// // Smartphone Battery | మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా చెడిపోకుండా ఈ టిప్స్ పాటించండి -->
E-Paper
Advertisement

Smartphone Battery : మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందా?.. ఇలా చేస్తే సమస్యకు చెక్!

Smartphone Battery : మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందా?.. ఇలా చేస్తే సమస్యకు చెక్!
Advertisement

Smartphone Battery Charging Mistakes | ప్రస్తుత పరుగుల జీవనంలో సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. మన సెల్ ఫోన్ చెడిపోయినా లేదా స్విచ్ ఆఫ్ చేసినా మనం చేసే చాలా పనులు ఆగిపోతాయి. స్మార్ట్‌ఫోన్ పని చేస్తూ ఉండాలంటే ముఖ్యంగా అందులో ఎప్పడూ బ్యాటరీ చార్జింగ్ ఉండాలి. అప్పుడే అది పనిచేస్తుంది. మొబైల్ ఫోన్ సరిగ్గా పనిచేయాలంటే దాని బ్యాటరీ మంచి స్థితిలో ఉండటం ముఖ్యం. పాత ఫోన్‌లలో బ్యాటరీ పవర్ తక్కువగా ఉండటం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు కొత్త ఫోన్‌లలో కూడా బ్యాటరీ డ్రెయిన్ సమస్యలు మొదలవుతాయి. మీరు చేసే తప్పుల వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది లేదా పాడైపోతుంది. బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోయేందకు మీరు ఏ తప్పులు చేస్తున్నారో? తెలుసుకోండి. వీటిని నివారించడం ద్వారా మీరు మీ ఫోన్ బ్యాటరీ జీవితాన్ని పెంచుకోవచ్చు.

పదే పదే 100 శాతం వరకు ఛార్జ్ చేయవద్దు: తమ ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచినప్పుడు అది 100 శాతం పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత మాత్రమే దాన్ని తీసివేస్తారు. మీ ఫోన్ 85 నుండి 90 శాతం ఛార్జ్ అయి ఉంటే దానిని ఛార్జింగ్ నుంచి తీసివేయండి. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు 30 నుండి 80 శాతం మధ్య బాగా పనిచేస్తాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అలాగే రాత్రుల్లో కూడా ఫోన్‌ ఛార్జింగ్‌ అలాగే పెట్టి వదిలేయవద్దు. దీని వల్ల కూడా బ్యాటరీ దెబ్బతింటుంది.

Advertisement

బ్యాటరీ పూర్తిగా అయిపోనివ్వకండి: బ్యాటరీ 1-2 శాతం మిగిలి ఉన్నప్పుడు లేదా పూర్తిగా ఖాళీ అయినప్పుడు ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడం మనం చాలాసార్లు చూశాము. ఈ అలవాటు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూడా నాశనం చేస్తుంది. మీ ఫోన్ బ్యాటరీని ఎల్లప్పుడూ కనీసం 25 శాతం వద్ద ఉంచడానికి ప్రయత్నించండి. దీనివల్ల బ్యాటరీ బాగా పనిచేస్తుంది.

Also Read: మీ ఫోన్‌లో వాట్సాప్ ప్రైవేట్ మెసేజ్‌లు ఎవరూ చదవకూడదంటే.. సెట్టింగ్స్ లో ఇవి మార్చండి

Advertisement

ఛార్జింగ్‌ చేస్తూ ఫోన్‌ను ఉపయోగించవద్దు: చాలా సార్లు ప్రజలు గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, చాటింగ్, వీడియో కాలింగ్ చేస్తున్నప్పుడు తమ ఫోన్‌లను ఛార్జ్‌లో ఉంచుతారు. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించడం వల్ల బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే మీ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఉపయోగించకండి.

బ్యాటరీ సేవింగ్ మోడ్: మీ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంటే ఈ పరిస్థితిలో బ్యాటరీ సేవింగ్స్ మోడ్ లేదా స్మార్ట్ బ్యాటరీ ఆప్షన్ మోడ్‌ని ఉపయోగించండి. ఈ ఫీచర్ బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో బాగా సహాయపడుతుంది. మీరు బ్యాటరీ సేవింగ్ మోడ్‌ని ఉపయోగించినప్పుడు ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్ యాప్‌లు మాత్రమే నడుస్తాయి. ఇది బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తుంది. బ్యాటరీపై అదనపు ఒత్తిడిని కలిగించదు.

అప్‌డేట్‌ చేస్తూ ఉండండి : చాలా మంది వినియోగదారులు నెలల తరబడి తమ సెల్ ఫోన్‌లను అప్‌డేట్ చేయరు. దీని వల్ల సెల్ ఫోన్ బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. అందువల్ల కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చినప్పుడు మీ సెల్ ఫోన్‌ను అప్‌డేట్ చేయడం ముఖ్యం. ప్రతి స్మార్ట్‌ఫోన్ కంపెనీ దాని అప్‌డేట్‌లకు బ్యాటరీ సంబంధిత ఫీచర్స్‌ను జోడిస్తుందని గుర్తుంచుకోండి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×