E-Paper
Advertisement

ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 4 చిట్కాలతో.. ఇంటి పైకప్పును ఐస్‌లా మార్చేయండి!

ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 4 చిట్కాలతో.. ఇంటి పైకప్పును ఐస్‌లా మార్చేయండి!
Advertisement

Roof Cooling Tips: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఫలితంగా ఇంటిమీద నేరుగా సూర్యకిరణాలు పడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అయితే 4 సులువైన చిట్కాలు పాటించడం ద్వారా ఇంటి పైకప్పును కూల్ గా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఏసీలు, కూలర్లు అవసరం లేకుండానే ఇంటిని చల్లగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవి? అవి ఏ విధంగా పనిచేస్తాయో ఈ కథనంలో చూద్దాం.

కూల్ రూఫ్ పెయింటింగ్

ఇంటి పైకప్పును సూర్య కిరణాల నుంచి రక్షించడంలో కూల్ పెయింట్ అద్భుతంగా పనిచేయనుంది. ఇంటి పైకప్పుకు తెల్లటి సున్నం (Lime) లేదా మార్కెట్లో దొరికే కూల్ రూఫ్ కోటింగ్ పెయింట్ వేయండి. తెల్ల రంగు సూర్యకిరణాలను తిరిగి వెనక్కి పంపేస్తుంది. దీనివల్ల స్లాబ్ వేడెక్కదు. ఇది తక్కువ ఖర్చుతో ఒక్క రోజులో ఫినిష్ చేయవచ్చు.

గోనె సంచులు

Advertisement

ఇంట్లో ఉండే ఖాళీ జూట్ (గోనె) సంచులు లేదా కొబ్బరి పీచును ఇంటి పైకప్పును కూల్ గా ఉంచేందుకు ఉపయోగించవచ్చు. ఇందులో భాగంగా తొలుత శ్లాబ్ మీద గోనె సంచులను పరవండి. అనంతరం రోజుకు రెండు లేదా మూడు సార్లు వాటిపై నీళ్లు చల్లండి. ఆ తేమ వల్ల పైకప్పు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఫలితంగా ఇంటి గదుల్లోకి వేడి అస్సలు రాదు.

టెర్రస్ మెుక్కల పెంపకం

ఇంటి డాబా పైన కుండీలలో చిన్న చిన్న మొక్కలు, ఆకుకూరలు, తీగ జాతి మొక్కలను పెంచండి. మొక్కల నీడ నేరుగా స్లాబ్‌పై పడటం వల్ల పైకప్పు వేడెక్కదు. పైగా మొక్కలకు మనం పోసే నీరు కూడా రూఫ్‌ను చల్లబరుస్తుంది. దీనివల్ల ఇల్లు చల్లబడటంతో పాటు.. తాజా కూరగాయలు కూడా లభిస్తాయి.

Advertisement

Also Read: సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!

మట్టి కుండలు

డాబా పైన ఖాళీ మట్టి కుండలను బోర్లించి పెట్టడం లేదా ఎర్ర ఇటుకలను ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఇస్తూ అమర్చడం వల్ల సూర్యకిరణాలు నేరుగా సిమెంట్ స్లాబ్‌పై పడవు. పైగా ఆ ఇటుకల మధ్య నుండి గాలి ప్రవహించడం వల్ల వేడి కిందకు దిగకుండా ఆగిపోతుంది. తద్వారా ఇంట్లోని గదులు చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటాయి.

Also Read: అధికారంలోకి వస్తే.. హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు.. కేటీఆర్ కీలక హామీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×