E-Paper
Advertisement

ట్రాయ్ గుడ్ న్యూస్.. త్వరలో వాయిస్ ఓన్లీ ప్లాన్స్.. మెుబైల్ యూజర్లకు పండుగే!

ట్రాయ్ గుడ్ న్యూస్.. త్వరలో వాయిస్ ఓన్లీ ప్లాన్స్.. మెుబైల్ యూజర్లకు పండుగే!
Advertisement

TRAI Proposal: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా డేటా అవసరం లేని వారికి తీపి కబురు అందించింది. ఒకప్పటిలా కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలతో కూడిన చౌకైన రీఛార్జ్ ప్లాన్లను తిరిగి ప్రవేశపెట్టాలను టెలికాం రంగ సంస్థలకు ట్రాయ్ ప్రతిపాదించింది. మే తర్వాత నుంచి ఈ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు టెలికాం వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్రాయ్ కీలక సిఫారసు..!

ప్రస్తుతం చాలా వరకూ రీఛార్జ్ ప్లాన్లు డేటాతో కలిపి వస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడని వారు కూడా అదనపు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీన్ని మారుస్తూ ట్రాయ్ కొత్త నిబంధనలను సిద్ధం చేసింది. టెలికాం కంపెనీలు (Jio, Airtel, Vi) డేటాతో కూడిన ఏ వ్యాలిడిటీ ప్లాన్ ఆఫర్ చేసినా.. దానికి సమానమైన వ్యాలిడిటీతో డేటా లేని వాయిస్ మాత్రమే ఉండే ప్లాన్‌ను కూడా తప్పనిసరిగా అందించాలని ట్రాయ్ సిఫారసు చేసింది.

ఎవరికి లాభమంటే?

Advertisement

ట్రాయ్ ప్రతిపాదించినట్లుగా ఈ ప్లాన్స్ లో డేటా ఉండదు కాబట్టి.. ప్రస్తుత ప్లాన్స్ కంటే తక్కువ ధరకే అవి అందుబాటులోకి రావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాయ్ చేసిన తాజా ప్రతిపాదన వల్ల.. కీపాడ్ మెుబైల్ వాడే వృద్ధులు, ఇంటర్నెట్ అవసరం లేని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువ మేలు జరగనుంది. సెకండరీ సిమ్ యూజర్లు సైతం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ ద్వారా లబ్ది పొందనున్నారు. అలాగే ఇంట్లో, ఆఫీసులో వై-ఫై సేవలు అందుబాటులో ఉన్నవారికి సైతం ట్రాయ్ ప్రతిపాదనలు ప్రయోజనం చేకూర్చనున్నాయి.

Also Read: కుక్కర్ వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయెుద్దు.. లేదంటే బ్లాస్ట్ అయిపోద్ది!

టెలికాం కంపెనీలకు ఇబ్బందే!

Advertisement

ట్రాయ్ తాజా ప్రతిపాదన.. ఎయిర్ టెల్, జియో, వీఐ వంటి ప్రముఖ టెలికాం సంస్థలను ఇబ్బంది పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టెలికాం సంస్థలు.. డేటా ఆధారంగా మెజారిటీ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. గత కొన్నేళ్లుగా వాటినే యూజర్లు సైతం రీఛార్జ్ చేసుకుంటూ వస్తున్నారు. డేటా అవసరం ఉన్నా లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని చాలా మంది యూజర్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఎక్స్ క్లూజివ్ గా కాల్స్ కోసం ప్రత్యేక ప్లాన్స్ తీసుకొస్తే.. డేటా ప్లాన్స్ కు డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉందని టెలికాం కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

Also Read: బుల్లి స్మార్ట్ స్క్రీన్.. వార్తలు, వీడియో కాల్స్, ఓటీటీలు.. క్రేజీ బెన్‌ఫిట్స్ భయ్యా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×