E-Paper
Advertisement

రూ.18 వేలలో ఈ రేంజ్ ఫీచర్లా? ఇవి కదా మిడిల్ క్లాస్ మెచ్చే.. పర్ఫెక్ట్ వాషింగ్ మిషన్లు!

రూ.18 వేలలో ఈ రేంజ్ ఫీచర్లా? ఇవి కదా మిడిల్ క్లాస్ మెచ్చే.. పర్ఫెక్ట్ వాషింగ్ మిషన్లు!
Advertisement

Washing Machines: ఇంట్లోని మహిళలకు అతి కష్టంగా అనిపించే పనుల్లో బట్టలు ఉతకడం ఒకటి. ఈ సమస్యకు చెక్ పెడుతూ ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లోనూ వాషింగ్ మిషన్లు దర్శనమిస్తున్నాయి. ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్లతో మహిళల కష్టానికి అవి ఉపశమనం కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంగా కొత్తగా టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ తీసుకునేవారికోసం టాప్ – 5 బెస్ట్ లిస్ట్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. రూ.18,000లోపు ధరలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఆ మిషన్లు, వాటి ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.

హైయర్ 8 కేజీ 5 స్టార్

ఇంట్లో 4-6 సభ్యులు ఉంటే ఈ వాషింగ్ మిషన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇది ప్రత్యేకంగా ఓషియానస్ వేవ్ డ్రమ్ ను కలిగి ఉంది. ఈ డ్రమ్ బట్టల వేగంగా నాణ్యత దెబ్బతినకుండా క్లీన్ చేస్తుంది. బ్రౌన్ గ్రే కలర్‌తో వచ్చే ఈ మిషన్.. ఇంటి లుక్ ను సైతం ప్రీమింయంగా మార్చేస్తుంది. తక్కువ నీటి ఒత్తిడి ఉన్నా కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

వర్ల్‌పూల్ 7 కేజీ మ్యాజిక్ క్లీన్

Advertisement

బోరు నీరు లేదా హార్డ్ వాటర్ వల్ల బట్టలు సరిగ్గా ఉతకడం లేదని బాధపడేవారికి ఈ వర్ల్‌పూల్ వర్ల్ పూల్ బెస్ట్ సొల్యూషన్. ఈ మిషన్ కఠినమైన ఉప్పు నీటిలోనూ డిటర్జెంట్‌ను పూర్తిగా కరిగించి బట్టలపై మురికిని సమర్థవంతంగా వదిలిస్తుంది. దీనిలోని 6th సెన్స్ టెక్నాలజీ బట్టల బరువును బట్టి ఎంత నీరు, ఎంత డిటర్జెంట్ కావాలో అదే నిర్ణయించుకుంటుంది. 5 సంవత్సరాల సుదీర్ఘ మోటార్ వారంటీతో ఇది వస్తుండటం విశేషం.

బాష్ 7 కేజీ పవర్ వేవ్ వాష్

పనితీరులో, మన్నికలో బాష్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మీడియం గ్రే కలర్‌లో వచ్చే ఈ మోడల్.. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంది. ఇది పవర్ వేవ్ వాష్ టెక్నాలజీతో రూపొందింది. డ్రమ్ లోపల నీటి అలలను శక్తివంతంగా తిప్పడం ద్వారా బట్టల మూలమూలల్లో ఉన్న మురికిని ఇది తొలగిస్తుంది. బట్టల పరిమాణాన్ని బట్టి 10 రకాల వాటర్ లెవెల్స్ ఎంచుకునే వీలుంది. దీనివల్ల నీరు అస్సలు వృథా కాదు.

ఐఎఫ్‌బీ 7 కేజీ డీప్ క్లీన్

Advertisement

వాషింగ్ మిషన్ రంగంలో.. టెక్నాలజీ పరంగా ఐఎఫ్‌బీ (IFB) ఎప్పుడూ ముందే ఉంటుంది. రూ. 18,000 లోపు బడ్జెట్ లోనే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌ను అందించారు. బట్టల ఫ్యాబ్రిక్ ఏంటో స్వయంగా గుర్తించి దానికి తగినట్లుగా వాష్ సైకిల్‌ను ఇది సర్దుబాటు చేసుకుంటుంది. ఇది డిటర్జెంట్‌ను నీటితో బాగా మిక్స్ చేసి బట్టల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తుంది. అలాగే లోపల బిల్ట్-ఇన్ ఆక్వా ఫిల్టర్ ఉండటం వల్ల నీటి నాణ్యత పెరగనుంది. మొండి మరకలను సైతం సులువుగా వదిలించే డీప్ క్లీన్ టెక్నాలజీ దీనిలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి.

Also Read: ఇంకా మౌస్ వాడుతున్నారా? ఈ షార్ట్‌కట్స్ తెలిస్తే.. ల్యాప్‌టాప్ వాడకంలో మీరే తోపు!

ఎల్‌జీ 7 కేజీ స్మార్ట్ టాప్ లోడ్

మార్కెట్లో మంచి గుడ్ విల్ కలిగిన కంపెనీల్లో ఎల్ జీ ఒకటి. మిడిల్ బ్లాక్ కలర్‌లో వచ్చే ఈ మిషన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇది స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీని కలిగి ఉంది. బట్టల బరువుకు తగ్గట్టుగా మోటార్ స్పీడ్‌ను కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల కరెంట్ బిల్లు చాలా తక్కువ రావడంతో రన్నింగ్ సమయంలో మోటార్ నుంచి నాయిస్ ఉండదు. మురికి అధికంగా ఉన్న బట్టల కోసం ఇందులో ప్రత్యేకంగా ఆటో ప్రీవాష్ ఆప్షన్ అందించారు.

Also Read: ఏసీ బాక్స్‌కు దుమ్ముపట్టిందా? నేరుగా నీళ్లతో కడగొచ్చా? లేదా? షాకింగ్ నిజాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×