// // Try And Use Smartphone| ముందు ఉపయోగించండి ఆ తరువాతే కొనండి.. ఇండియన్ స్మార్‌ఫోన్ కంపెనీ వింత ఆఫర్ -->
E-Paper
Advertisement

Try And Use Smartphone: ముందు ఉపయోగించండి ఆ తరువాతే కొనండి.. ఇండియన్ స్మార్‌ఫోన్ కంపెనీ వింత ఆఫర్

Try And Use Smartphone: ముందు ఉపయోగించండి ఆ తరువాతే కొనండి.. ఇండియన్ స్మార్‌ఫోన్ కంపెనీ వింత ఆఫర్
Advertisement

Try And Use Smartphone| భారతీయ మొబైల్ బ్రాండ్ లావా కొత్తగా ఒక వింత ఆఫర్ ప్రకటించింది. దీని పేరు డెమో@హోమ్ (Demo@HOme). ఇది ఒక సర్వీస్ ఆఫర్ అయినప్పటికీ.. బ్రాండ్ ప్రొమోషన్ లో కూడా ఒక భాగంగా కనిపిస్తోంది. ఈ సర్వీస్‌లో మీరు కొనుగోలు చేయడానికి ముందే లావా అగ్ని 4 ఫోన్‌ను మీ ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు. లావా టీమ్ ఫోన్‌ను మీ ఇంటికి డెలివరీ చేస్తుంది.

మీరు ఫోన్ డిజైన్, ఫీచర్లు అన్నీ స్వేచ్ఛగా, తీరికగా చూసుకోవచ్చు, టెస్ట్ చేయవచ్చు. కొనాలనిపిస్తే కొనండి, లేకపోతే ఎలాంటి బాధ్యత లేదు. ఇలా చేయడం వల్ల ఫోన్ కొనుగోలు చేశాక లేదా చేసేటప్పుడు వచ్చే సందేహాలు తొలగిపోతాయి.

Advertisement

ఈ డెమో@హోమ్ క్యాంపెయిన్ కేవలం బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లోనే ప్రస్తుతానికి అందుబాటులో ఉంటుంది. డెమో పీరియడ్ నవంబర్ 20 నుంచి 24 వరకు మాత్రమే. ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం. మీరు నవంబర్ 20లోపు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. లావా కంపెనీ ఎంపిక చేసిన వారిని నేరుగా సంప్రదిస్తుంది.

డిస్‌ప్లే

లావా అగ్ని 4 ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో సూపర్ క్లియర్ పిక్చర్ ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్ చూస్తేనే అదిరిపోతుంది!

ప్రాసెసర్

Advertisement

పనితనంలో ఈ ఫోన్ సూపర్ ఫాస్ట్. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ వల్ల అన్నీ త్వరగా ఓపెన్ అవుతాయి. వేగంగా రన్ అవుతాయి. ఎక్కువ యాప్స్ తో ఒకేసారి మల్టీటాస్కింగ్ చేసినా హ్యాంగ్ అయ్యే సమస్య ఉండదు. పైగా తక్కువ ఈ ధరలో ఇంత పవర్‌ఫుల్ ఫీచర్స్ రావడం సూపర్!

కెమెరా

కెమెరా విషయంలో వెనుకవైపు డ్యూయల్ కెమెరా – 50 మెగాపిక్సల్ మెయిన్ + 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్. ముందు సెల్ఫీ కోసం 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫోటోలు, వీడియోలు చాలా క్లియర్‌గా వస్తాయి.

బ్యాటరీ, ఛార్జింగ్

బ్యాటరీ 5000mAh ఉంది, ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులువుగా పనిచేస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Wi-Fi 6E, USB 3.0 వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

ధర

ఈ ఫోన్ ధర సుమారు రూ.30,000 ఉండవచ్చని అంచనా. ఈ ధరలో ప్రీమియం ఫీల్, హై ఎండ్ ఫీచర్లు ఇవ్వడం వల్ల ఇతర పెద్ద బ్రాండ్లతో పోటీ పడుతుంది.

రిజిస్టర్ ఎలా చేసుకోవాలి?

ఈ ఆఫర్ కోసం రిజిస్టర్ చేసుకోవాలంటే www.lava.co.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘రిజిస్టర్ యువర్ ఇంట్రెస్ట్’ లింక్ క్లిక్ చేయండి. మీ పేరు, సిటీ, మొబైల్ నంబర్ వంటి సాధారణ వివరాలు ఇవ్వండి. ఎంపిక అయితే కంపెనీ నుంచి ఈమెయిల్ వస్తుంది.

ఈ క్యాంపెయిన్‌తో కస్టమర్లకు లావా తన బ్రాండ్ పట్ల నమ్మకం కలిగిస్తోంది. కొనడానికి ముందే ఫోన్ టెస్ట్ చేయడం వల్ల యూజర్ల సందేహాలు తీరిపోతాయి. కంపెనీకి కూడా మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంది. ఇరు పక్షాలకు లాభమే! అందుకే ఇలాంటి పారదర్శకమైన ఆఫర్లు భవిష్యత్తులో లావాను మరింత పాపులర్ చేస్తాయి.

Also Read: హెడ్‌ఫోన్స్‌లో సమస్య వస్తే ఫ్రిజ్‌లో పెట్టండి.. వైరల్ అవుతున్న వింత ట్రెండ్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×