E-Paper
Advertisement

Top 5 Headphones: థియేటర్ ఫీల్ కలిగించే 5 అద్భుతమైన హెడ్ ఫోన్స్.. వీటి ధర ఎంతో తెలుసా?

Top 5 Headphones: థియేటర్ ఫీల్ కలిగించే 5 అద్భుతమైన హెడ్ ఫోన్స్.. వీటి ధర ఎంతో తెలుసా?
Advertisement

Top 5 Headphones: నేటి ఆధునిక యుగంలో అభిమాన హీరో సినిమా చూడాలంటే కచ్చితంగా థియేటర్‌కే వెళ్లాలా ఏంటి? ఆ రోజులు ఎప్పుడో మారిపోయాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంట్లో పెద్ద టీవీ ఉంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమాలన్నీ మనింట్లోనే సోఫాలో కూర్చుని హాయిగా చూసేయొచ్చు. కానీ, సినిమా హాల్‌ ఫీల్ రావాలంటే మాత్రం కొన్ని గ్యాడ్జెట్స్ ఉండాల్సిందే.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్‌తో మీ గదినే ఓ మినీ థియేటర్‌గా మార్చేయొచ్చు. పక్కన వాళ్లకి ఇబ్బంది కలగకుండా, మీకు మాత్రం సినిమాటిక్ ఫీల్ ఇచ్చే టాప్-5 హెడ్‌ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2026లో ట్రెండ్ అవుతున్న ఈ హెడ్‌ఫోన్స్.. సినిమా చూసే అనుభూతిని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తాయి.

1) Sony WH-1000XM6

Advertisement

ఈ హెడ్‌ఫోన్స్‌లో ఉండే 360 రియాలిటీ ఆడియో ఫీచర్ వల్ల ఆడియో అన్ని వైపుల నుండి వస్తున్నట్లు అనిపిస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ విషయంలో దీనికి తిరుగులేదనే చెప్పాలి. బయట ఎంత శబ్దం ఉన్నా మనకు వినిపించదు. అలాగే దీనిలో 30 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది కాబట్టి.. హాయిగా వీకెండ్ మొత్తం సినిమాలు చూసేయొచ్చు. ఈ గ్యాడ్జెట్ ధర సుమారు రూ.39,990.

Also Read: వీడెవడండి బాబు.. ఇంట్లో కూర్చొని 7వేల రోబోట్ వాక్యూమ్ క్లీనర్లను హ్యాక్ చేసేశాడు, ఎలాగంటే?

2) Bose QC Ultra (2nd Gen)

Advertisement

బోస్ హెడ్‌ఫోన్స్‌లో కొత్తగా వచ్చిన ఇమ్మర్సివ్ మోడ్ వల్ల సౌండ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. అంటే.. హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా కూడా ముందు స్పీకర్లు పెట్టి వింటున్న ఫీలింగ్ కలుగుతుంది. దీని ధర రూ.26,990 నుంచి ప్రారంభమౌతుంది.

3) Sennheiser Momentum 4

ఆడియో క్లారిటీగా వినాలనుకుంటున్న వారికి ఈ హెడ్‌ఫోన్స్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా డైలాగులు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. దీని ప్లస్ పాయింట్ ఏమిటంటే.. 60 గంటల బ్యాటరీ లైఫ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు కంటిన్యూగా. జర్మన్ టెక్నాలజీతో వచ్చే ఈ మోడల్ ధర రూ.24,990.

4) Sonos Ace

మీ ఇంట్లో ఇప్పటికే సోనోస్ సౌండ్‌బార్ ఉంటే.. ఇది మీకు సరైన ఎంపిక. టీవీలో వస్తున్న సౌండ్‌ను ఒక్క క్లిక్‌తో హెడ్‌ఫోన్స్‌లోకి మార్చుకోవచ్చు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ వల్ల సినిమాటిక్ ఫీల్ గ్యారెంటీ. దీని ధర రూ.24,499 వరకు ఉంటుంది.

5) Apple AirPods Max

మీరు ఐఫోన్ లేదా యాపిల్ టీవీ వాడుతుంటే.. కళ్లు మూసుకుని ఈ హెడ్‌ఫోన్స్ కొనేయొచ్చు. దీనిలోని డైనమిక్ హెడ్ ట్రాకింగ్ అద్భుతమనే చెప్పాలి. తల తిప్పినా సౌండ్ మాత్రం స్క్రీన్ దగ్గర నుండే వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది కొంచెం ప్రీమియం రేంజ్ కాబట్టి.. దీని ధర రూ.59,900 ఉంటుంది.

Also Read: ఏసీ ఉన్న గదిలోనే ఫ్రిడ్జ్‌ను పెడుతున్నారా? మీ జేబుకి చిల్లు పడటం ఖాయం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×