E-Paper
Advertisement

Lake Development: రంగంలోకి హైడ్రా బాస్.. చెరువుల ఆక్రమణదారులు ఖల్లాస్! రంగనాథ్ మాస్టర్ ప్లాన్ ఇదే!

Lake Development: రంగంలోకి హైడ్రా బాస్.. చెరువుల ఆక్రమణదారులు ఖల్లాస్! రంగనాథ్ మాస్టర్ ప్లాన్ ఇదే!
Advertisement

Lake Development: భాగ్యన‌గ‌రంలోని చెరువుల అభివృద్ధిని వేగం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ అధికారుల‌ను ఆదేశించారు. చెరువులలో మురుగు నీటిని వెంట‌నే తొల‌గించాల‌ని సూచించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి ఎక్కడా త‌గ్గ‌కుండా చూడాలన్నారు. రామచంద్రాపురంలోని గంగారం చెరువుతో పాటు.. ఈర్ల చెరువును హైడ్రా ‌కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ బుధ‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు.

హైడ్రా రెండో విడ‌త చేప‌డుతున్న‌14 చెరువుల‌లో ఈ రెండు చెరువులు కూడా ఉన్నాయ‌నే విష‌యం విధిత‌మే. వ‌ర‌ద కాలువ ద్వారానే కాకుండా… నేరుగా మురుగు వివిధ ప్రాంతాల్లో చెరువులోకి ప్ర‌వేశించ‌డం, గుర్ర‌పు డెక్క‌తో చెరువులు దుర్గంధ‌భ‌రితంగా మార‌డానికి గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలించారు. చెరువుల్లోకి నేరుగా మురుగు నీరు చేర‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్షించారు. మురుగు కాలువ‌ల‌న్నిటినీ అనుసంధానం చేసి ఎస్‌టీపీ వ‌ద్ద ట్రీట్ అయిన త‌ర్వాతే చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు.

Advertisement

గంగారం చెరువు 111 ఎక‌రాల మేర విస్త‌రించి ఉంది. అలాగే ఈర్ల చెరువు 32 ఎక‌రాల వ‌ర‌కూ ఉంది. ఈ చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలు ఎట్టి ప‌రిస్థ‌తుల్లోనూ త‌గ్గ‌వ‌ద్ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ అధికారుల‌ను ఆదేశించారు. బ‌ఫ‌ర్ జోన్‌తో పాటు..చెరువుల వ‌ద్ద ఉన్న ప్ర‌భుత్వ భూమిని కూడా కాపాడాల‌న్నారు.

పార్కులు, పిల్ల‌ల ప్లే ఏరియాలు, అన్ని వ‌య‌సుల‌వారు సేద దీరేలా సీటింగ్ ఏర్పాట్లు అన్నీ అందుబాటులోకి రావాల‌ని సూచించారు. చెరువుచుట్టూ ఎత్తుగా పెరిగి నీడ‌నిచ్చే చెట్ల‌ను కూడా పెంచేందుకు అవ‌స‌రమైన స్థ‌లం ఉండేలా చూడాల‌ని సూచించారు. చెరువుల్లోకి మురుగు నీరు నేరుగా చేర‌కుండా ఎస్‌టీపీలు ఏర్పాటుకు.. మురుగు నీరు సెడిమెంటేష‌న్ పాండ్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స్థ‌లం ఉండేలా చూసుకోవాల‌ని సూచించారు. హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ వ‌ర్ల‌పాప‌య్య గారితో పాటు ప‌లువురు అధికారులు ఈ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

Advertisement

Also Read: రన్‌వేపై నిలిచిన విమానం.. లోపల ఊపిరాడక ప్రయాణికుల విలవిల!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×