E-Paper
Advertisement

కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?

కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?
Advertisement

కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర వెళ్లారు. అక్క‌డి సీఎం ఫ‌డ్న‌వీస్‌నూ క‌లిశారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలింకా బ‌య‌ట‌కు రాలేదు. కానీ ఇది ఇక్క‌డ రాజ‌కీయ చ‌ర్చ‌కు తెర‌ లేపింది. సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌తీ ఇష్యూలో కిష‌న్‌రెడ్డి కాలడ్డం పెడుతున్నార‌నే తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇందులో తుమ్మిహ‌ట్టి వ‌ద్ద చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టు కూడా ఉంది. అక్క‌డ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రికి దీని ఎత్తు విష‌యంలో చ‌ర్చించాల‌ని సీఎం లేఖ రాశారు. కానీ ఇంత వ‌ర‌కు దానికి స‌మాధానం రాలేదు.

ఆ స‌మాధానం రాక‌పోవ‌డానికీ కిష‌న్‌రెడ్డే కార‌ణం అని ఆరోపించారు రేవంత్‌. వీట‌న్నింటికి ఎప్ప‌టిక‌ప్పుడు తిరిగి కౌంటర్లు ఇస్తున్నా.. కిష‌న్‌రెడ్డి మాత్రం వార్త‌ల్లో కేంద్ర‌బిందువ‌య్యారు. దీనికి కార‌ణ‌మైతే సీఎం రేవంత్‌రెడ్డే. నిజంగా అక్క‌డేం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు.. కానీ కిష‌న్‌రెడ్డే అన్నింటినీ ప‌నిగ‌ట్టుకుని మ‌రీ అడ్డుకుంటున్నార‌ని విమ‌ర్శించ‌డం మూలంగా కిష‌న్‌రెడ్డి నిత్యం చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నారు. అయితే ఇవాళ ప్ర‌త్యేకంగా ఆయ‌న మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు.

Advertisement

పారిశ్రామికాభివృద్ధి, ఉపాధిక‌ల్ప‌న‌, బొగ్గు గ‌నుల ప్రాజెక్టుల‌పైన చ‌ర్చించిన‌ట్టు వార్త‌లొచ్చాయి గానీ.. తుమ్మిడిహ‌ట్టిపై మాత్రం చ‌ర్చించిన‌ట్టు ఎక్క‌డా లీకులు రాలేదు. వార్త‌లు విడుద‌ల కాలేదు. దీనిపై మ‌ళ్లీ ర‌చ్చ కొన‌సాగేలా ఉంది. మ‌హారాష్ట్ర సీఎం నుంచి ఇక్క‌డ రేవంత్‌రెడ్డికి చ‌ర్చ‌ల కోసం క‌బురు వ‌స్తేనేగానీ వ‌దిలేలా లేరాయ‌న‌. పిలిచి చ‌ర్చించి.. మా వ‌ల్ల కాదు ఆ హైట్ పెంచుకోవ‌డానికి.. అని అంటే త‌ప్ప‌.. కిష‌న్‌రెడ్డికి దీంట్లో నుంచి మోక్షం ల‌భించేలా లేదు. వాస్త‌వానికి, 148 మీట‌ర్ల ఎత్తులో ఈ ప్రాజెక్టు నిర్మించుకునేందుకు అనుమ‌తులున్నాయి. కానీ అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్ ఇద్ద‌రూ అడుగుతున్న‌ది 152 మీట‌ర్ల ఎత్తులో క‌ట్టాల‌ని. దీని కోసం ప‌ర్మిష‌న్ కావాలంటున్నారు.

కానీ దానికి మ‌హారాష్ట్ర సీఎం ఒప్పుకోవ‌డం లేదు. ఇంత ఎత్తు పెంచితే ముంపు ప్రాంతం ఎక్కువై.. తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని, దీని పై తానే ఆందోళ‌న‌లు చేప‌ట్టిన విష‌యాన్ని కూడా గుర్తు చేస్తున్నారు బీఆరెస్ నేత‌లు. అందుకే తాము మేడిగ‌డ్డ‌కు డిజైన్లు షిప్టు చేసి కాళేశ్వ‌రం క‌ట్టిన‌ట్టుగా వారు చెప్పుకుంటున్నారు. అయితే లేటెస్టుగా క‌విత ఓ వాద‌న తెర‌మీద‌కు తెచ్చారు. 148 మీట‌ర్ల ఎత్తులో క‌ట్టినా ఏం ప్రాబ్లెం లేద‌ని, తెలంగాణకు కావాల్సిన సాగునీటికి తెచ్చుకోవ‌చ్చ‌నే ప్ర‌తిపాద‌న‌ను పెట్టారామె. వెంట‌నే తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద ప్రాజెక్టును నిర్మించే ప‌నిని మొద‌లు పెట్టాల‌ని, సీఎం రేవంత్‌కు దీనిపై చిత్త‌శుద్ది లేకే కాల‌యాప‌న చేస్తున్నార‌ని, డిఫెన్స్‌లో ప‌డేసే కొత్త వ్యూహాన్ని ఆమె అందుకున్నారు.

Advertisement

ఇవాళ కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర‌కు వెళ్ల‌డం కూడా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చుకునేలా ఏదైనా స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌స్తేగానీ.. కిష‌న్‌రెడ్డి మీద మోప‌బ‌డిన కాళ్ల‌డ్డం పెట్టే ఆరోప‌ణ‌ల్లో ఒక‌టి త‌గ్గ‌ద‌నే చ‌ర్చ న‌డుస్తున్న‌ది.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×