E-Paper
Advertisement

Budget Smartphones: రూ.20,000 బడ్జెట్‌లో.. తోపు స్మార్ట్ ఫోన్స్ భయ్యా.. ఫీచర్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Budget Smartphones: రూ.20,000 బడ్జెట్‌లో.. తోపు స్మార్ట్ ఫోన్స్ భయ్యా.. ఫీచర్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Advertisement

Budget Smartphones: ప్రముఖ మెుబైల్స్ బ్రాండ్స్ ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్త మోడల్స్ ను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నవారికి వాటిలో ఏది ఎంచుకోవాలన్న కన్ఫ్యూజన్ ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో రూ.20,000 బడ్జెట్ లో మార్కెట్ లోని టాప్ – 5 మెుబైల్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేసి.. మీ అభిరుచులకు అనుగుణంగా ఉన్న దానిని పరిశీలించండి.

OPPO K14 5G

ఒప్పో కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్.. 7000mAh పవర్ ఫుల్ బ్యాటరీతో వచ్చింది. ఇది డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో వర్క్ చేస్తుంది. దీని ధర రూ.18,956గా నిర్ణయించారు. రూ.20 వేల లోపు బడ్జెట్ లో మంచి బ్యాటరీ ఫోన్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు.

Vivo T5x 5G

Advertisement

వివోకు చెందిన ఈ ఫోన్ ఏకంగా 7200mAh బ్యాటరీతో వచ్చింది. MediaTek Dimensity 7400 ప్రొసెసర్ తో రూపొందడం వల్ల ఇది మల్టీ-టాస్కింగ్, గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం నాణ్యమైన 32 MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. దీని ధర రూ.17,385గా ఉంది.

Samsung Galaxy A17 5G

రూ.20 వేల లోపు శాంసంగ్ ఫోన్ కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు. దీనిలో మెరుగైన వ్యూయింగ్ అనుభవం కోసం 6.7 అంగుళాల Super AMOLED డిస్‌ప్లేను అందించారు. భద్రత కోసం శామ్‌సంగ్ నాక్స్ (Knox) సెక్యూరిటీ, ఎక్కువ కాలం పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇచ్చారు. వెనుక భాగంగా 50MP ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 13MP సెల్ఫీ సెన్సార్ ను అందించారు. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ రూ.19,499కి అందుబాటులో ఉంది.

Moto G96 5G

Advertisement

మోటోరోలా ఫోన్లు ఎప్పుడూ ‘క్లీన్ ఆండ్రాయిడ్’ అనుభవాన్ని (Ad free UI) అందిస్తాయి. Moto G96 లో కూడా ఎటువంటి అనవసరమైన యాప్స్ లేకుండా సాఫీగా సాగే సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఇది అద్భుతమైన రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లేను కలిగి ఉండి.. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌ కు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. . వినియోగదారుల సౌకర్యం కోసం ఇందులో ‘థింక్ షీల్డ్’ సెక్యూరిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ రూ.18,999కి లభిస్తోంది.

iQOO Z11x

ఈ ఐకూ ఫోన్ లో శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్, వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం అందించారు. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో హై-ఎండ్ ప్రాసెసర్, గ్రాఫిక్స్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేసే FlashCharge టెక్నాలజీ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఫోన్ ధర రూ.18,999గా ఉంది.

Also Read: Aluminum Batteries: స్మార్ట్ ఫోన్స్ బ్యాటరీల్లో సంచలనం.. కొత్త టెక్నాలజీ వచ్చేస్తుందోచ్.. మీ కష్టాలు తీరినట్లే!

POCO M8 5G

పోకో ఎం సిరీస్ ఫోన్లు తక్కువ ధరలో అధునాతన ఫీచర్లను అందిస్తున్నాయి. POCO M8 అద్భుతమైన డిజైన్‌తో పాటు వేగవంతమైన 5G కనెక్టివిటీని కలిగి ఉంది. మల్టీమీడియా ప్రియుల కోసం ఇందులో లౌడ్ స్పీకర్లు, నాణ్యమైన డిస్‌ప్లేను అందించారు. బడ్జెట్ ధరలో మంచి ప్రాసెసర్, మెరుగైన కెమెరా సెటప్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఈ ఫోన్ రూ.17,999కు అందుబాటులో ఉంది.

Also Read: అదిరిపోయే లుక్, పిచ్చెక్కించే ఫీచర్లు.. అమేజ్‌ఫిట్ GTR 3 ప్రోపై 50% డిస్కౌంట్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×