E-Paper
Advertisement

Bengaluru: దారుణం.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్

Bengaluru: దారుణం.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్
Advertisement

Bengaluru: ఛీ.. ఛీ.. దారుణం.. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు.. ప్రభుత్వం ఎన్ని శిక్షలు విధించిన మారని మృగాలు.. బెంగళూరు నగరంలో వెలుగుచూసిన ఈ సామూహిక అత్యాచార ఘటన సభ్య సమాజాన్ని ఛీత్కరించుకునేలా చేస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 19 మంది యువతులపై క్రూరంగా అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కొందరు కిరాతకులు, పక్కా ప్రణాళికతో అమాయక యువతులను తమ వలలో వేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ వార్త బయటకు రావడంతో ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడు నిఖిల్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితులు యువతులతో ముందుగా స్నేహం చేసి, వారిని విలాసవంతమైన పార్టీలకు ఆహ్వానించేవారు. ఆ పార్టీలలో యువతులకు తెలియకుండానే వారు తాగే పానీయాల్లో లేదా ఆహారంలో మత్తు మందు (Drugs) కలిపేవారు. యువతులు స్పృహ కోల్పోయిన తర్వాత, వారిపై నిందితులు విచక్షణారహితంగా సామూహిక అత్యాచారానికి పాల్పడేవారని విచారణలో తేలింది.

Advertisement

కేవలం అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, నిందితులు ఆ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలను చూపించి బాధితులను భయభ్రాంతులకు గురిచేసేవారు. ఎవరికైనా చెబితే ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ, వారిని పదేపదే లోబరుచుకునేవారు. అవమాన భారం, ప్రాణభయంతో చాలా కాలం పాటు బాధితులు ఈ విషయాన్ని బయటకు చెప్పలేకపోయారు.

అయితే, ధైర్యం చేసిన ఒక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మొత్తం నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు నిఖిల్‌తో పాటు మరో నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Also Read: నిరుద్యోగి అయినా, తక్కువ ఆదాయం ఉన్నా భరణం తప్పదు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ప్రస్తుతం ఈ కేసుపై సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) నిశితంగా దర్యాప్తు చేస్తోంది. నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? ఈ ముఠా వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే కోణంలో విచారణ సాగుతోంది. మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు హామీ ఇస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×