E-Paper
Advertisement

Superfast Video AI: ఏఐ వీడియోలు క్షణాల్లో చేసేయండి.. కళ్లు మూసి తెరిచేలోపల రెడీ.. కొత్త టెక్నాలజీ గురూ

Superfast Video AI: ఏఐ వీడియోలు క్షణాల్లో చేసేయండి.. కళ్లు మూసి తెరిచేలోపల రెడీ.. కొత్త టెక్నాలజీ గురూ
Advertisement

Superfast Video Generating AI| డిజిటల్ కంటెంట్ సృష్టించే విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటికే వీడియోలు తయారు చేయడానికి చాలా ఏఐ బాట్‌లున్నాయి. కానీ వాటికంటే ఎన్నో రెట్లు వేగంగా వీడియోలు జెనెరెట్ చేసేందుకు ఇప్పుడు టర్బో డిఫూజన్ (TurboDiffusion) అనే కొత్త AI టెక్నాలజీ వచ్చింది. ఇది వీడియోలను రెప్పపాటులో తయారు చేస్తుంది. సెకన్లలోనే రియలిస్టిక్ వీడియోలు జనరేట్ చేయగలదు.

సాధారణ AI వీడియో టూల్స్ చాలా సమయం తీసుకుంటాయి. కానీ టర్బో డిఫూజన్ ఆ వేచి ఉండే సమయాన్ని భారీగా తగ్గిస్తుంది. భవిష్యత్తులో AI వీడియో సృష్టికి ఇది కొత్త దిశను చూపిస్తుంది. క్రియేటర్లు వేగంగా కంటెంట్ తయారు చేయగలరు.

TurboDiffusion అంటే ఏమిటి?

Advertisement

టర్బో డిఫూజన్ అనేది సింథటిక్ వీడియోలను వేగంగా జనరేట్ చేసే అడ్వాన్స్‌డ్ AI సిస్టమ్. స్పీడ్ పెంచడంతో పాటు వీడియో క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తుంది. దీన్ని అభివృద్ధి చేసిన పరిశోధకుల ప్రకారం ఇది సాధారణ AI విధానాల కంటే 200 రెట్లు వేగంగా పనిచేస్తుంది. వేగం పెరిగినా వీడియోలు రియలిస్టిక్‌గా, డీటెయిల్డ్‌గా ఉంటాయి. దీంతో AI వీడియో టూల్స్‌ను ఎక్కువ మంది ఉపయోగించే అవకాశం పెరుగుతుంది.

అభివృద్ధి చేసిన గ్లోబల్ రీసెర్చ్ టీమ్

ఈ టెక్నాలజీని గ్లోబల్ రీసెర్చ్ టీమ్ అభివృద్ధి చేసింది. షెంగ్షు టెక్నాలజీ, సింగ్హువా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. వీడియో జనరేషన్‌లో ఎక్కువ సమయం తీసుకునే సమస్యను పరిష్కరించడమే ఈ పరిశోధన లక్ష్యం. కంప్యూటింగ్ టైమ్ తగ్గించడంతో వీడియోలు త్వరగా వస్తాయి.

అత్యం వేగంగా వీడియో జనరేషన్

Advertisement

సాధారణ కన్స్యూమర్ PCలో టెస్ట్ చేశారు. 5 సెకన్ల స్టాండర్డ్ డెఫినిషన్ వీడియోను 1.9 సెకన్లలో జనరేట్ చేసింది. హై-డెఫినిషన్ వీడియో క్లిప్‌ను 24 సెకన్లలో తయారు చేసింది. సాధారణ AI సిస్టమ్స్‌కు అదే హై-డెఫినిషన్ వీడియో జెనెరేట్ చేయడానికి 80 నిమిషాలు పడుతుంది. అంటే TurboDiffusion దాదాపు 200 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇది కంప్యూటింగ్ కాస్ట్, రిసోర్సెస్ తగ్గిస్తుంది. క్వాలిటీ తగ్గకుండా యానిమేషన్స్, వీడియోలు తయారు చేయవచ్చు.

కంటెంట్ క్రియేటర్లకు బెనిఫిట్స్

వేగవంతమైన వీడియో జనరేషన్ చాలా ఇండస్ట్రీలకు ఉపయోగపడుతుంది. కంటెంట్ క్రియేటర్లు త్వరగా వీడియోలు తయారు చేయగలరు. ఫిల్మ్ ఎడిటర్లు, యానిమేటర్లు, మార్కెటర్లు ఇందులో లాభపడతారు. గేమింగ్, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలకు కూడా ఉపయోగకరం. రీసెర్చర్లు క్రియేటివ్ ఐడియాలను త్వరగా టెస్ట్ చేయవచ్చు.

వీడియో జెనెరేషన్‌లో సవాళ్లు, ఎథికల్ సమస్యలు

ఏఐ టెక్నాలజీ అవకాశాలు ఇస్తున్నప్పటికీ దీంతో సమస్యలు కూడా ఉన్నాయి. AI జనరేటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో సమస్యలు సృష్టిస్తున్నాయి. డీప్‌ఫేక్ వీడియోలు పెరిగే అవకాశం ఉంది. ఇవి ఇమేజెస్, వాయిస్‌ను రియలిస్టిక్‌గా మార్చగలవు. దీంతో తప్పుడు సమాచారం, డిజిటల్ మానిప్యులేషన్ పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు బలమైన సేఫ్‌గార్డ్స్ తీసుకోవాలి. బాధ్యతాయుత అభివృద్ధి చాలా ముఖ్యం.

Also Read: హోటల్ రూమ్‌లలో రహస్య కెమెరాలు.. ఎక్కడ దాచి పెట్టారో సులభంగా పసిగట్టండిలా

భవిష్యత్తులో AI వీడియో టెక్నాలజీ

AI వీడియో టూల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి కొత్త అభివృద్ధి స్పీడ్, రియలిజం, యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తుంది. TurboDiffusion ఈ రంగంలో ఓ పెద్ద అడుగు. భవిష్యత్తులో హై-క్వాలిటీ వీడియోలు సెకన్లలో వస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ క్రియేషన్‌ మార్చేస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×