E-Paper
Advertisement

Ultrahuman Ring Pro: ఈ రింగ్ వేలికి పెట్టుకుంటే చాలు.. మీ బాడీలో ఏం జరుగుతుందో చిటికెలో చెప్పేస్తుంది!

Ultrahuman Ring Pro: ఈ రింగ్ వేలికి పెట్టుకుంటే చాలు.. మీ బాడీలో ఏం జరుగుతుందో చిటికెలో చెప్పేస్తుంది!
Advertisement

Ultrahuman Ring Pro: అల్ట్రాహ్యూమన్ సంస్థ తన మూడవ తరం స్మార్ట్ రింగ్‌ను Ring Pro పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీనితో పాటు Jade అనే సరికొత్త రియల్ టైమ్ బయోఇంటెలిజెన్స్ ఏఐని కూడా పరిచయం చేయడం విశేషం. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ స్మార్ట్ రింగ్ ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. అమెరికా మినహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇది అందుబాటులో ఉంటుంది. అయితే, జేడ్ ఏఐ సేవలను మాత్రం అమెరికాలోని వినియోగదారులతో సహా అందరూ వాడుకోవచ్చు.

Ring Pro ప్రత్యేకతలు:

ఈ కొత్త రింగ్ ప్రో మునుపటి మోడల్స్ కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 15 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. అంతేకాదే.. దీనిలో 250 రోజుల వరకు హెల్త్ డేటాను భద్రపరిచుకునే స్టోరేజ్ సామర్థ్యం ఉంది. టైటానియం యూనిబాడీ డిజైన్‌తో తయారైన ఈ రింగ్ బయోనిక్ గోల్డ్, స్పేస్ సిల్వర్, ఆస్టర్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. శరీరంలో వాపులు వచ్చినప్పుడు లేదా గాయాలైనప్పుడు రింగ్‌ను సులభంగా తొలగించేలా ఇందులో ప్రో రిలీజ్ టెక్నాలజీని కూడా చేర్చారు.

Advertisement

Also Read: ట్రిపుల్ రియర్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో నథింగ్ ఫోన్.. డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

అధునాతన సెన్సార్లు:

నిద్రలో లేదా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె స్పందన రేటును అత్యంత కచ్చితత్వంతో కొలిచేలా దీని సెన్సార్లను రీ డిజైన్ చేశారు. డేటాను వేగంగా ప్రాసెస్ చేయడానికి డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి తోడు ప్రో ఛార్జింగ్ కేస్ ద్వారా 45 రోజుల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. ఈ కేస్‌ను వెతకడానికి ప్రాక్సిమిటీ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది.

ఎప్పటికప్పుడు హెల్త్ ట్రాకింగ్:

Advertisement

అల్ట్రాహ్యూమన్ ప్రవేశపెట్టిన జేడ్ ఏఐ ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశ్లేషిస్తుంది. రక్తంలోని బయోమార్కర్లు, గ్లూకోజ్ స్థాయిలు, పరిసరాల ప్రభావం వంటి అంశాలను క్రోడీకరించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంది. దీనిలో డీప్ రీసెర్చ్ మోడ్ ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు. అలాగే హార్ట్ బీట్‌లో మార్పులు, శ్వాసకోస సమస్యలు, ఇతర ఆరోగ్య అంశాలను పర్యవేక్షించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ధర ఎంతంటే?

అల్ట్రాహ్యూమన్ తీసుకొచ్చిన ఈ రింగ్ ప్రో ధర సుమారు రూ.44,000 లోపు నిర్ణయించారు. ఇది మార్చి నెల నుండి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఒకవేళ మీరు పాత స్మార్ట్ రింగ్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకోవాలి అనుకుంటే.. ప్రత్యేక తగ్గింపులు కూడా లభిస్తాయి.

Also Read: లక్ష రూపాయల ఫోన్ సగం ధరకే.. మోటోరోలా రేజర్ 60 అల్ట్రాపై కళ్లుచెదిరే ఆఫర్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×