E-Paper
Advertisement

Realme P1, P1 Pro Sale: Realme సేల్ రెడీ.. ధర, ఆఫర్ల వివరాలు ఇవే.. డోంట్ మిస్ ఇట్!

Realme P1, P1 Pro Sale: Realme సేల్ రెడీ.. ధర, ఆఫర్ల వివరాలు ఇవే.. డోంట్ మిస్ ఇట్!
Advertisement

Realme P1 & P1 Pro Sale: ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్ మి ఈ నెల స్టార్టింగ్‌లో భారతదేశంలో Realme P1 సిరీస్‌లో Realme P1 5G, Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లను గతవారం లాంచ్ చేసింది. అయితే ఈ రెండు ఫోన్‌లలో Realme P1 Pro సేల్ మాత్రమే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానుంది. ఆసక్తిగల కస్టమర్లు Realme.com లేదా Flipkart ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌‌ను కొనుగోలు చేసుకోవచ్చు. కాగా ఈ మొబైల్‌ను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య కొనుగోలు చేసే ఆఫర్లు లభిస్తాయి.

Realme P1 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 గా కంపెనీ నిర్ణయించింది. అయితే మొదటి సేల్‌లో భాగంగా.. 6GB వేరియంట్ కొనుగోలుపై రూ.1,000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అలాగే 8GB వేరియంట్ కొనుగోలుపై రూ.2,000 తగ్గింపును పొందొచ్చ. దీంతో 6జీబీ వేరియంట్ ధర రూ.14,999కి, 8జీబీ వేరియంట్ ధర రూ.16,999కి తగ్గుతుంది.

Advertisement

అయితే ఈ ఆఫర్లు కాకుండా పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Flipkart ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, SBI కార్డ్‌లను ఉపయోగించి కొనుగోళు చేస్తే అదనంగా మరో రూ.2,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. కాగా ఈ వేరియంట్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫీనిక్స్ రెడ్, పీకాక్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: రీఛార్జ్ ప్యాక్ ధరకే 8/128 జీబీల స్మార్ట్‌ఫోన్.. ఇది చాలా హాట్ గురూ!

Advertisement

అయితే Realme P1 Pro 5G వేరియంట్ ధర, ఆఫర్ల విషయానికొస్తే.. రియల్ మి పి1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 గా లిస్ట్ అయింది. అయితే Realme రెండు వేరియంట్‌ల కొనుగోలుపై రూ.2,000 తక్షణ బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. దీంతో 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999కి, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999కి తగ్గుతుంది.

అంతేకాకుండా దీనిపై మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌‌ను ఉపయోగించి కొనుగోళ్లకు చెల్లించవచ్చు. ఈ మోడల్ కూడా రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఫీనిక్స్ రెడ్, పారోట్ బ్లూ కలర్ ‌ఆప్షన్లను కలిగి ఉంది. అందువల్ల ఆసక్తిగల కస్టమర్లు మంచి ధరలో వీటిని కొనుక్కోవాలనుకుంటే ఇదే చక్కటి అవకాశం.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×