E-Paper
Advertisement

Pocket Power Banks: మీ జేబులో సరిపోయే పవర్ బ్యాంక్స్.. చిన్న సైజులో బెస్ట్ ఇవే

Pocket Power Banks: మీ జేబులో సరిపోయే పవర్ బ్యాంక్స్.. చిన్న సైజులో బెస్ట్ ఇవే
Advertisement

Pocket Size Power Banks| పరుగులు తీసే ఈ జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక నిత్యావసరంగా మారిపోయింది. అలాంటిది ఫోన్ ఛార్జ్ చేయడం మర్చిపోయినా.. లేక ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఒక్కసారిగా తగ్గిపోయినా.. కాల్స్, పేమెంట్స్, నావిగేషన్ అంతా ఆగిపోతాయి. చిన్న, పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్ తీసుకెళ్తే ఈ సమస్యలు తప్పుతాయి. ఎక్కువ పవర్ కెపాసిటీ ఉన్నా ఇవి పాకెట్‌లో సులభంగా పెట్టుకునేలా చిన్న సైజులో సౌకర్యవంతంగా ఉంటాయి.

GoBoult 20000 mAh పవర్ బ్యాంక్

ఈ పవర్ బ్యాంక్ కెపాసిటీ 20,000mAh. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్లు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్లు త్వరగా ఛార్జ్ అవుతాయి. మల్టిపుల్ పోర్టులు ఉన్నాయి. LED డిస్‌ప్లేలో బ్యాటరీ పర్సెంటేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్ ఉపయోగంలో కెపాసిటీ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ప్లాస్టిక్ బిల్డ్ సాధారణంగా ఉంటుంది.

Ambrane 10000 mAh మినీ పవర్ బ్యాంక్

Advertisement

చిన్నగా, తేలికగా ఉండే ఈ మోడల్ పోర్టబిలిటీకి బెస్ట్. 10,000mAh కెపాసిటీ, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. USB Type-C, USB-A పోర్టులు ఉన్నాయి. ఎక్కడైనా తీసుకెళ్లడానికి సులభం. కానీ దీర్థకాలం ఉపయోగంలో కొంచెం వేడెక్కుతుంది. కంపెనీ చెప్పే చేసిన కెపాసిటీ కంటే వినియోగ సమయంలో తక్కువ అనిపిస్తుంది.

Portronics Luxcell B 10K పవర్ బ్యాంక్

స్లిమ్, స్టైలిష్ డిజైన్‌తో వచ్చే పవర్ బ్యాంక్ కెపాసిటీ 10,000mAh, 22.5W ఛార్జింగ్ స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. రెండు డివైస్‌లు ఒకేసారి ఛార్జ్ చేయవచ్చు. LED ఇండికేటర్ బ్యాటరీ స్టేటస్ చూపిస్తుంది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో వేడెక్కుతుంది. బిల్డ్ క్వాలిటీ ధరకు సరిపడా ఉంటుంది.

URBN 20000 mAh పవర్ బ్యాంక్

Advertisement

22.5W పవర్ డెలివరీ సపోర్ట్‌తో వస్తుంది. మూడు డివైస్‌లు ఒకేసారి ఛార్జ్ చేయవచ్చు. డ్యూయల్ Type-C, USB-A పోర్టులు ఉన్నాయి. స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కానీ వేడెక్కుతుంది, రియల్ కెపాసిటీ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. LED ఇండికేటర్ కొన్నిసార్లు సరిగా పనిచేయదు.

Ambrane MagSafe వైర్‌లెస్ పవర్ బ్యాంక్

10,000mAh కెపాసిటీతో వచ్చే ఈ మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15W వైర్‌లెస్, 22.5W వైర్డ్ ఛార్జింగ్ ఉంది. iPhoneలు, Qi సపోర్ట్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు బాగుంటుంది. చిన్న సైజు, ట్రావెల్‌కు సరిపోతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ వైర్డ్ కంటే నెమ్మదిగా ఉంటుంది. ఎక్కువ ఉపయోగంలో వేడెక్కుతుంది.

boAt 20000 mAh పవర్ బ్యాంక్

పెద్ద కెపాసిటీ, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. మల్టిపుల్ పోర్టులతో ఎక్కువ డివైస్‌లు ఛార్జ్ చేయవచ్చు. స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కానీ పాకెట్‌కు కొంచెం బరువుగా అనిపిస్తుంది. మల్టిపుల్ పోర్టులు ఉపయోగిస్తే స్పీడ్ కొంచెం తగ్గుతుంది.

Also Read: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

పవర్ బ్యాంక్ కొనేముందు ఏమి చూడాలి?

రోజువారీ ఉపయోగానికి 10,000mAh సరిపోతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి, ఎక్కువ డివైస్‌లు ఛార్జ్ 20,000mAh మంచిది. 22.5W లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి. USB-C, USB-A పోర్టులు ఉండాలి. చిన్న సైజు, తేలికగా ఉండాలి. సేఫ్టీ ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ చూడాలి.

చిన్న పవర్ బ్యాంక్‌లు రోజువారీ జీవితంలో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ట్రావెల్, ఆఫీస్, బయట ఎక్కడైనా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్, అవసరాలు బట్టి సరైన మోడల్ ఎంచుకోండి. GoBoult, Ambrane, URBN, boAt వంటి బ్రాండ్లు మంచి ఆప్షన్లు ఇస్తున్నాయి.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×