E-Paper
Advertisement

కదిలే ‘వాషింగ్ మిషన్’.. చేత్తో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. 7 నిమిషాల్లో బట్టలు వాష్!

కదిలే ‘వాషింగ్ మిషన్’.. చేత్తో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. 7 నిమిషాల్లో బట్టలు వాష్!
Advertisement

Portable Washing Machine: సాధారణంగా వాషింగ్ మిషన్లు.. 20-30 కేజీల బరువుతో ఎక్కడికి కదల్చలేని స్థితిలో ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ ఒక చోటు నుంచి మరో చోటుకి తెలిగ్గా తీసుకెళ్లగలిగే కదిలే వాషింగ్ మిషన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఉదితి బ్రాండ్ 9 కేజీల బరువుతో ఈ పోర్టబుల్ వాషింగ్ మిషన్ (Uditi Portable Washing Machine)ను లాంచ్ చేసింది. వేసవిలో విహారాలకు వెళ్లేవారికి ఈ వాషింగ్ మిషన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అలాగే బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాయి. ఇంతకీ పోర్టబుల్ వాషింగ్ మిషన్ ధర ఎంత? ప్రధాన ఫీచర్లు ఏంటి? ఈ కథనంలో చూద్దాం.

10 షర్టులు, 5 ప్యాంట్లు

ఉదితి పోర్టబుల్ వాషింగ్ మిషన్.. 9 కేజీల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకేసారి 10 షర్టులు, 5 ప్యాంట్లు లేదా బెడ్‌షీట్లు దీనిలో వేసి వాష్ చేయవచ్చు. చిన్న కుటుంబాలు, బ్యాచిలర్స్, ట్రావెలర్స్ కు ఈ వాషింగ్ మిషన్ ఎంతో లాభదాయకంగా ఉండనుంది.

7 నిమిషాల్లో క్లీనింగ్..

Advertisement

ఈ వాషింగ్ మిషన్ కేవలం 7 నుండి 10 నిమిషాల వ్యవధిలోనే బట్టలను వేగంగా, శుభ్రంగా ఉతికేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనివల్ల సమయం చాలా వరకూ ఆదా అవుతుందని పేర్కొన్నాయి.

తక్కువ విద్యుత్ వినియోగం

ఈ పోర్టబుల్ వాషింగ్ మిషన్.. కేవలం 175 వాట్ల విద్యుత్ శక్తితో పనిచేస్తుంది. ఫలితంగా విద్యుత్ బిల్లు చాలా పరిమితంగానే వినియోగిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి పెద్ద వాషింగ్ మిషన్లతో పోలిస్తే పవర్ బిల్లు చాలా వరకూ ఆదా చేయవచ్చని పేర్కొంటున్నాయి.

12 కేజీల బరువు..

Advertisement

ఈ పోర్టబుల్ వాషింగ్ మిషన్.. 12 కేజీల బరువును కలిగి ఉంది. కాబట్టి ఇంట్లో ఒక గది నుంచి మరో గదికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. అలాగే ఇల్లు మారేటప్పుడు, ప్రయాణాల్లో కూడా దీన్ని సులువుగా తీసుకెళ్లవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

మన్నికైన బాడీ

ఈ మిషన్ ను నాణ్యమైన ప్లాస్టిక్ మెటీరియల్‌తో రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫలితంగా నీళ్లు పడితే తుప్పు పడుతుందన్న భయం ఉండదు. అయితే ఈ వాషింగ్ మిషన్ కేవలం బట్టలు ఉతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో డ్రైయర్ సౌకర్యం లేకపోవడం గమనార్హం.

Also Read: జియో సరికొత్త ప్లాన్.. రూ.200కే 15 ఓటీటీలు.. 1000 టీవీ ఛానెల్స్ ఫ్రీ!

ధర ఎంతంటే?

దీని అసలు ధర రూ.6,599 కాగా.. టూల్స్ విల్లా (Tools Villa) ఈ-కామర్స్ సైట్ లో 13 శాతం డిస్కౌంట్ తో ఇది అందుబాటులో ఉంది. ఫలితంగా రూ.5,749కే ఈ కదిలే వాషింగ్ మిషన్ ను దక్కించుకోవచ్చు.

Also Read: ఇంట్లోనే వర్షం.. బెడ్‌రూమ్ పక్కనే వెన్నెల.. మన తాతల నాటి ‘ఏసీ ఇల్లు’!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×