E-Paper
Advertisement

భారత్‌లో boAt Airdopes ProClip లాంచ్.. తక్కువ ధరలో ప్రైవసీకి పక్కా గ్యారెంటీ!

భారత్‌లో boAt Airdopes ProClip లాంచ్.. తక్కువ ధరలో ప్రైవసీకి పక్కా గ్యారెంటీ!
Advertisement

boAt Airdopes ProClip: ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt భారత మార్కెట్లోకి సరికొత్త Airdopes ProClip ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. సాధారణంగా ఇలాంటి ఓపెన్-ఇయర్ మోడల్స్ ధరలు ఎక్కువగా ఉండటం, అలాగే పక్కనున్న వారికి కూడా సౌండ్ వినిపించేలా ఆడియో లీకేజ్ అవ్వడం వల్ల చాలామంది వీటిని కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ, బోట్ సంస్థ ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ.. కేవలం రూ.1,599 బడ్జెట్ ధరలోనే ఈ సరికొత్త ఇయర్‌బడ్స్‌ను మన ముందుకు తెచ్చింది.

సరికొత్త క్లౌడ్ ఫిట్ డిజైన్:

ఈ ఇయర్‌బడ్స్ బరువు చాలా తక్కువగా ఉండి, చెవులకు ఎంతో సౌకర్యవంతంగా అనిపిస్తాయి. ఇందులో ప్రత్యేకంగా అందించిన ‘క్లౌడ్ ఫిట్’ డిజైన్ వల్ల వీటిని రోజంతా పెట్టుకున్నా చెవుల నొప్పి అస్సలు తెలియదు. దీని ఫ్లెక్సిబుల్ లూప్స్ కారణంగా.. మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు, జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా ఇవి చెవుల నుంచి అస్సలు జారిపడవు.

Advertisement

Also Read: జియో సంచలనం.. రూ.800 లోపే లైవ్ లొకేషన్ ట్రాకింగ్, యూపీఐ పేమెంట్స్ ఉన్న 4G ఫోన్!

ప్రైవసీకి పక్కా గ్యారెంటీ:

ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్‌లో ఆడియో లీకేజ్ అనేది పెద్ద మైనస్. అయితే బోట్ దీనికోసం ‘సోనిక్ సీల్’ టెక్నాలజీని ఉపయోగించింది. దీనివల్ల మీరు పాటలు వింటున్నా లేదా ఫోన్ మాట్లాడినా పక్కన కూర్చున్న వారికి ఆ శబ్దాలు అస్సలు వినపడవు. అంటే బడ్జెట్ ధరలోనే మీకు పక్కా ప్రైవసీ లభిస్తుందన్నమాట.

చుట్టూ జరిగే విషయాలపై అవగాహన:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఇవి చెవి లోపలికి పూర్తిగా వెళ్లకుండా పైనే ఉంటాయి. దీనివల్ల పాటలు వింటున్నప్పటికీ.. ట్రాఫిక్ సౌండ్స్, అనౌన్స్‌మెంట్లు లేదా ఎవరైనా మనల్ని పిలిచే శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి. రోడ్లపై నడిచేటప్పుడు, బైక్ నడిపేటప్పుడు సురక్షితంగా ఉండటానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్:

బోట్ సంస్థ తమ ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఎయిర్‌డోప్స్ ప్రొక్లిప్‌ను కూడా నోయిడాలోని కాలిఫోనిక్స్ ప్లాంట్‌లో స్థానికంగానే తయారు చేశారు. ప్రస్తుతం ఇవి వైట్, గ్రే, వైన్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయి. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ అధికారిక వెబ్‌సైట్లలో కొనుగోలు చేయవచ్చు.

Also Read: సరికొత్త రికార్డ్.. అత్యంత సన్నని ఫోన్‌ను లాంచ్ చేసిన టెక్నో.. ఫీచర్లు, ధర వివరాలు మీ కోసం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×