E-Paper
Advertisement

Vivo X300 Ultra: అన్ని అంచనాలు దాటేసిన వివో X300 అల్ట్రా.. కెమెరా నుంచి పెర్ఫార్మెన్స్ వరకు అన్నీ సెన్సేషనే!

Vivo X300 Ultra: అన్ని అంచనాలు దాటేసిన వివో X300 అల్ట్రా.. కెమెరా నుంచి పెర్ఫార్మెన్స్ వరకు అన్నీ సెన్సేషనే!
Advertisement

Vivo X300 Ultra: ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి రానుంది. Vivo X300 Ultra పేరుతో రానున్న ఈ ఫోన్ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ సర్టిఫికేషన్‌లో తాజాగా కనిపించింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా లీక్‌ల ప్రకారం.. గతేడాది విడుదలైన Vivo X200 Ultraలో ఉన్న ప్రత్యేక ఫిజికల్ కెమెరా బటన్‌ను తొలగించే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ మార్చి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాల అంచనా. ఇప్పుడీ వివో X300 అల్ట్రా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ Vivo X300 Ultra ఫోన్ మార్చి 14, 2026న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 2026 రెండవ త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ సిరీస్‌లో అల్ట్రా మోడల్ అంతర్జాతీయంగా విడుదల కావడం ఇదే మొదటిసారి కావచ్చు. వివో X300 అల్ట్రా ప్రారంభ ధర సుమారు రూ.79,990 ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Advertisement

Also Read: వచ్చేసింది మినీ ప్రొజెక్టర్.. జేబులో పట్టేంత ఈ బుజ్జి గ్యాడ్జెట్ 100 అంగుళాల టీవీతో సమానం!

ఈ ఫోన్ వెనుక భాగంలో, ZEISS ఆప్టిక్స్‌తో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అమర్చారు. దీనిలో OISతో కూడిన 200MP సోనీ LYT-901 మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, మల్టీ డైరెక్షనల్ PDAFతో కూడిన 200MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండనుంది. అలాగే ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుందని అంచనా. 7000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే ఈ ఫోన్ 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వనుంది.

Advertisement

అలాగే ఈ వివో X300 అల్ట్రా ఫోన్.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల ఫ్లాట్ ఎల్‌టీపీఓ AMOLED 2K డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. ఇది సన్నని బెజెల్స్‌తో పాటు హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్‌ రేటింగ్‌తో రావచ్చని అంచనా. దీంతో పాటు IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను పొందే అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండచ్చు.

ఇకపోతే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే 16GB వరకు RAM + 512GB లేదా 1TB యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ ఆప్షన్‌లను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. వివో X300 అల్ట్రా ఫోన్ Vivo కలర్‌ఓఎస్ 6 స్కిన్‌తో Android 16పై పనిచేస్తుందని భావిస్తున్నారు.

Also Read: బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. రియల్‌మీ నియో 8 ఫీచర్లు తెలిస్తే ఎగిరి గంతులేస్తారు బాస్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×