E-Paper
Advertisement

ఫోన్‌తో పనేంటి బాస్? వాచ్‌తోనే కాల్స్ చేసేయండి.. సిమ్‌తో పనిచేసే స్మార్ట్ వాచెస్!

ఫోన్‌తో పనేంటి బాస్? వాచ్‌తోనే కాల్స్ చేసేయండి.. సిమ్‌తో పనిచేసే స్మార్ట్ వాచెస్!
Advertisement

SIM Smartwatch: సాధారణంగా స్మార్ట్‌వాచ్ అనగానే చాలామంది ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని నోటిఫికేషన్లు చూసుకునే ఒక యాక్సెసరీ మాత్రమే అనుకుంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. జేబులో మొబైల్ ఫోన్ లేకపోయినా.. నేరుగా వాచ్‌ నుంచే కాల్స్ మాట్లాడటానికి, మెసేజ్‌లు పంపడానికి, ఇంటర్నెట్ వాడటానికి వీలుగా ‘సిమ్ కార్డ్’ (eSIM/Physical SIM) సపోర్ట్ చేసే వాచ్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి. ప్రస్తుతం వీటిని ‘రిస్ట్ ఫోన్స్’ (Wrist Phones) అని కూడా పిలుస్తున్నారు. ముఖ్యంగా ఫోన్లను హ్యాండిల్ చేయలేని చిన్న పిల్లలు, ప్రతిచోటకూ స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లలేని పెద్దలకు ఇవి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాులో ఉన్న టాప్ – 5 రిస్ట్ వాచ్ లు, వాటి ప్రధాన ఫీచర్లేంటో ఈ కథనంలో చూద్దాం.

ఆపిల్ వాచ్ సిరీస్ 11

ఐఫోన్ యూజర్లకు ఇది ఒక పవర్‌హౌస్ లాంటిది. ఆపిల్ సంస్థ అందిస్తున్న లేటెస్ట్ సిరీస్ 11 సెల్యులార్ మోడల్.. అత్యుత్తమ 5G కనెక్టివిటీని కలిగి ఉంది. ఒకవేళ ఐఫోన్ ఇంట్లో మరిచిపోయినా, ఇందులో ఉండే eSIM ద్వారా ఈజీగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. మ్యాప్స్ వాడుకోవచ్చు. ఇందులో కొత్తగా వచ్చిన హైపర్‌టెన్షన్ (బీపీ) అలర్ట్స్, అడ్వాన్స్‌డ్ హార్ట్ రేట్ మానిటరింగ్, శాటిలైట్ కనెక్టివిటీ వంటి అత్యవసర ఫీచర్లు పెద్దలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్

Advertisement

శాంం‌సంగ్ ఫోన్లు వాడే వారికి ఇది పర్ఫెక్ట్ లగ్జరీ వాచ్. దీని రోటేటింగ్ బెజెల్ డిజైన్ ట్రెడిషనల్ వాచ్‌ లుక్‌ను ఇస్తుంది. దీనిలోని LTE (సిమ్) సపోర్ట్ ద్వారా ఫోన్ లేకుండానే నేరుగా కాల్స్, మెసేజ్‌లు చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జెమిని AI సపోర్ట్ ద్వారా వాయిస్ కమాండ్స్‌తోనే పనులు చక్కబెట్టొచ్చు. బాడీ కాంపోజిషన్ (శరీరంలో కొవ్వు శాతం), ఈసీజీ, స్లీప్ ట్రాకింగ్ వంటి అద్భుతమైన హెల్త్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆఫీస్ వేర్‌కు, స్టైలిష్ లుక్‌కు ఇది చక్కగా సరిపోతుందని శాంసంగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

గూగుల్ పిక్సెల్ వాచ్ 4

కర్వ్‌డ్ గ్లాస్ డిజైన్‌తో వచ్చిన ఈ వాచ్.. ఆండ్రాయిడ్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. దీని 4G/LTE వేరియంట్ ద్వారా కాలింగ్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఫిట్‌బిట్ (Fitbit) హెల్త్ ట్రాకింగ్ టెక్నాలజీ ఉండటం వల్ల ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కు ఇది చాలా బాగా నచ్చుతుంది. ప్రమాద సమయంలో రక్షించే ‘ఎమర్జెన్సీ శాటిలైట్ కనెక్టివిటీ’, కేవలం 15 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ అయ్యే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.

నాయిస్ జూనియర్ ఎక్స్‌ప్లోరర్ 2

Advertisement

6 నుండి 12 ఏళ్ల పిల్లల రక్షణ కోసం ఈ వాచ్ ను రూపొందించారు. ఇందులో 4G సిమ్ కార్డ్ వేసుకోవచ్చు. దీని ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రులకు నేరుగా వాయిస్, వీడియో కాల్స్ చేయవచ్చు. ఇందులో ఇన్-బిల్ట్ జీపీఎస్ (GPS) ఉండటం వల్ల పిల్లలు ఎక్కడ ఉన్నారో గూగుల్ మ్యాప్స్ ద్వారా తల్లిదండ్రులు ట్రాక్ చేయవచ్చు. సేఫ్ జోన్స్ (Geofencing) దాటితే వెంటనే అలర్ట్ వస్తుంది. అలాగే అపరిచిత వ్యక్తుల నుండి కాల్స్ రాకుండా బ్లాక్ చేసే ఫీచర్, ఎమర్జెన్సీ SOS బటన్ వంటి భద్రతా ప్రమాణాలు ఇందులో ఉన్నాయి.

Also Read: పర్యాటకానికి ‘ఫ్యూచర్’ కళ.. ఎకో టూరిజంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష

టిక్‌టాక్ 5 స్మార్ట్‌వాచ్

కేవలం పిల్లల భద్రత, కమ్యూనికేషన్ కోసమే దీనిని డిజైన్ చేశారు. 4G సిమ్ సపోర్ట్‌తో పాటు అద్భుతమైన లొకేషన్ ట్రాకింగ్, గ్రూప్ చాటింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తల్లిదండ్రులు అనుమతించిన కాంటాక్ట్స్ మాత్రమే ఇందులో సేవ్ అవుతాయి. స్కూల్ టైమ్‌లో పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా ‘క్లాస్ మోడ్’ కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు.

Also Read: ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు డిలీట్ అయ్యాయా? టెన్షన్ వద్దు మామ.. ఇలా చేస్తే చిటికెలో రికవర్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×