, ఈసారి కూలర్ ఆన్ చేసినప్పుడు.. గదిలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా కాసేపు రన్ చేస్తే బెస్ట్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: అద్దె ఇంట్లో ఏసీలు, గీజర్లు పెట్టొచ్చా? యజమాని అనుమతి లేకుండా.. చేయగలిగే మార్పులివే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×