E-Paper
Advertisement

IPL 2026 playoffs: క్వాలిఫైయర్‌, ఎలిమినేట‌ర్ మధ్య తేడా ఏంటి ? వ‌ర్షం ప‌డితే రిజ‌ర్వ్ డేలు ఉంటాయా ?

IPL 2026 playoffs: క్వాలిఫైయర్‌, ఎలిమినేట‌ర్ మధ్య తేడా ఏంటి ? వ‌ర్షం ప‌డితే రిజ‌ర్వ్ డేలు ఉంటాయా ?
Advertisement

IPL 2026 playoffs:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. రేపటి నుంచి ప్లే ఆఫ్స్ పోరు ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్ 1 రేపు ధర్మశాల వేదికగా నిర్వహించనున్నారు. ఇక ఎల్లుండి అంటే మే 27వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు న్యూ చండీగఢ్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత క్వాలిఫైయర్ 2 తో పాటు ఫైనల్స్ మే 31వ తేదీన నిర్వహించనున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్స్ ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

క్వాలిఫైయర్‌, ఎలిమినేట‌ర్ మధ్య తేడా ఏంటి ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్లే ఆఫ్స్ (IPL playoffs format ) రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అసలు క్వాలిఫైయర్ 1,2 అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ లు అంటే ఏంటి అని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కొంతమందికి వీటిపై అవగాహన లేకపోవడంతో… తెగ సెర్చ్ చేస్తున్నారు. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న బెంగుళూరు అలాగే గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్ రేపు జరగనుండగా ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు దూసుకు వెళ్తుంది. ఓడిన మరో జట్టుకు.. ఇంకో అవకాశం కూడా ఉంటుంది. క్వాలిఫైయర్ 2లో అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఓడిపోయిన జట్టుకు కల్పించింది బీసీసీఐ. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో ఓడిపోతే నేరుగా ఇంటికి వెళ్లాల్సిందే. ఇక గెలిచిన జట్టు, క్వాలిఫైయర్ 2 ఆడాల్సి ఉంటుంది. అంటే క్వాలిఫైయర్ 1 లో ఓడిన జట్టుతో ఈ ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన టీమ్ తలపడుతుంది. ఇక ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్ కు వెళ్తుంది. అప్పుడు ఫైనల్స్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు విజేతగా ప్రకటించబడతారు.

ప్లే ఆఫ్స్ కు వర్షం పడితే ఎలా ?

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో వర్షం పడితే ఎలాంటి రిజర్వుడే ఉండదు. కేవలం ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే రిజర్వుడే ఉంచారు. నిజంగానే ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు వర్షం విలన్ గా మారితే… కొన్ని రూల్స్ అమల్లోకి తీసుకువస్తారు. మ్యాచ్ నిర్ణిత సమయానికంటే ఎక్కువగా అంటే దాదాపు రెండు ఇరవై నిమిషాల పాటు వేచి చూడాల్సిందే. అంటే అర్థరాత్రి అయినా కూడా సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. భారీ వర్షం పడి తగ్గితే… కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి అంపైర్లు నిర్ణయం తీసుకుంటారు. 5 ఓవర్ల మ్యాచ్ కుదరకపోతే సూపర్ ఓవర్ అయినా నిర్వహించాల్సిందే. అలా కుదరకపోతే పాయింట్ల పట్టికలో ఎవరు ముందు స్థానంలో ఉంటే వాళ్ళను విజేతగా నిర్ణయిస్తారు. క్వాలిఫైయర్ 1,2 అలాగే ఎలిమినేటర్ లో పై విధంగానే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఫైనల్స్ విషయానికి వస్తే రిజర్వుడే కచ్చితంగా ఉంటుంది. రిజర్వుడే రోజున వర్షం పడితే, పాయింట్ల పట్టిక ఆధారం చేసుకుని విజేత‌ను ప్రకటిస్తారు.

Advertisement

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×